‘‘సికెఎం’’ కాలేజీ చరిత్రకు…’’చెదలను పట్టిస్తున్నదెవరు’’?

https://epaper.netidhatri.com/

కాలేజీకి పట్టిన గ్రహణం?

గొప్ప గొప్ప మేధావులను తయారుచేసిన కాలేజీలో ఏం జరుగుతోంది?

ఇదేం పని ‘‘శా…’’ అందరికీ నామాలు పెట్టేసావ్‌!

నీతులు చెప్పాల్సిన చోట అవినీతి పనులేమిటి?

నాయకులు కష్టపడితే…బ్రోకర్లు కక్కుర్తి పడ్డారు?

తెలుగు విభాగంలో ఉద్యోగాలు ఎలా నియమించారు?

పుస్తెలతాడు అమ్ముకొని 50,000 ఇచ్చిందెందుకు? ఎవరికిచ్చారు?

అంత దుర్మర్గంగా వసూళ్ళెందుకు?

సికేంఎంలో తవ్వినకొద్దీ అక్రమాలే!

పూర్వ విద్యార్థులు ఇచ్చిన ఫీజుల లెక్కేది!
అర్హులకే కొలువులందాయా?

మామ్యాలతోనే సరా?

స్పెషల్‌ కోర్స్‌ ఫీజులెవ్వి?సర్టిఫికెట్లు జాడేది?

ఆ కథలేమిటో..ఆ వ్యవహారాలేమిటో పూర్తి వివరాలతో మీ ‘‘నేటిధాత్రి’’ వెబ్సైట్లో చూడవచ్చు…
అది ఓ అద్భుతమైన చదువుల తల్లి కొలువైన నిలయం. విద్యాలయం. చీకటిని పారద్రోలే వెలుగుల దేవాలయం. సికెఎం కాలేజీ అంటే ఒక బ్రాండ్‌. బావి తరాలకు మంచి ఉన్నత విద్యలు తెలంగాణ విద్యార్థులకు అందాలన్న సదుద్దేశంతో నెలకొల్పిన విద్యాలయం. ఆ పేరే ఓ చరిత్ర. దాని మనుగడే ఒక వ్యవస్థ. దాని ఫలితాలే తెలంగాణ తేజస్సు. సికేంలో ఒకనాడు చదువుకున్న వాళ్లు ఎంతో మంది మేధావులు వున్నారు. ఎంతో మంది గొప్ప గొప్ప స్థానాలకు చేరుకున్నారు. ఇప్పటికీ ఆ కాలేజీలో చదువుకోవడం ఒక వరమనుకునే విద్యార్థులున్నారు. కానీ ఆ చరిత్రకు కొందరు స్వార్థపరులు మరకలంటిస్తున్నారు. కాలేజీ ప్రభను దిగజార్చు తున్నారు. కాలేజీని భ్రష్టు పట్టిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు మరెంతో విద్యా వెలుగులు ప్రసరించాల్సిన కాలేజీని చీకటి మయం చేస్తున్నారు.

 

‘‘నేటిధాత్రి’’ అప్పటి విద్యాశాఖ కమిషనర్‌ కరుణ తో కాలేజీ విషయంపై వివరణ అడగగా…
‘నేటిధాత్రికి వాకాటి కరుణ ఇచ్చిన వివరణ
పస్తుతం నేను ఈ డిపార్ట్మెంట్లో లేను.. నాది డిపార్ట్మెంట్‌ మారింది.. అప్పట్లో వరంగల్‌ కలెక్టర్‌ ఎలా అయితే ప్రపోసల్స్‌ పంపించారో.. దాని ప్రకారంగానే మేము చేశాం.. అంతేకానీ అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు… అని లిఅప్పటి విద్యాశాఖ కమిషనర్‌ ‘‘వాకాటి కరుణ నేటిధాత్రి కి వివరణ’’ఇచ్చారు

 

 

‘‘నేటిధాత్రి’’ చంద్రకాంతయ్య మనవాడు ప్రస్తుత కాలేజీ బోర్డు మెంబర్‌ చంద శ్రీకాంత్‌ తో కాలేజీ విషయంపై వివరణ అడగగా…

నేటిధాత్రికి చంద శ్రీకాంత్‌ ఇచ్చిన వివరణ
`ప్రస్తుతం నేను కోర్టులో కేసు వేశాను కాలేజీకి చెడ్డ పేరు తెచ్చిన ఆ వ్యక్తులను వదిలిపెట్టే సమస్య లేదు.
`విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే మా తాతగారి లక్ష్యం అది తప్పుదోవ పడుతోంది
`వందల కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇచ్చేశాం కానీ అవినీతిపరులైన వారి చేతిలో వెళుతుందని గ్రహించలేదు
`కాలేజీలో జరిగిన అవకతవకలు సరిదిద్దేవరకు పోరాడుతూనే ఉంటాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *