`బీఆరఎస్ నాయకులకే అంతు చిక్కని గందరగోళం!
`ఎన్నికలకు ఇంకా రెండున్నారేళ్ళే వుంది!

`గత ఎన్నికలలో ఓడిన వారిని నెత్తిన పెట్టుకుంటే అంతే సంగతి.
`గత ఎన్నికలలో జనంలో వున్న నాయకులే గెలిచారు.
`జనానికి దూరంగా ఉన్నవాళ్లు ఓడిపోయారు.
`ఆరోపణలు వున్న నాయకులనే నెత్తిన పెట్టుకున్నారు.
`పార్టీ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారు.
`గెలుపు గుర్రాల పేరుతో నిజమైన సేవకులను దూరం పెట్టారు.
`పది మంది వెళ్ళిపోయినా ఇంకా జ్ఞానోదయం కావడం లేదు.
`పది మంది పోగానే పొంకణాలు కొట్టారు.
`కార్యకర్తలను తయారు చేసే కర్మాగారం అన్నారు.
`బిఆరఎస్ జనతా గ్యారేజ్ అని గొప్పలు చెప్పుకున్నారు.
`ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆశలు పెట్టుకుంటున్నారు.
`బలమైన ఉద్యమ కారులకు అవకాశం కల్పించండి.
`గతంలో పదవులు అనుభవించిన వారికి పార్టీ పని అప్పగించండి.
`కేసులంటే భయపడే నాయకులను పక్కన పెట్టండి.
`జైల్ అంటే జంకే నాయకులను దూరం పెట్టండి.
`జేజేలు కొట్టే వాళ్ళ వైపే చూడకండి.
`అధికారం పోగానే పార్టీ మారిన వాళ్లను ఆదరించకండి.
`సెకండ్ క్యాడర్ కు అవకాశమిచ్చి చూడండి.
`రెండేళ్లలో ఉప్పెన లాంటి ఉద్యమాలు చేస్తారు.
`ఆరు గ్యారెటిల మీద నింగి నేల ఏకం చేస్తారు.
`అలాంటి ఉద్యమ కారులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
`తెగించి కొట్లాడే వాళ్ళు ఉద్యమ కారులే.
`బీటి బ్యాచ్ ను నమ్ముకొని ముందుకు పొతే మళ్ళీ మునుగుడే.
`అరాచకాలు చేసిన వారిని పక్కన పెట్టండి.
`పార్టీనే దూషించిన వారిని దూరం పెట్టండి.
`కొత్తనీరు, ఉద్యమ వీరులను ఆదరించండి.
`ఒకప్పుడు నియోజక వర్గాలలో భూకంపం లాంటి ఉద్యమాలు చేసేవారు.
`రెండేళ్లలో ప్రభుత్వానికి బయపడి నోరేత్తని వాళ్లే ఎక్కువయ్యారు.
`కొట్లాడినా ఆఖరుకు టిక్కెట్ వస్తుందో లేదో అని బీటి నేతలు ఆలోచిస్తారు.
`పార్టీ మీద ఈగ వాళ్లకుండా ఇంకా ఉద్యమ కారులే చూసుకుంటున్నారు.
` అన్యాయం జరిగిన ఉద్యమ కారులను రంగలోకి దింపండి.
`ఒక్కసారి వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూడండి.
`గ్రూపుల రాజకీయం పక్కన పెట్టండి.
`పార్టీని పట్టుకొని, కెసిఆర్ ను నమ్ముకొని వున్న వారికి గుర్తింపు ఇవ్వండి.
`కళాకారులను కూడా గుర్తించి అవకాశాలు కల్పించండి.
`క్యాడర్ సూచనలు, సలహాల మేరకే అభ్యర్థులను ఎంపిక చేయండి.
