భాధితుల సమస్యల పట్ల విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కారించాలి
పోలీసు
అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
వనపర్తి నేటిదాత్రి ,
వనపర్తి ఆగస్టు-18:
వనపర్తి జిల్లా పోలీసు ప్రజావాణి లో జిల్లా పోలీసు కార్యాలయానికి వివిధ సమస్యలతో వచ్చిన 16 మంది భాదితుల సమస్యలను జిల్లా ఎస్పీ *రావుల గిరిధర్ అడిగి తెలుసుకున్నారు. భాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. జిల్లాలోని పలు పోలీస్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం జరగకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు.
పోలీసు ప్రజావాణిలో మొత్తం 16 ఫిర్యాదులు వచ్చాయి
