Health Awareness for Adolescent Girls
కిషోర బాలికల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు
బస్తీ దవాఖానలో రక్తహీనత, డయాబెటిస్‌పై అవగాహన
రాయికల్, మే 18: నేటి ధాత్రి:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణ కేంద్రంలోని బస్తీ దవాఖానలో సోమవారం కిషోర బాలికలకు రక్తహీనత (అనీమియా), డయాబెటిస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్బీఎస్కే ఎంఓ డా. కస్తూరి రేవతి మాట్లాడుతూ కిషోర బాలికలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రక్తహీనత, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులను అందిస్తున్నట్లు తెలిపారు. రక్తహీనత తీవ్రంగా ఉన్న బాలికలను మెరుగైన చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యుడు డా. సబీర్ మొహమ్మద్, హెల్త్ సూపర్వైజర్ ఉమారాణి, మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, స్టాఫ్ నర్స్ వసంత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెప్మా ఆర్పీలు,కిషోర బాలికలు, మహిళలు పాల్గొన్నారు.
