పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్‌కు ఎస్పీ ప్రశంసా పత్రం ఇచ్చారు
భూపాలపల్లి నేటిధాత్రి
సమర్థవంతమైన వాదనలతో కేసుల్లో దోష నిర్ధారణ సాధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్‌కు ప్రశంసా పత్రం
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ, క్రిమినల్ కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించి న్యాయం జరిగేలా కృషి చేస్తున్న అధికారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎదులాపురం శ్రీనివాస్ ని ప్రశంసించారు.
ఎదులాపురం శ్రీనివాస్ సమర్థవంతమైన వాదనలు న్యాయపరమైన కృషి ద్వారా మొత్తం 12 కేసుల్లో దోష నిర్ధారణ సాధించారు. అందులో 7 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో కనీసం 10 సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది.
క్రిమినల్ కేసుల్లో నిందితులకు తగిన శిక్షలు పడేలా కృషి చేసి న్యాయం సాధించడంలో విశేష పాత్ర పోషించినందుకు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ చేతుల మీదుగా ఎదులాపురం శ్రీనివాస్ ప్రశంస పత్రం అందుకోవడం జరిగింది.
