Signature Campaign for Cow Protection Movement
జాతీయ గోమాత ఆరాధన ఉద్యమం కోసం సంతకాల సేకరణ కార్యక్రమం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మి నారాయణ మందిరం,విశ్వనాథ ఆలయంలో జాతీయ గోమాత ఆరాధన ఉద్యమానికి సంబంధించిన కరపత్రం విడుదల చేయబడింది.
ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయించడం,గోవధను పూర్తిగా నిషేధించడం,గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే డిమాండ్లతో సంతకాల సేకరణ చేపట్టడం జరిగినట్లు తెలిపారు.ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సంతకాలు చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వనాథ ఆలయం ఈఓ రవి,వేముల హరి ప్రసాద్, గొనె శ్యాంసుందరరావు,కర్ణకంటి రవీందర్,అర్చకులు నరహరి శర్మ, మార్వాడి సమాజ్ అధ్యక్షులు సుందర్ బల్దువ,గంప చంద్రశేఖర్, చిలువేరు ప్రవీణ్,నాగారపు సంతోష్,తోట కార్తీక్,సాయి తదితరులు పాల్గొన్నారు.
