మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల నిరసన…

మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల నిరసన

నర్సంపేట,నేటిధాత్రి:

జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు చెందిన వార్డుల్లో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదంటూ బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా 15వ వార్డు కౌన్సిలర్ బూసా శిరీష-రాజు, 16వ వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్, 18వ వార్డు కౌన్సిలర్ దొమ్మటి రమ్య-సంతోష్, 21వ వార్డు కౌన్సిలర్ శివరాత్రి స్వామి, 26వ వార్డు కౌన్సిలర్ మండల శ్రీదేవి-శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డుల్లో పారిశుద్ధ పనులు సరిగా జరగడం లేదని తెలిపారు. సైడ్ కాలువలు శుభ్రం చేయకపోవడం, సిబ్బంది సక్రమంగా రాకపోవడం, నల్ల నీటి సరఫరాలో లీకేజీలు ఎక్కువగా ఉండటంతో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
ఈ సమస్యలపై పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version