కొత్తకాపు కోటను బద్దలు కొట్టిన కుడిముస్కుల కుటుంబం..

కొత్తకాపు కోటను బద్దలు కొట్టిన కుడిముస్కుల కుటుంబం

◆-: నువ్వా నేనా అన్నట్టు సాగిన ఇరువురి హోరాహోరీ రాజకీయలు

◆-: సజ్జపూర్ సర్పంచ్ గా 254 ఓట్లతో విజయం సాధించిన కె పద్మావతి

◆-: రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తయారు చేయడమే తమ లక్ష్యం

◆-: అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించి సమన్యాయం చేస్తాం

◆-: సామాజిక సేవలతో నిత్యం ప్రజల మనసులు గెలుచుకున్న కె ప్రసాద్ రెడ్డి

◆-: సర్పంచ్ పదవి తమపై మరింత బాధ్యత పెంచింది

◆-: పేదల కోసం త్వరలో మరిన్ని సేవ కార్యక్రమలు చేపడతం

◆-: తమ విజయం గ్రామ ప్రజలకు అంకితమన్న నాయకులు కె ప్రసాద్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, స్వగ్రామంలో అడుగుపెట్టగానే గ్రామంలో సమస్యలు స్వాగతం పలకడంతో “శ్రీమంతుడులి సినిమాను ఆదర్శంగా తీసుకొని గ్రామస్తులను తన దగ్గరికి పిలుచుకొని గ్రామం కోసం తన వంతు సహకరంగా గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు గ్రామస్తులతో చర్చించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ప్రమాణం చేస్తూ లక్షల రూపాయల తన సొంత ఖర్చులతో గ్రామంలో నెలకొన్న పరిశుధ్యాన్ని, దాని వల్ల వచ్చే రోగాలను అరికాడతనని మాట ముందుకు సాగిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుడిముస్కుల ప్రసాద్ రెడ్డి. వస్తువస్తునే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తూ అన్ని మతాల వారికి తన సొంత ఖర్చులతో అభివృద్ధి పనులు చేశారు. గ్రామస్తుల సమస్యలను తమ సమస్యలుగా భావించి ఒక్కొక్కటిని పరిష్కరిస్తూ గ్రామంలోనే కాకుండా నియోజకవర్గ పరిధిలో పెరుగాంచారు.

కేవలం గ్రామంలోనే కాకుండా మండలంలోని పిచారేగడి పాత తండా, కొత్తూర్ పట్టి కోహిర్, చింతల్ ఘాట్ గ్రామాల్లో మురికి కాలువలను తన సొంత ఖర్చులతో నిర్మించి ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు. కోహిర్ మండలంలోని సజ్జపూర్ గ్రామంలో దశాబ్దాలు రాజకీయాన్ని తమ అధిపత్యంలో పెట్టుకున్న కొత్తకాపు కుటుంబనికి పెట్టని కోటగా ఉన్న సజ్జపూర్ గ్రామంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో జనరల్ మహిళ స్థానంలో తన తల్లి అయిన కుడిముస్కుల పద్మావతి ని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిపి సమీప ప్రత్యర్థిని 254 ఓట్ల తేడాతో ఓడించి సజ్జపూర్ గ్రామంలో కుడిముస్కుల కుటుంబ రాజకీయ విజయాన్ని నమోదు చేసి ఔరా అనిపించుకున్నారు. గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు తమపై మరింత బాధ్యత పెంచిందని, త్వరలో మరిన్ని సామాజిక సేవ కార్యక్రమాలు కొనసాగుతాయని, గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతమని, కులమతలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, తమ విజయం సజ్జపూర్ గ్రామ ప్రజలు మార్పు కోరుకోవడానికి సూచిక అని, తమ విజయం గ్రామ ప్రజలకు అంకితమన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version