జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన సంఘటన.

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన సంఘటనను నిరసిస్తూ

స్వచ్ఛందంగా మంచిర్యాల పట్టణ బందుకు అన్ని సంఘాల ఆమోదం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై పాకిస్తాన్ టెర్రరిస్టు లు దాడులను నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలో మే 3 న బంద్,ర్యాలీని విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు,హిందూ సంఘాలు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని సంఘాలు సంఘీభావంతో బంద్ లో పాల్గొని విజయవంతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ పర్వతాల నరసయ్య,సహా కార్యవర్గం, హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగ రవీందర్, కార్యదర్శి కర్ణ గంటిరవీందర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, తపస్సు టిపిఎస్,భవన నిర్మాణ సంఘం,హమాలి సంఘం, పెయింటర్స్ అసోసియేషన్,ఎలక్ట్రిషన్ అసోసియేషన్, బీసీ సమాజ్ సంఘం,బీఆర్ఎస్,బిజెపి వివిధ సంఘాలు సంఘీభావం తెలుపుతూ బందులో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు.

కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
హైకోర్టును ఆశ్రయించిన కౌశిక్ రెడ్డి
ఈనెల 28 వరకు అరెస్టు వద్దని ఆదేశించిన హైకోర్టు
జమ్మికుంట: నేటిధాత్రి

 

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై 21వ తారీకు రోజు కమలాపూర్ మండలం గుండేడు క్వారీ యజమాని అయిన కట్ట మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి హనుమకొండ పోలీస్ స్టేషన్లో నా భర్తను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు 50 లక్షలు కావాలని వేధిస్తున్నాడని మానసికంగా కృంగిపోతున్నాడని మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఫిర్యాదు చేయగా దానిపై కేసు నమోదయింది అది అలా ఉండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి వాదన ఏమనగా గతంలో క్వారీ చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల నష్టం జరుగుతుంది కనుక మా ఊరికి ఏదైనా ఒక అభివృద్ధి చేయాలని చెప్పడం వల్ల అప్పుడు 25 లక్షలు ఒప్పుకున్నాడు 15లక్షలు ఇచ్చాడు ఇంకా మిగతా 10 లక్షల రూపాయలు ఇవ్వలేదని నాకు గ్రామస్తులు నా దగ్గరికి రావడం వల్ల ఫోన్ చేసి ఇవ్వాలని చెప్పాను దాని విషయంపై నాపై నేనే వసూలు చేస్తున్న నేనే అడుగుతున్నాను నేనే ఒత్తిడి చేస్తున్న అని దురుద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ 27వ తారీకు ఉంది ఆ సభకు నేను ఉండకూడదని ప్రత్యర్థులు ఆలోచించి నాపై అక్రమ కేసును బనాయించి నన్ను అరెస్టు చేసి ఉండకుండా నేను సభలో ఉంటే ఆ సభకు పూర్తిస్థాయిలో జనాన్ని సమీకరిస్తా సక్సెస్ అవుతది కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి లేకుంటా ఉంటే ఈ సభ నీరుగారిపోతుంది అనేటువంటి ఉద్దేశంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ఆ సభను ఆపడానికి ఆ సభను విజయవంతంగా జరగకుండా ఉండడానికి ఎన్నో రకాల పాచికలు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ రైతుల అనుమతి లేకుండా రైతుల భూములను స్వాధీన పరచుకొని మీటింగ్ పెడుతున్నారు కొన్ని కాలువలు మొరంతో కూడిపినారని కూడా ఆరోపణ చేసినారు నన్ను అరెస్టు చేసి నేను ఉండకుండా చేస్తే ప్రభావం తగ్గుతది అనేటువంటి ఉద్దేశంతో దేశ పూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు దానిపై నేను హైకోర్టును సంప్రదించగా ఈరోజు నాకు స్టే వచ్చింది నా ప్రజల వైపున కొట్లాడుతున్న భగవంతుని ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కనుకనే న్యాయం గెలిచింది న్యాయ పరంగానే నేను వెళ్తా న్యాయ పరంగానే నాకు స్టే వచ్చింది ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు సభను ఆపాలన్న ఆగదు ఎందుకంటే ప్రజల మద్దతు ఉంది ప్రజల యొక్క సంఘీభావంతో ఆ సభ జరుగుతుంది కనుక సభ విజయవంతం అయితది కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈ సభతో ని   తెలుస్తది.

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ.!