హైదరాబాద్, నేటిధాత్రి:
అధికారంలో వున్నంత కాలం అంతా మంచిగానే కనిపిస్తుంది. మత్తుగానే వుంటుంది. ఓడిపోతేనే కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. అసలు నిజం తెలుస్తుంది. అదికారంలో వున్నంత కాలం జేజేలు మాత్రమే వినిపిస్తాయి. సూచనలు,సలహాలు కూడా కనిపించవు. వినిపించవు. విమర్శలు అసలు దగ్గరకే రావు. నాయకులు కూడా చెప్పడానికి ధైర్యం చేయరు. ఓడిపోయిన తర్వాతే రాళ్లు పడుతున్నప్ప్పుడు అసలు విషయం బోధపడుతుంది. అయినా మార్పు కనిపించలేదంటే జనానికి చేరువయ్యే ఆలోచన లేనట్లు..అందుకే ప్రజలు కొన్ని సార్లు ఆశలు పెట్టుకున్న పార్టీని పాతాళంలోకి నెట్టేస్తారు. ఎలాంటి కలలు లేని పార్టీలను అందలమెక్కిస్తుంటారు. సహజంగా ఏ పార్టీని ప్రజలు ఎల్లకాలం అదికారంలో వుంచరని ఓడిపోయిన వాళ్లు మాత్రమే చెబుతారు. ప్రజలకు చేరువగా, ప్రజల మనసులో నిలిచే నాయకులను ప్రజలు ఎప్ప్పుడూ దూరం చేసుకోరు. గుజరాత్‌లో బిజేపి ఇప్పటికి వరుసగా ఏడు సార్లు గెలుస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి మోడీ వరసుగా 25 సంవత్సరాలుగా రాజ్యాంగపదవిలో కొనసాగుతున్నారు. 13సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరం ప్రధానిగా కొనసాగుతున్నారు. ఓటమి అంటే తన జీవితంలో లేకుండా సాగిపోతున్నారు. గుజరాత్ నుంచి దేశమంతా పార్టీని విస్తరింపజేశారు. ఎదురు లేని నాయకుడుగా తిరుగులేని రాజకీయ శక్తిగా దేశాన్ని పాలిస్తున్నారు. ప్రధాని మోడీ, బిఆరఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌లాగా ఉద్యమాలు చేసిన నాయకుడు కాదు. పోరాటాలు చేసిన నాయకుడు కాదు. రాష్ట్ర సాదనకు కారకుడు కాదు. ప్రాణాలు ఫణంగా పెట్టి ఉద్యమం చేయలేదు. ఆమరణ నిరసనలు చేసింది లేదు. రాష్ట్రాన్ని సాదించింది లేదు. రాజకీయాలను అనుకూలంగా మలుకున్నాడు. రాజకీయం అంతా తన వైపు తిప్ప్పుకున్నాడు. తనే ఏకచ్చత్రాధిపత్యం చేస్తున్నారు. ప్రధానిగా మోడీ ఎంపికకు ముందే ఎంతో మంది ఉద్దండులైన నాయకులు బిజేపిలో వున్నారు. కాని వాళ్లంతా మోడీనే కావాలని కోరుకునేలా చేశారు. ఇప్ప్పుడు మోడీ తప్ప బిజేపికి మరో ప్రత్యామ్నాయం లేని నేతగా ఎదిగారు. ఇదీ రాజకీయం. కాని ఒక్కసారి 2014 ఎన్నికల్లో గెలవగానే ఇక టిఆరఎస్ అనేది ఉద్యమ పార్టీ కాదు. ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించినప్ప్పుడే తన కాళ్ల కింద భూమిని కేసిఆరే స్వయంగా కదిలించుకున్నారు. రెండోసారి గెలిచిన తర్వాత ఇక తనకు ప్రత్యామ్నాయం రాష్ట్రంలో లేదనుకున్నారు. నేల విడిచి సాము చేశారు. ఇక తెలంగాణకు చేసిన సేవలు చాలు. ఇక దేశాన్ని పాలించే వైపు అడుగులు వేస్తామనుకున్నప్ప్పుడే రాజకీయ ప్రయాణానికి కామా పెట్టుకున్నారు. కేసిఆర్‌ను తెలంగాణ ప్రజలు గొప్ప నాయకుడిగా తమ గుండెల్లో పెట్టుకున్నారు. తమ పాలిట దేవుడుగా చూసుకుంటున్నారు. నాయకులు చరిత్రలో నిలిచిపోవాలంటే దేశ నాయకులైతేనే సరిపోదు. దేశాన్ని పాలించే శక్తి వుంటేనే చరిత్ర గుర్తుంచుకోదు. మనదేశాన్ని 14 మంది ప్రధానులు