సీతారాముల కల్యాణానికి 5,016 రూపాయల విరాళం
ఇందారం వార్డు సభ్యులు బేదా లాస్య- ప్రసాద్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఇందారం వార్డు సభ్యులు బేద లాస్య – ప్రసాద్ తమ ఉదారతను చాటుకున్నారు.
మంగళవారం ఆలయ కమిటీని కలిసి,కల్యాణోత్సవ ఏర్పాట్ల నిమిత్తం రూ. 5,016/- నగదును విరాళంగా అందజేశారు.అలాగే స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు నిర్వహించే అన్నదాన కార్యక్రమం కోసం 25 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం వల్ల అందరికీ శుభం చేకూరుతుందని, తమ వంతుగా ఈ చిన్న సాయం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.దాతలైన బేద లాస్య – ప్రసాద్ లను టేకుమట్ల ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బల్ల వెంకటేష్,మాజీ సర్పంచ్ గొనె నర్సయ్య,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
