చర్చి ఆస్తిని దీర్ఘకాల లీజుకు ఇవ్వడం అన్యాయం…
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ప్రాంతంలోని రెవ. జి.బి. గార్డెన్ మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చి కు ఉన్న ఆస్తిని అభివృద్ధి పేరుతో 99 సంవత్సరాల లీజుకు ఇవ్వాలనే కొన్ని శక్తుల ప్రయత్నాన్ని చర్చి సంఘాలు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ చర్చి ప్రాంగణం మిషనరీ రెవ. జి.బి. గార్డెన్ జహీరాబాద్ ప్రాంతంలోని పేద మరియు నిరక్షరాస్యుల అభ్యున్నతికి అంకితం చేస్తూ ఇచ్చిన పవిత్రమైన బహుమతి పుణ్య స్థలాన్ని కాపాడు
కోవాలి సంఘ సభ్యులు తెలిపారు.
కొత్త చర్చిని నిర్మించడానికి చర్చి సభ్యులు ఎంతో కష్టపడి, తమ సొంత శ్రమతో సహకారంతో నిర్మించుకున్నారని, ఇప్పుడు మాత్రం అదే చర్చి ఆస్తిని లీజుకు ఇచ్చి డబ్బు సంపాదించాలనే ప్రయత్నం జరుగుతుండటం బాధాకరమని సంఘ సభ్యులు అన్నారు.
ఇప్పటికే మెథడిస్ట్ చర్చి కి సంబంధించిన వేరే వేరే ప్రాంతాల్లో గల ఆస్తులను లీజుకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇప్పుడు జహీరాబాద్ సెంట్రల్ చర్చి ఆస్తిని లక్ష్యంగా చేసుకుని అదే విధంగా లీజుకు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతోందని సంఘ సభ్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో బిషప్ రెవ. సిమియోన్, డి.ఎస్ ఎస్. హెచ్. హెర్బర్ట్ మరియు వారి బృందం కొంతమంది బౌన్సర్లతో కలిసి చర్చి ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, చర్చి సభ్యులు ఐక్యంగా నిలబడి వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో బౌన్సర్లతో కలిసి చర్చి సభ్యులపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సంఘ సభ్యులు ఆరోపించారు.
చర్చి ఆస్తిని దీర్ఘకాల లీజుకు ఇవ్వడం అన్యాయమని పేర్కొంటూ, చర్చి హక్కులను ఆస్తులను కాపాడేందుకు సంఘం ఐక్యంగా పోరాడుతుందని తెలిపారు. ఇందు ములంగ 1931 స్కూల్ ప్రాంబైనప్పటి నుండి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు అన్ని మతాల వారు తమకు. మద్దతు తెలుపగలరు అని మనవి చేసినారు