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

పహల్గం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హిందువుల మీద దాడి పరికిపంద చర్య అని తీవ్రంగా ఖండించారు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే కనీసం ఏపార్టీ స్పందించడం లేదని,హిందువుల కోసం మాట్లాడే పార్టీ, హిందువుల పక్షాన కొట్లాడే పార్టీ ఒక బీజేపీ పార్టీయేనని వారు తెలిపారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్,కారుపాకల అంజిబాబు, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, మండల యువ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, వంచ మనోజ్, సుదగోని మహేష్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, రాగం కనకయ్య,బొజ్జ తిరుపతి, అనుపురం శంకర్ గౌడ్, భూస మధు, చేవెళ్ల అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ.

జహీరాబాద్: ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

కాశ్మీర్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. బుధవారం రాత్రి యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలోని ఐపీ గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. దాడులలో మృతి చెందిన వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన.

“జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై జరిగిన తీవ్రవాదుల దాడిని ఖండిస్తు పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం

వర్ధన్నపేట (నేటిదాత్రి):

 

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం కన్వీనర్ చెంగల సురేష్ ఆధ్వర్యంలో జమ్ము కాశ్మీర్ పెహల్గాం లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పాకిస్తాన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో హిందువుల పై దాడికి పాల్పడుతూ మరణకాండ సృష్టించడాన్ని ఆయన ఖండించారు. భారత దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మత సంస్థలు ఉగ్రవాద సంస్థలకు అండగా నిలుస్తూ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాయని ఇప్పటికైనా వారు ఉగ్రవాదులకు సహాయం అందించడం ఆశ్రయం కల్పించడం మానుకోవాలని లేదంటే భవిష్యత్తులో వారికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెబుతుందని అదేవిధంగా పాకిస్తాన్ కి కూడా దీటైన సమాధానం ఇస్తుందని ఈట్ క జవాబు పత్తర్ సే దేంగే నినాదాన్ని చేసి చూపెడతారని మహేందర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి జడ సతీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోవాలని లేదంటే సరైన సమాధానం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి. ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బర్ల నవీన్. పింగిలి రాజేందర్. రెడ్డి ఇటికాల ప్రశాంత్. చిర్రా కిరణ్. ఏబీవీపీ నాయకులు బెల్లం కార్తీక్. వడ్డే శ్రీకాంత్. గోరుకంటి శివ. బండారి రేవంత్. చిర్ర రాకేష్. వేము నూరి నాగరాజు. హరీష్. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.

జాన్ పాకలో ఎక్సైజ్ దాడులు,ఇద్దరిపై కేసు నమోదు.  

పరకాల నేటిధాత్రి

గుడుంబా నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జాన్ పాక శివారులో దాడులు నిర్వహించారు.గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకం ను ధ్వంసం చేసి,5 లీటర్ల గుడుంబా,25 కేజీల షుగర్ ను స్వాధీనం చేసుకొని బాదావత్ శ్రీను,బానోత్ సురేష్ ల పై కేసు నమోదు చేసినట్టు సీఐ తాతజీ తెలిపారు.ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐ వై.జ్యోతి
సిబ్బంది లక్ష్మణ చారి,రవీందర్,సమ్మయ్య,విజయ్ కుమార్ పాల్గొన్నారు.

బస్టాండ్ స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలి.

బస్టాండ్ స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలి.

డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన స్వచ్ఛంద సంస్థలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో నియమ నిబంధనలు పాటించని శ్రీ లక్ష్మీగణపతి స్కూటర్ స్టాండ్ నిర్వహకునిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఎల్హెచ్ పిఎస్, డిబిడిఎస్ ప్రజాసంఘాలు,స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన్నకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం డిబిడిఎస్ వ్యవస్థాపకులు అందే రవి మాదిగ,ఎల్హెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్,ఎమ్మార్పీఎస్(టీ.ఎస్) జిల్లా అధ్యక్షులు మైసి శోభన్ మాదిగ ,ధరణి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఈదునూరి రమేష్ మాట్లాడుతూ నర్సంపేట బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్కూటర్ స్టాండ్ కాంట్రాక్టు నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించకుండా వారి యొక్క స్టాండ్ నడుపుచున్నారన్నారు సదర్ స్కూటర్ స్టాండ్ కు పొందిన అనుమతిలో ఒకవైపు మాత్రమే దారి కలదు కానీ ఆయా నిర్వహకులు పొందిన ఒకవైపు దారి కాకుండా మరో మూడు దారులను ఏర్పరచుకొని ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఈ విధంగా అనుమతులను భేఖాతరు చేయడం వలన ప్రయాణికులకు తీవ్రమైన అసౌకర్యానికి గురికావలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ విధంగా వ్యక్తం చేశారు.

అంతే కాకుండా బస్సులు బయటకు వెళ్లే దారిని నిబంధనలకు విరుద్ధంగా స్కూటర్ స్టాండ్ కు వెళ్లే దారిగా ప్రధానంగా నిర్వాహకుడు ఉపయోగించడం వలన పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని దీనితో ఆ కాంట్రాక్టు వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున తక్షణమే విరుద్ధంగా ఉన్న దారులను మూసివేసి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల భద్రతపై పూర్తిస్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.లేని యెడల ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

 

ఈ కార్యక్రమంలో తడుగుల విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి రాష్ట్ర నేత, ఆరేపల్లి బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోట డేవిడ్ మార్గ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, కట్ల రాజశేఖర్ మాదిగ ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్,నేలమారి నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు.!

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూడలేకే సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు

ధర్నాలో వనపర్తిఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రధాని మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు
నేషనల్ హెరాల్డ్ న్కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర టీ పీ సీ సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు
ప్రతిపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు
కాంగ్రెస్ పార్టీ పై కక్ష దింపు చర్యలు కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదనిఎమ్మెల్యే ఆగ్రహం చేశారు నిరసన
కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డి సి సి బి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఖిల్లా ఘణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,  పాల్గొన్నారు

హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పై కేసులు.

హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పై కేసులు వెంటనే ఎత్తివేయాలని నిరసన

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిరసనగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందులో నంబర్ వన్ గా సోనియాగాంధీ,నెంబర్ టు గా రాహుల్ గాంధీ పేర్లు ప్రస్తావించింది మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయా త్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణతో నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతు న్నాయి.రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు.

 

Congress

సోనియా గాంధీ రాహుల్ గాంధీ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా పెట్టించిన హెరాల్డ్ కేసులను వెంటనే ఎత్తివేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, బాసని చంద్రప్రకాష్ మార్కండేయ, చిందం రవి, మారేపల్లి రవీందర్, కట్టయ్య, రాజేందర్ మోత్కూరు భాస్కర్, చింతల రవిపాల్, పోలపెల్లి శ్రీనివాసరెడ్డి, ఎండి రఫీ, బాసని శాంత- రవి, అన్ని గ్రామాల కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..

విద్వేషకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు..

సోషల్ మీడియాను చెడుకు ఉపయోగించొద్దు..

వాట్సాప్, ఇన్ స్టాలో వచ్చే పుకార్లను నమ్మొద్దు..

నిబంధనలకు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు…

యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి..

రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్..

రామాయంపేట ఏప్రిల్ 15 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్పించేస్తూ ప్రజల మనోభా వాలు దెబ్బతీసే విధంగా సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, పోస్టులు పెట్టవద్దని, అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్య లు తీసుకోవడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు.
ఇందుకోసం ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచా రాన్ని రామాయంపేట సర్కిల్ కార్యాలయం కంట్రోల్

రూమ్ వాట్సప్ నెంబర్కు 8712667100 తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ టెక్నాలజీ యుగంలో వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ద్వారా సమాచారము క్షణాల్లో కొన్నిలక్షల మందికి చేరుతుందని పంపించే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను మంచి మంచి కార్యక్రమాలకు ప్రజలను యువతను చైతన్యపరిచే విధమైన పోస్టులు చేస్తూ మంచితనానికి ఉపయోగిం చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత వారి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

వక్స్ సవరణ బిల్లుపై నిరసనలు..

వక్స్ సవరణ బిల్లుపై నిరసనలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

కేంద్రం తీసుకొచ్చిన వర్ఫ్ (సవరణ) బిల్లును రాజ్యాంగంపై దాడిగా జహీరాబాద్ నియోజకవర్గానికి ఝరాసంగం న్యాల్కల్ మండలానికి చెందిన సయ్యద్ మజీద్ మొహమ్మద్ యూనుస్ చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ట్యాంక్ బాండ్ వద్ద వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దమని, మతానికి వ్యతిరేకమని, వక్స్ బిల్లును రద్దు చేయాలనీ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు.

పూలే,అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన

పూలే,అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు

కేవీపీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్

నర్సంపేట,నేటిధాత్రి:

