*ఇఫ్తార్ విందులో పాల్గొన్నా.
….*
◆-:-మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ పట్టణంలోని భరత్ ఫంక్షన్ హాల్ లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కోహిర్ పట్టణ మరియు మండల ముస్లిం ప్రజలందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యఖంగా నిరుపేద మైనారిటీ ముస్లిం ప్రజలందరికీ అందిస్తున్న ఈద్౼ఖ౼తోఫా పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోహిర్ మునిసిపల్ ఛైర్మెన్ అశోక్ కుమార్ వైస్ చైర్మన్ హన్నన్ జావీద్ ,పట్టణ అద్యక్షులు శంషీర్ అలీ , మాజీ ఎంపీపీ షౌకత్ అలీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్ , మోయిజ్ వార్డు కౌన్సలర్ల్స్ వివిధ గ్రామాల సర్పంచులు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, ఎంఆర్ఓ, తదితరులు పాల్గొన్నారు
