తిరుపతిలో కల్తీ లడ్డుపై టిడిపి ఆగ్రహం, భక్తులను రక్షించాలి

*తిరుపతిని,దేవుడిని అప పవిత్రం చేయకండి…

*టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం..

తిరుపతి( నేటి ధాత్రి:

తిరుమల ఆధ్యాత్మిక ధర్మక్షేత్రం, హిందువుల మనోభావాలకు, భక్తులకు నిలువెత్తు నిదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి అని, అటువంటి స్వామిని, టిటిడిని గత ప్రభుత్వ వైసిపి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్,ఈవో, సభ్యులు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారని, లడ్డులో నెయ్యి బదులు మోనో లేజర్ లైట్ కెమికల్ రసాయన పదార్థం జంతువుల కొవ్వు నుండి వస్తుందని ఉన్నారు. అటువంటి రసాయనాన్ని లడ్డు కల్తీలో వాడారని, తిరుపతిని, దేవుడిని అప పవిత్రం చేయకుండని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం అన్నారు. లడ్డు నాణ్యతను, కల్తీ విసయాన్ని కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ వేశారన్నారు. భక్తులు కల్తీ లడ్డును తినడం ద్వారా 50% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోపించారు. భక్తి భావం, సేవ పదాలకు అర్థం తెలియని మూర్ఖులు ఉజ్జయిని, ఇతర రాష్ట్రాల శివాలయాలు తిరిగి, ఇప్పుడు హోమాలు నిర్వహిస్తే చేసిన తప్పులు చెరిగిపోవున్నారు. ఇంకా ఐదేళ్ల పాలన ప్రజలు వైసీపీకి ఇచ్చి ఉంటే వెంకటేశ్వర స్వామి పక్కన జగన్ ఫోటో, లడ్డు కవర్ల పైన జగన్ ఫోటో పెట్టాలని టిటిడి బోర్డు లో తీర్మానం చేసే వాళ్ళని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ, టిడిపి బీసీ సెల్ నాయకులు కృష్ణ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మధుబాబు,టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ వెంకట పుష్పావతి యాదవ్, హేమంత్, విశ్వనాథం, నంద, హైమావతి తదితరులు పాల్గొన్నారు..

శాయంపేటలో 40 కిలోల నకిలీ టీ పౌడర్ పట్టివేత

40 కిలోల కల్తీ టీ పౌడర్ పట్టివేత

ఫుడ్ సేఫ్టీ మరియు పోలీస్ అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

 

గూడెప్పాడ్ సెంటర్ సమీపం లో గల ఎమ్ ఎమ్ మార్ట్ లో వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి యు పోలీస్ శాఖ తనిఖీలు చేసి దాదాపు 40 కిలోల నకిలీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు అనం తరం ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి మరియు మౌనిక నకిలీటీపౌడర్ ను ఎలా గుర్తిం చాలో డెమో చేసి చూపించా రు. ఇట్టి టీ పౌడర్ ను హెయిర్ డై (జుట్టుకు వేసే రంగు)తో తయారు చేస్తున్నారు ఇట్టి రసాయనాలు వాడటం వల్ల ప్రజలకు క్యాన్సర్ వ్యాధి మరి యు ఇతర వ్యాధుల బారిన అవకాశాలు ఉన్నాయి కావున ప్రజలు నకిలీ ఇలాంటి పౌడ ర్లను వాడకూడదు. టీ పౌడర్ అమ్మే వారికి కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో పరకాల రూరర్ సీఐ రంజిత్ రావు శాయంపేట ఎస్సై పరమే శ్వర్ దామెర ఎస్సై కొంక అశో క్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణ మూర్తి, మౌనిక పాల్గొన్నారు.

వీర్యదాతకు అరుదైన క్యాన్సర్..

వీర్యదాతకు అరుదైన క్యాన్సర్.. ప్రమాదంలో 200 మంది చిన్నారుల ప్రాణాలు

ఓ వ్యక్తికి అరుదైన క్యాన్సర్ ఉన్న విషయం తెలియకుండా అతని నుంచి స్పెర్మ్‌ను తీసుకొని యూరప్ అంతటా దాదాపు 200 మంది పిల్లలను గర్భం దాల్చడానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆ చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.

యూరప్ అంతటా ఓ వీర్య దాత కారణంగా సుమారు 200 మంది చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. క్యాన్సర్ కు కారణం అయ్యే ఓ ప్రమాదకరమైన జన్యు లోపం ఉన్న వ్యక్తి కి సంబంధించిన స్పెర్మ్‌ను ఉపయోగించి గర్భం దాల్చారు. తద్వారా జన్మించిన పిల్లల శరీరంలోని ప్రతి కణంలో దీని ప్రభావం ఉంటుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్పెర్మ్ తో గర్భం దాల్చిన వారిలో కొంతమంది చిన్నారుల ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి చనిపోయినట్లు తేలడంతో ఇప్పుడు మిగిలిన పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
డెన్మార్క్‌కు చెందిన ఓ వ్యక్తి స్పెర్మ్ లో TP53 అనే జన్యువులో లోపం ఉంది.ఈ లోపంతో ఉన్న ఉన్న వాళ్ల స్పెర్మ్ తో పుట్టి పిల్లలకు ‘లి-ఫ్రామినీ సిండ్రమ్’ అనే ఓ అరుదైన వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు క్యాన్సర్ భారిన పడే అవకాశాలు తొంబై శాతం ఉంటుంది. ఈ సిండ్రోమ్ వల్ల రొమ్ము క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఎముక క్యాన్సర్లు (ఆస్టియోసార్కోమా) భారిన పడే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. డెన్మార్క్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ DR నివేదించిన తర్వాత ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క డెన్మార్క్‌లో 99 జననాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఓ విద్యార్థి డబ్బు కోసం 2005లో స్పెర్మ్ దానం చేశాడు. అతని నమూనాలను దాదాపు 17 ఏళ్ల పాటు వివిధ సంతాన సాఫల్య కేంద్రాలు ఉపయోగించాయి. అప్పట్లో సాధారణ స్క్రీనింగ్ టెస్ట్ లో ఈ జన్యు లోపాన్ని గుర్తించలేకపోయారు. డెన్మార్క్ కు చెందిన యురోపియన్ ఈ స్పెర్మ్ బ్యాంక్ ని 14 దేశాలలో దాదాపు 67 క్లీనిక్ లకు సరఫరా చేసింది.ఆ స్పెర్మ్‌ను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా కనీసం 197 మంది గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

2025లో వైద్యనిపుణులు ఈ అంశాన్ని గుర్తించి హెచ్చరించడంతో అసలు విషయం బయటపడింది. ఏది ఏమైనా ఈ దారుణ ఘటనతో స్పెర్మ్ దాతల స్క్రీనింగ్, సంతాన సాఫల్య చికిత్సల నిబంధనలలో నిర్లక్ష్యం బయటపడింది. దారుణం ఏంటంటే.. UK లో ఈ దాత స్పెర్మ్ ని దాదాపు పది కుటుంబాలు ఉపయోగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ జన్యుపరమైన లోపంతో ఉన్న చిన్నారులపై డాక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టి, క్యాన్సర్ ని తొలిదశలోనే రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version