నేటి ఆధునిక యుగంలో గ్రామల్లో కులవివక్ష అంటరానితనం ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కొనసాగుతుందని కులవివక్ష పై ఏప్రిల్ నెలలో జరుగు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కేవీపీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి అరురి కుమార్ పిలుపునిచ్చారు.శనివారం కెవిపిఎస్ పట్టణస్థాయి సమావేశం డివిజన్ అధ్యక్షుడు హనుమకొండ సంజీవ అధ్యక్షత జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ మాట్లాడుతూ నేటికి దళితులకు గుడి ప్రవేశం లేని గ్రామాలు, బతుకమ్మ ఆడనీయని గ్రామాలు,క్షవరం చేయకపోవడం,దసరా పండుగ సందర్భంగా జమ్మి ఆకు తెంపారని దాడి,హోటళ్ళలో రెండు గ్లాసుల పద్ధతి,పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే విద్యార్థులు తినకపోవడం రచ్చబండ మీద కూర్చొనియ్యకపోవడం వంటి కులవివక్ష రూపాలు కొనసాగున్నాయని చెప్పారు.కులవివక్ష పారద్రోలటానికి ఉన్న చట్టాలు జీవోలు రాజ్యాంగబద్ధమైన హక్కులను పాలకవర్గాలు అమలు చేయడంలేదన్నారు.ఈ వివక్ష రూపాలపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మించాలని కోరుతూ ఏప్రిల్ నెల మహనీయుల మాసంగా కేవీపీఎస్ ప్రకటించి పూలే అంబేద్కర్ జన జాతరలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ కుల వివక్షతపై సర్వే నిర్వహిస్తామని అంబేద్కర్ జయంతి సభలు నిర్వహించి ఏప్రిల్ 15 నుండి 30 వరకు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తామన్నామని ఆయన తెలియజేశారు.ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి మొలుగూరి రాజు , అధ్యక్షులు సింగారపు బాబు, కమిటీ సభ్యులు జన్ను రమేష్,ధార మహేందర్,మహేష్,ప్రశాంత్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

గణపురం ఎస్ ఐ రేఖ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలంలో మధ్యాహ్నం సేవించి వాహనాల వాహనాలు నడిపితే చర్యలు తప్పవని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు అతిగా మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ వాహనాల తనిఖీలు పట్టుబడిన గణపురం మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన పోలు రమేష్ కు భూపాలపల్లి జ్యుడిషినల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎన్ రామచందర్ రావు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు అని మద్యం సేవించి వాహనాలు నడిపితే వారికి అదే విధంగా త్రిబుల్ రైడింగ్ మైనర్లు డ్రైవింగ్ చేసినట్లయితే వారికి పై శిక్షలు వర్తిస్తాయని హెచ్చరించారు

గ్యాస్,పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా.!

గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా సి.పి.ఎం ఆధ్వర్యంలో ధర్నా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపాన తెలంగాణ తల్లి చౌక్ లో పెంచిన వంటగ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే ఉపశమరించుకోవాలని సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ తో నిరసన తెలిపడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సీపీఎం పార్టీ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం
వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం దారుణమని విమర్శించారు దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు సాధారణ వినియోగదారుల తోపాటు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరను ఉపశమరించుకోవాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
నిత్యవసర సరుకుల ధరలపై నియంత్రణ చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం అన్ని రకాల సరుకులు వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచారు. 2014 బిజెపి అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ 450 రూపాయలు ఉండేదని కానీ ఇప్పుడు బిజెపి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలకి గ్యాస్ సిలిండర్ పెంచడం చాలా దారుణమైన విషయం,ప్రజలు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, గురిజాల శ్రీధర్, సిపిఎం నాయకులు నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం బెజుగం సురేష్, గుండు రమేష్, గోవిందు లక్ష్మణ్
తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా.!

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం…PDSU

పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

చెన్నూర్:: నేటి ధాత్రి

 

 

చెన్నూర్ కేంద్రంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఉస్మానియా క్రాంతి ధార కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…ఉస్మానియా యూనివర్సిటీలోమతోన్మాదానికి ,మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా పిడికిలి బిగించి పోరాడిన విప్లవ, విద్యార్థి నాయకులు కామ్రేడ్ జార్జి రెడ్డి క్యాంపస్ లో జరుగుతున్న అన్యాయాలను లంపెన్ గుండాల దాడులను ఎదిరించాడు అన్నారు.
సమసమాజ స్థాపనకు ఉద్యమిస్తున్న జార్జి రెడ్డి ఎదుగుదలని జీర్ణించుకోలేని మతోన్మాద గుండాలు హత్య చేశారన్నారు.ఆయన ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాహుల్, రవికిరణ్, స్నేహ, రవళి, లక్ష్మి, పూజ తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్యపు.!

కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్యపు ఆరోపణలు మానుకోవాలి.