పాలిస్తే ఓ నలుగురైదురి పేరు మాత్రమే వర్తమానం పదే పదే గుర్తు చేసుకుంటుంది. మిగతా వారెవరో చరిత్ర కూడా ఎప్ప్పుడో మర్చిపోయింది. ఈ విషయం తెలిసిన కేసిఆర్ కూడా రాజకీయంగా తప్పటడుగు వేశారు. టిఆరఎస్‌ను బిఆరఎస్ చేసినప్ప్పుడే తెలంగాణ గుండె చప్ప్పుడు అనే మాట జనం మర్చిపోయేలా తనే చేసుకున్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు కేసిఆర్ అంటే ఒక దైవంగా భావించే వారు కూడా వున్నారు. తెలంగాణ తెచ్చిన ధీరుడిగానే చూస్తున్నారు. తెలంగాణ చరిత్ర వున్నంత కాలం కేసిఆర్‌ను ప్రజలు మర్చిపోరు. కాని ఆ మరుపును కేసిఆర్ స్వయంగా కోరి తెచ్చుకునే రాజకీయం చేశారు. నిజం చెప్పాలంటే ప్రజల్లో వుండే నాయకుడికే పదువుల వెతుక్కుంటూ వస్తాయి. అంతే తప్ప ప్రజలకు దూరంగా రాజకీయాలు చేస్తాను… పదువులు పరుగెత్తుకుంటూ వస్తాయంటే ఓటములే ఎదురౌతాయి. అందుకే బిఆరఎస్ ఓటమి పాలైంది. ఇప్ప్పుడు నిలబడేందుకు నానా తిప్పలు పడుతుంది. అయినా ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఇంకా బిఆరఎస్ ఆధారపడుతోంది. అంటే కళ్లు తెరిచినట్లు లేదు. ఒకసారి ఓడిన తర్వాత ఆశల పల్లకిలో ఊరేగింపు ఆగడం లేదు. వచ్చేది మనమే మనమే అని పదే పదే అనుకుంటే సరిపోదు. ప్రతిసారి మా ప్రభుత్వంలో అదిచ్చాం..ఇదిచ్చామని చెప్ప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుÅ£ంటే కేసిఆర్ ఏమిచ్చాడన్నది ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలియని విషయాలు ఏమీ లేదు. ముందు పార్టీని గాడిన పెట్టుకోవాలి. ఎన్నికలకు ఇంకా కేవలం రెండున్న సంవత్సరాలు మాత్రమే వుంది. గత ఎన్నికý ముందు నేటిధాత్రి పదే పదే అనేక సూచనలు చేసింది. వాటిని పార్టీ పెడ చెవిన పెట్టింది. జేజేలు కొట్టే వారి మాటనే నమ్మింది. కాని పార్టీకి సూచనలిచ్చేవారిని పక్కన పెట్టింది. ఓటమి పాలైంది. అయినా ఏది నిజం..ఏది అబద్దం అనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోతోందా? అన్నీ తెలిసినా అదే దారిలో వెళ్తుందా? అనేది ఆత్మ పరిశీలన చేసుకోకపోతే మళ్లీ భంగాపాటు తప్పదు. ఓటమిని ఖాతాలో వేసుకోక తప్పదు. అసలు పార్టీ ఎవరిని నమ్ముతోంది? ఎవరిని నమ్మడం లేదన్నదానిపై కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. ఉద్యమ కాలంలో పార్టీని మోసింది విద్యార్దులు. కవులు, కళాకారులు, గాయకులు. యువకులు. బిఆరఎస్‌ను పెంచి పోషించింది కూడా ఆ వర్గాలే. ఆ వర్గాలు ఇప్ప్పుడు కూడా పార్టీతోనే వున్నాయి. ఆ తరంలో కూడా పార్టీ సేవల్లో ముందున్న వాళ్లంతా ఉద్యమకారులే. అది పార్టీఎప్ప్పుడూ మర్చిపోవద్దు. పక్తు రాజకీయ పార్టీ అనే పదమే బిఆరఎస్‌కు వర్తించదు. బిఆరఎస్ అంటేనే ఉద్యమ పార్టీ. ఇతర పార్టీలు ఎంత బిఆరఎస్ అన్నప్ప్పుడే తెలంగాణను ఆత్మను కోల్పోయిందని చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. అందుకే బిఆరఎస్ ఓడించారు. ఎప్పటికైనా బిఆరఎస్ ఉద్యమ పార్టీ అనే ముద్ర పోనివ్వకూడదు. ఉద్యమ కారులు తెలంగాణ వస్తుందని, తమకు తర్వాత కాలంలో పదవులు