తక్కలపల్లి రవీందర్ రావు బిఆర్ఎస్ కోఆర్డినేటర్ నియామకం

బిఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా తక్కలపల్లి రవీందర్ రావు..

నియామకపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

ఖానాపురం మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ పార్టీ నేత తక్కల్లపల్లి రవీందర్ రావును బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తక్కల్లపల్లి రవీందర్ రావుకు నియామకం చేసినట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మాజీ ఎంపీపీ తక్కల్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో భారత్ రాష్ట్ర సమితి పార్టీ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా తమవంతు కృషి చేస్తానని రవీందర్ రావు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, జిల్లా నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి,మాజీ ఎంపీపీ లు వేములపల్లి ప్రకాష్ రావు,నల్ల మనోహర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్,నర్సంపేట మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, ఖానాపూర్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, నెక్కొండ మండల సీనియర్ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, చెన్నారావుపేట మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీ జక్కా అశోక్, మాజీ కౌన్సిలర్లు నాగిశెట్టి ప్రసాద్ గందం చంద్రమౌళి, నల్లబెల్లి మాజీ సర్పంచ్ నానెబోయిన రాజారాం ,పట్టణ పార్టీ ముఖ్య నాయకులు బీరం నాగిరెడ్డి, సంపంగి సాలయ్య, బుర సుమన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version