ఎస్సి సేల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు
ఓనపాకాల ప్రసాద్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పథకాలు, ఓర్వలేక సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి పార్టీలు అసత్యపు ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే ప్రజలు బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కనులకు కనిపించడం లేదా అని కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకాల ప్రసాద్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బిఆర్ఎస్, బిజెపి చేస్తున్న విమర్శలకు సోమవారం రోజున అయన స్పందించి మాట్లాడుతూ. గత పాలకులు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మూడు కోట్ల పదిలక్షల మందికి సన్న బియ్యం జరుగుతుంది నిజం కదా. సుమారు 82శాతం మందికి లబ్ది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, సుమారు 150 కోట్ల మహిళలు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారని. రైతులకు 500 రూపాయల బోనస్, రైతు రుణమాఫీ రైతుబంధు జరిగింది. యువకులకు 57,వేల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో యువతకు అందించారాని. పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి, పేద ప్రజలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసి, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ పథకం అమలు అవుతుందని ప్రతిపక్షాలకు ఈ పథకాల అవపడుతలేవ. నూటికి నూరు శాతం ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తుందనడంలో. ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో. నేటి యువత. స్వాతంత్ర ఉద్యమం చరిత్ర, రాజ్యాంగం యొక్క చరిత్ర,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చరిత్రను తెలుసుకోవడం అవసరం ఉందని, ఈరోజు జై బాపు జై భీమ్ జై సమిదాన్ కార్యక్రమం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఆదేశాల మేరకు గత నాలుగు రోజులు మొగుళ్లపల్లి మండలంలో పాదయాత్ర నిర్వహించడం జరిగిందని జిల్లా నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి లకు తగిన గుణపాఠం చెపుతామని ఎస్సి సెల్ మొగుళ్లపల్లి మండల కమిటీ అధ్యక్షులు ఓనపాకల ప్రసాద్ అన్నారు. పాల్గొని పై విధంగా పేర్కొన్నారు.

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక.

ప్రజాసమస్యలపై పోరాటం దాడు లకు బయపడo ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి :

 

ప్రజా సమస్యలపై 45 రోజుల పాటు కమిటీలు వేస్తూ, వారోత్సవాలు, జరపాలని నిర్ణయం తీసుకున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా.అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు
సతీష్ యాదవ్ నివాసంలో విలేకరుల తో ఆయన మాట్లాడుతూ, అఖిలపక్ష ఐక్యవేదిక రిజిస్టర్ అయీ నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రజా సమస్యలపై వినూత్నంగా వారోత్సవాలు జరిపాలని నిర్ణయించడం జరిగిందని, ఇంతకుముందు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పేవారని, ఇకనుండి ప్రజల వద్దకే పోయి సమస్యలను స్వీకరించి వార్డు, ఊరు, మండలం, జిల్లా కమిటీలు వేయడం జరుగుతుందని, ప్రజలు చెప్పే సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అవి పరిస్కారమయ్యే వరకు పోరాడుతామని, ఇప్పటివరకు మాపై జరిగిన దాడులు సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపై ఎవరైనా మాపై దాడులు చేయాలని చూస్తే ప్రజల సమక్షంలోని ఎదుర్కొంటామని, దాడులకు భయపడమని అన్నారు
ఈ సమావేశంలో సతీష్ యాదవ్ తో , వెంకటేశ్వర్లు, కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, శివకుమార్, పుట్టపాక బాలు,పాషా,కుమార్, శ్రీనివాసులు, సురేష్, రాముడు, కృష్ణయ్య, నాగరాజు, అన్వర్ తదితరులు పాల్గొన్నారు

అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు పొన్నం భిక్షపతి గౌడ్ డిమాండ్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు బొమ్మ సురేందర్ గౌడ్ అధ్యక్షత వహించగా సమావేశానికి విశిష్ట అతిథులుగా జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి హాజరవడం జరిగింది
బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ముదిరాజు కులానికి చెందిన యువతి పైన ఏడుగురు యువకులు అత్యాచారం చేయడం జరిగింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాట్లాడారు ఇందులో భాగంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి క్రిస్టియన్ పాస్టర్ పగడాల ప్రవీణ్ ది హత్యగా మేము అనుమానిస్తున్నా ము వెంటనే ఆయన యొక్క పోస్టుమార్టం రిపోర్టును బహిర్గతంగా ప్రజల ముందు పెట్టాలి లేదంటే స్త్రీల పైన జరిగే మానభంగాలు రాష్ట్రంలో జరిగే అటువంటి హత్యలు కు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించవలసిందిగా కోరుచున్నాము రాబోవు రోజులలో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పొన్నం బిక్షపతి గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకారం తదితరులు పాల్గొన్నారు.

మహిళలను దుర్భాషలాడిన విలేఖరి పై చర్య తీసుకోవాలని.