వస్తాయని బిఆరఎస్‌తో సాగలేదు. తెలంగాణ కోసం మాత్రమే ముందుండి పోరాటం చేశారు. తర్వాత వారిని గౌరవించుకోవడం అనేది బిఆరఎస్ ప్రధమ కర్తవ్యం. ఆయా వర్గాలలో కొంత మందికి అవకాశాలు కల్పించామని చేతులు దులుపుకుంటే సరిపోదు. పైగా పార్టీ నాయకత్వాలు కూడా ఉద్యమ కారులకు ఇవ్వలేదు. అటు ప్రభుత్వ పదవులు దక్కక, ఇటు పార్టీ పదవుల్లో కీలకం కాలేక సతమతమైన ఉద్యమాకారులు ఉసురు పార్టీకి తగలొద్దు. అటు ఉద్యమ కారులుగా, ఇటు పార్టీ కార్యకర్తలుగా పనిచేసి పార్టీని నిలబెట్టిన వారిలో మెజార్టీ పాత్ర వారిదే..వారికి ఇప్పటికైనా పెద్ద పీట వేయండి. పార్టీని నమ్ముకొని కొనసాగుతున్న వారిని గుర్తించండి. వారికి పెద్ద పీట వేయండి. వచ్చే ఎన్నికల్లో వారికి అవకాశమివ్వండి. ప్రజల్లోకి వెళ్లమని చెప్పండి. అంతే కాని పదవుల కోసం పార్టీలో కొనసాగి, పార్టీఓడిపోగానే కండువాలు మార్చిన వారిని వదిలేయండి. బిఆరఎస్‌లో కొత్త నీరు కూడా కావాలి. ఆ సమయంలో అటు ఉద్యమ కారులకు, ఇప్పటికి దాకా పార్టీకి సేవలు చేస్తూ పదవులు రాని వారిని గుర్తించండి. ఉద్యమకాలం నుంచి ఇప్పటి దాకా పదవులు అందుకున్న వారిని పార్టీ సేవలకు వినియోగించండి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారి నాయకత్వాలను బాగా గమనించండి. అటు పార్టీకి పనిచేసిన వాళ్లు, నిత్యం ప్రజల్లో వున్నవాళ్లు మాత్రమే గెలిచారు. ప్రభుత్వంలో వుండి కూడా ప్రజలకు దూరమైన బిఆరఎస్ నాయకులు ఓడిపోయారు. బిఆరఎస్ నుంచి గెలిచినా పార్టీకి ద్రోహం చేసేవారిని పార్టీ నెత్తిన పెట్టుకున్నది. అవకాశ వాదులకు అవకాశం కల్పించింది. ఇ ంకా పార్టీలో అవకాశ వాదులు కూడా వున్నారు. వారిని గుర్తించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే, బిఆరఎస్ ఇప్పటికే సగం ఖాళీ అయ్యేది. వెళ్లిన వాళ్లు కూడా కాంగ్రెస్‌లో అనుకున్న తీరుగా తమ పనులు చేయలేకపోతున్నామన్న భావనలో వున్నారు. అందుకే గోడ దూకాలనుకున్నవారు వెనుకంజ వేశారు. బిఆరఎస్ నుంచి కాంగ్రెస్‌కు కొంత మంది వెళ్లినా వచ్చిన వారికి చుక్కలు చూస్తున్నారు. అలాంటి కరుడు గట్టిన కార్యకర్తల నిర్మాణం జరగాలి. అంతే గాని అదినేత, ఇతర పెద్ద నేతలు చెప్పినట్లు వినే గొర్రెలుగా కార్యకర్తలుంటే పార్టీకి ఇలాంటి పరిస్తితే వస్తుంది. కాంగ్రెస్‌లో వద్దనుకున్న నాయకులను చేర్చుకుంటే పార్టీకి బలం పెరుగుతుందనుకుంటే ఉత్త మాట. పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి బైటకు వెళ్లి మళ్లీ వస్తామనేవారే దిÅ£్కనుకుంటే మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త. కేకే, డి. శ్రీనివాస్, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిని తెచ్చిపెట్టుకుంటే ఏమైంది? ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కష్టం..! పార్టీకోసం మంచి చెప్పేవారికంటే, పార్టీని నమ్మించే వారి వల్లనే నష్టమని తెలుసుకోవాలి. ప్రజలకు పార్టీ తరతరాలు సేవ లందించాలంటే కరుడు గట్టిన ఉద్యమకారులు, కార్యకర్తలనే పార్టీ నమ్ముకోవాలి.