విద్యార్థులే ఉపాధ్యాయులైనా వేళా..

విద్యార్థులే ఉపాధ్యాయులైనా వేళా..

లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో వినూత్న కార్యక్రమం

దుగ్గొండి, నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక రోజు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం స్కూల్ కరస్పాండెంట్ గట్టి కొప్పుల విజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు బూరగాని నెహ, బి. వర్షిక, అమృత, తరుణి, కె. సంకీర్తన, ఎస్. విజయ, జె. శ్రీజన్, బి. హర్షవర్ధన్, కాంతి, కె. వరుణ్, మునీశ్వర్, సాత్విక్, అభిలాష్, జె. వరుణ్, బి. రాంచరణ్ వివిధ శాఖల అధ్యాపకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాధిక, యన్. సుప్రజ, చైతన్య, జీవన్, పి. సుధాకర్, విష్ణు, క్రిష్ణ తదితరులు హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version