మహిళలను దుర్భాషలాడిన విలేఖరి పై చర్య తీసుకోవాలని ధర్నా రాస్తారోకో.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే, ఈ ప్రారంభానికి వచ్చిన ఎమ్మెల్యేకి మహిళల యొక్క సమస్యలు పరిష్కరించాలని పబ్లిక్ టాయిలెట్స్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంది ఆ కొరతను తీర్చాలని స్థానిక మహిళలైనా చిదిరాల సరోజన, మైదం కర్ణ, ఇతర మహిళలు ఎమ్మెల్యే ని కోరగా సానుకూలంగా స్పందించి ,మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు, ఎమ్మెల్యే , ప్రోగ్రాం అయి పోయిన తర్వాత వార్త రిపోర్టర్ కటుకూరు మొగిలి తాగిన మైకంలో వచ్చి మహిళలను చూడకుండా నానా బూతులు తిడుతూ దుర్భాషలతో మాట్లాడనారు, ఇట్టి విషయంపై దుర్భాషలాడిన విలేఖరి పై స్థానిక పోలీస్ స్టేషన్లో మూడు రోజుల క్రితం పిటిషన్ ఇవ్వడం జరిగిందని ఇప్పటివరకు పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం నాడు చిధిరాల సరోజన మై దం కరుణ మరికొందరు మహిళతో కలిసి విలేకరిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చిట్యాల చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేశారు, అనంతరం సరోజన మాట్లాడుతూ మహిళలను దుర్భాషలాడిన వార్త విలేకరిని తొలగించి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో మహిళలు రాయమల్లమ్మ శారద కరుణ తదితరులు పాల్గొన్నారు.

కాజీపేట రైల్వే డివిజన్” పై కక్షగట్టిన “అధికారులు”?

“కాజీపేట రైల్వే డివిజన్” పై కక్షగట్టిన “అధికారులు”?

నీరు గారుతున్న “కాజీపేట రైల్వే డివిజన్” ఆశలు..!

విజయవాడకు తెర వెనుక నుంచి మద్దతు ఇస్తున్న కొందరు ఆంధ్ర అధికారులు?

రైల్వేలో “ఉన్నతాధికారులను” సైతం తప్పుదోవ పట్టిస్తున్న “ఆంధ్ర అధికారులెవరు”?

ఉన్నపలంగా కాజీపేటకు 185 మంది లోకో రన్నింగ్ కార్మికుల సంఖ్యను తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే

లోకో రన్నింగ్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని కొంతమంది అధికారులు కంకణం కట్టుకుని తెరవెనుక ప్రయత్నాలు?

లోకో పైలట్ ఖాళీలు భర్తీ చేయాలని మార్చి 19న రైల్వే “జిఎం”కు వినతిపత్రం ఇచ్చిన కార్మికసంఘాలు

లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయాలని వినతిపత్రం ఇస్తే, ఉన్న లోకో పైలట్ లను ట్రాన్స్ఫర్ చేస్తూ మార్చి 26న ఉత్తర్హులు ఇవ్వడం ఆశ్చర్యం.

కాజీపేట డివిజన్ గా ఏర్పడితే కొంతమంది అధికారులు సికింద్రాబాద్, విజయవాడ లను విడిచి కాజీపేటలో ఉండవలసి వస్తుందని, డివిజన్ కాకుండా ఉండడానికి అడ్డుకునే కుట్రలు చేస్తు.., సిబ్బందిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న తీరు ప్రశ్నార్థకం?

కొత్త పోస్టులు భర్తీ చేయకుండా, హుటా హుటిన ఉన్నవి కూడా తీసేయడం వెనుక మతలబు ఏంటో అధికారుల విజ్ఞతకే వదిలేద్దాం…!

తెలంగాణపై సవతి తల్లి ప్రేమ..?, ఆంధ్రకు ప్రాధాన్యత?, ఆంధ్ర అధికారుల కుట్రలు? స్పందించని తెలంగాణ కేంద్ర మంత్రులు?

నేటిధాత్రి, వరంగల్, కాజీపేట

 

కాజీపేట-హనుమకొండ-వరంగల్ త్రినగరి మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఆశపడుతున్నది దక్షిణ మధ్య రైల్వేలో కాజీపేట మరో డివిజన్ గా అవతరించాలని. తెలంగాణలో మరో రైల్వే డివిజన్ ఏర్పడితే ఉద్యోగాల సంఖ్య పెరిగి మరి కొంతమంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని ప్రజలందరూ ఆశపడుతున్నారు. అలాగే ఇక్కడ నుండి కొన్ని కొత్త రైళ్లను ప్రారంభించడానికి అవకాశం కూడా లభిస్తుందని అందరూ అనుకున్నారు.

నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం అందరిలో కాజీపేట డివిజన్ ఆశలు మళ్లీ ఒక ఉన్నత స్థాయిలో చిగురించాయి. కానీ ఏ రోజుకైనా కాజీపేట ను డివిజన్ కాకుండా చేస్తామని అధికారులు పన్నాగం పన్నినట్టు ఉన్నారు. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా కాజీపేటలోని రైల్వే కార్మికుల సంఖ్యను క్రమక్రమేన తగ్గిస్తూ వస్తున్నారు. ఇందులో ప్రతిసారి మొదటి వేటు లోకో పైలట్ విభాగం పైనే పడుతున్నది, బుదవారం నాడు కాజీపేటలోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గిస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కాజీపేటలోని కోచింగ్ లింకులను విజయవాడకు తరలించిన సందర్భంలో లోకో పైలట్ లందరూ ఒక్కసారిగా ఉవ్వెత్తున నిరసనను తెలియజేశారు. అప్పుడు కొద్ది రోజులు నిరాహార దీక్షలు కూడా చేపట్టారు. దీనికి కాజీపేటలోని స్థానిక సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు తెలపడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో అధికారులు కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపి కోల్పోయిన కోచింగ్ లింకులను తిరిగి ఇవ్వకపోయినప్పటికీ, వాడి బీదర్ సెక్షన్లో నడిచే కొన్ని ట్రైన్లను కాజీపేటకు కేటాయించి కంటి తడుపు చర్యలు చేపట్టారు. కానీ కొంతకాలానికి వాటిని కూడా తిరిగి వేరే డిపోలకు కేటాయించడంతో కాజీపేట క్రూ డిపో ఎంతో నష్టపోయింది ఒక రకంగా చెప్పాలంటే కాజీపేట క్రూ డిపోను నిర్వీర్యం చేయడానికి బీజం ఇక్కడే పడిందని చెప్పవచ్చు.

గత ఐదు సంవత్సరాల కాలంగా కాజీపేట క్రూ డిపోలో పనిచేస్తున్న లోకో పైలట్ల సంఖ్యను అధికార గణం క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. ఈ విషయం కార్మిక సంఘాలు గుర్తించకుండా కొద్దికొద్దిగా తగ్గిస్తూ వచ్చింది. గత ఐదు సంవత్సరాల నుండి ట్రాన్స్ఫర్ ల రూపంలో కానీ, నూతన పోస్టింగుల రూపంలో కానీ కాజీపేటకు 10 మందికి మించి కేటాయించలేదు, కానీ ఇక్కడి నుండి చాలామంది ప్రమోషన్ల రూపంలో వేరువేరు క్రూ డిపోలకు వెళ్ళినారు. 2020 వ సంవత్సరంలో 623 మందితో నడిచిన క్రూడిపో నవంబర్ 2023 నాటికి 501 గాను, మార్చి 2025 కు 470 కి పడిపోయింది. ఈ విధంగా రోజురోజుకు కృూ సంఖ్యను తగ్గిస్తూ అధికారులు కాజీపేట పై ఉన్న నిరాసక్తను తెలియజేస్తున్నారు. కాజీపేట క్రూడిపోకు మే 2020 సంవత్సరంలో కేటాయించిన పోస్టుల సంఖ్య 790 కాగా బుధవారం నాడు అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ సంఖ్య 542 కు పడిపోయింది. అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో 248 పోస్టులు ఇక్కడి నుండి తొలగించబడ్డాయి.

Kazipet Railway Division

గూడ్స్ లోకో పైలట్ల నుండి సీనియార్టీ ప్రకారం పదోన్నతి కల్పిస్తూ ప్యాసింజర్ లోకో పైలట్ మరియు మెయిల్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేస్తారు, ఈ విధంగా పదోన్నతుల కల్పనలో కూడా కాజీపేట లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా, విజయవాడ డివిజన్లో ఉన్న సికింద్రాబాద్ కు చెందిన క్రూ డిపోలో భర్తీ చేశారు. ఈ విధంగా చేయడం వలన ఆయా సంబంధిత ఖాళీలలో కాజీపేట కు చెందిన గూడ్స్ లోకో పైలట్లు సుమారు 30 మంది పనిచేస్తున్నారు. కొంతమంది పదవీ విరమణ పొందడం, కోవిడ్ కష్టకాలంలో మరణించడం, కొంతమంది లోకో ఇన్స్పెక్టర్గా, ప్యాసింజర్ లోకో పైలట్లుగా పదోన్నతి పొందడం మరియు మరి కొంతమంది మెడికల్ అన్ఫిట్ అవడం వలన కాజీపేటలోని గూడ్స్ లోకో పైలట్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు అధికారులు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లను పరిగణలోకి తీసుకోకపోవడంతో కాజీపేట డిపో యొక్క క్రూ సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది.

Kazipet Railway Division

అయితే విశాఖపట్నం కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో విజయవాడ డివిజన్ అనేది విశాఖపట్నం జోన్ లోకి వెళ్తున్నదని రైల్వే అధికారులు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇలాంటి సందర్భంలో కాజీపేటలోని లోకో పైలట్ల సంఖ్యను తగ్గించి వారిని విజయవాడ డివిజన్లో సికింద్రాబాద్కు చెందిన లోకో పైలట్లుగా పనిచేస్తున్న డిపోలో కలపడం ఒక హాస్యాస్పదంగా మారింది. ఈ విధంగా కలపడం వలన భవిష్యత్తులో సికింద్రాబాద్ డివిజన్లోని లోకో పైలట్ల ఉద్యోగాల సంఖ్య తగ్గిపోనున్నది.

సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటుతనానికి ఆంధ్ర నాయకులు వారి వారి స్థాయిలలో కృషిచేసి రైల్వేల పరంగాను ఎదగకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్ర ప్రాంతం కు చెందిన కొంతమంది అధికారులు సికింద్రాబాద్ డివిజన్లో పనిచేస్తూ ఇంకా ఆంధ్రకే మద్దతునిస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట డివిజన్ ఏర్పాటును అడ్డుకుంటున్నట్టుగా తెలియవస్తున్నది. కాజీపేట డివిజన్ ఏర్పాటులో కీలక భూమిక పోషించనున్న లోకో రన్నింగ్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని కొంతమంది అధికారులు కంకణం కట్టుకుని తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. కాజీపేట డివిజన్ గా ఏర్పడితే కొంతమంది అధికారులు సికింద్రాబాద్, విజయవాడలను విడిచి కాజీపేటలో ఉండవలసి వస్తుందని, డివిజన్ కాకుండా ఉండడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Kazipet Railway Division

తెలంగాణలోని రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్-హనుమకొండ-కాజీపేట కు కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టును కేటాయించడం, ఇదే సందర్భంలో రైల్వే ఫ్యాక్టరీ కాస్త మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మారడంతో ఇక్కడి ప్రజలలో రైల్వే డివిజన్ ఏర్పాటుపై ఆశలు ఎగిరిపడ్డాయి. కానీ అధికారులు ఈ విధమైన చర్యలతో డివిజన్ గా మారే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇక్కడి రైల్వే కార్మికులు, కార్మిక నాయకులు, ప్రజలు అందరూ అధికారుల చర్యలను విమర్శిస్తూ కాజీపేట డివిజన్ గా ప్రకటించాలని కోరుతున్నారు.

 

ఈనెల 8వ తేదీన కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు కోరుతూ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రైల్వే మంత్రిని కలిసి వినతి..

కాంగ్రెస్ మంత్రులు, ఎంపీల ప్రతినిధి బృందం ఈ నెల మార్చి 8న కేంద్ర రైల్వే మంత్రిని కలిసి, కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్‌ను సృష్టించాలని మరియు తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, డి. సీతక్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, పోరిక బలరాం నాయక్‌ లతో కూడిన ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర అవసరాలను జాబితా చేసే మెమోరాండంను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని వాగ్దానం ప్రకారం కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటుకు కొనసాగుతున్న పనులకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతినిధి బృందం అదే స్థలంలో రైల్వే డివిజన్‌ను కోరింది.

Kazipet Railway Division

 

కాజీపేట రైల్వే డివిజన్…!

విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ఫలితంగా, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ అనే మూడు డివిజన్లు మాత్రమే మిగిలిపోయాయని, గుంతకల్, విజయవాడ మరియు గుంటూరులను సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో విలీనం చేశారని వారు వాదించారు.
రైల్వే నెట్‌వర్క్ నిర్వహణ కోసం ప్రయాణీకులకు, వస్తువులకు మెరుగైన భద్రతను అందించడానికి కొత్త విభాగాన్ని సృష్టించడం అవసరమని మంత్రులు అన్నారు. ట్రాఫిక్‌తో పాటు ఎక్కువ సరుకు రవాణా ఉన్న కాజీపేట ప్రాంతాన్ని డివిజన్‌గా చేస్తే గుంటూరు మరియు హైదరాబాద్ డివిజన్‌ల కంటే ఎక్కువ ట్రాక్ కిలోమీటర్లు మరియు ఆదాయం ఉంటుందని వారు చెప్పారు.

 

తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఆంధ్రకు ప్రాధాన్యత?, స్పందించని కేంద్ర మంత్రులు?

ఈ నెల మార్చి 19 బుధవారం నాడు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, కాజీపేట క్రూ డిపో ని సందర్శించిన సందర్భంగా, లోకో పైలట్ల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రిప్రెసెంటేషను ఇచ్చిన కార్మిక సంఘం నాయకులు.
జనరల్ మేనేజర్ సందర్శన జరిగిన వారం రోజులకే కాజీపేట లోకో పైలట్ ల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు వెలవడం గమనార్హం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version