ఆడిపిల్లలను సంతానంగా కలిగిన మా కుటుంబాలను కాపాడండి.

తండ్రి వేదింపులు భరించలేక వలస వెళ్లిన కుమారులు.

మాపై ఆర్డిఓ ఆఫీసులో ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదులు.

చిట్యాల, నేటి ధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో క్యాతం భూమయ్య కు మేము ముగ్గురం కుమారులం రమేష్ వెంకటేశ్వర్లు సతీష్ జన్మించడం జరిగినది. మా తండ్రి కి తరతరాలుగా వారసత్వంగా వ్యవసాయ భూమి రావడం జరిగింది. ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో మా పెద్ద అన్న అయిన క్యాతం రమేష్-విజయ దంపతులకు 3గురు ఆడపిల్లలు సంతానంగా జన్మించారు. వారసులు జన్మించలేదని గొడవచేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే 2006సం॥ లో ముగ్గురు కూతుర్లను తీసుకొని జీవనోపాధి కోసం చిట్యాలకు వలస వెల్లడం జరిగినది.
మా ముగ్గురు అన్నదమ్ములకు తేది. 07:09, 2007న వేరు పోసి ఆస్తిపంపకాలు చేయడం జరిగినది. ఇందులో మా తండ్రి గారు చేసిన రూ॥12,37,950/- అప్పును ముగ్గురు అన్నదమ్ములకు సమాన వాటాలుగా 4,12,650/- చొప్పున వేసి మనిషికి 4 ఎకరాల భూమిని పంచి ఇవ్వడం జరిగినది.
మా తండ్రి జీవనోపాధి కోసం ఎ4.17గుం.ల భూమిని తీయడం జరిగినది. అప్పటికి మా పెద్ద అన్న రమేష్కి మా చిన్నన్న వెంకటేశ్వర్లుకి వివాహం జరిగినది. అప్పుడు నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు వివాహం జరుగలేదు. నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం జరిగింది ,అప్పు ఎలా కట్టాలో తెలియని పరిస్థితిలో నాకు ఇచ్చిన 4 ఎకరాల భూమి నుండి 2ఎకరాల భూమిని అమ్మి నాపై వేసిన అప్పును పెద్దమనుషులు కట్టడం జరిగింది. తండ్రి నుండి నాకు వచ్చిన ఆస్తి 2 ఎకరాల భూమి మాత్రమే.. క్యాతం భూమయ్య పేరుపై మరియు క్యాతం రమేష్ పేరుపై వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రామచంద్రాపురంలో మా తండ్రి కి 2013సం॥ లో విలాసవంతమైన బంగ్లాను కట్టియ్యడం జరిగినది.
మళ్లీ తేది. 04.10.2009సం॥లో ఇంకా నాకు అప్పులు ఉన్నాయని మా తండ్రి గొడవ చేయడంతో ముగ్గురు అన్నదమ్ములం మనిషికి రూ॥51,597/-లు కట్టడం జరిగింది.
2018 సం॥లో నాకు ఇంకా అప్పులు ఉన్నాయని మా తండ్రి పై పట్టా ఉన్న మా ముగ్గురు అన్నదమ్ములకు చెందిన భూమిలోని 25సం॥ల నుండి పెంచిన ఎ1.10గుం. లలో ఉన్న టేకుతోటను అప్పటికప్పుడు మాకు తెలియకుండా తోటను నరికివేసి చెట్టలను అమ్ముకోవడం జరిగింది, తదుపరి అట్టి భూమిని 2019సం॥లో మా అక్క అయిన ఎలగొండ స్వప్న, వయస్సు. 50, భర్త. ఎలగొండ రాజేంద్రప్రసాద్ పై రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.
2020 సం॥లో నాకు ఇంకా అప్పులు ఉన్నాయంటూ పెద్దమనుషుల దగ్గరికి ముగ్గురు అన్నదమ్ములను పిలిపించి అప్పులు కట్టవల్సిందిగా అడుగితే మీకు ఎందుకు అప్పులు అవుతున్నాయని మేము అడిగితే మమ్ములను నానా భూతులు తిడుతూ అక్కడినుండి వెల్లిపోవడం జరిగింది.
మా బావ సహాయంతో తేది.31.12.2021న సీనియర్ యాక్ట్ క్రింద భూపాలపల్లి ఆర్.డి.ఓ ఆఫీసులో, తేది. 08.01.2022న జిల్లా ఎస్.పి. ఆఫీసులో తేది. 26.05.2022 తేదిన తెలంగాణ మానవ హక్కుల కమీషన్ ఆఫీసులో మాపై కేసు వేయడం జరిగినది. అవి ఇంకా ఎంక్వైరీ జరుగుచున్నది.
తేది. 16.12, 2022 రోజున మా చేసులో మా తండ్రి సైపోన్లు అన్ని పగలగొట్టడంతో మేము ఆధారాలతో సహా చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు కావడం జరిగినది.
మళ్లీ తేది. 15.04.2024 రోజున మా చేసులో కూలీలు మిరపకాయ ఎరడం కోసం వస్తుంటే వారిని మమ్మల్ని నానా భూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేసి కూలీలను అక్కడి నుండి వెల్లగొట్టడం జరిగింది. ఇట్టి విషయాన్ని పూర్తి ఆధారాలతో మేము చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మా తండ్రి క్యాతం భూమయ్యపై మరొక కేసు నమోదు కావడం జరిగింది.
అప్పుడు మా బావ అయిన ఎలగొండ రాజేంద్రప్రసాద్ దగ్గరుండి మా తల్లిదండ్రులతో వారి ఫొటోలను గోడలపై అంటింపజేసి, పురుగుల మందు డబ్బా పట్టిపించి ఈ సన్నివేశాన్ని పోన్లో ఫొటోలు, వీడియో తీసి మా పెద్ద కుమారుడు రమేష్, మా చిన్న కుమారుడు సతీష్ు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోషల్ మీడియాలో మా తల్లిదండ్రులతో చెప్పించి మాపై అసత్యపు ఆరోపణలు చేపించి వైరల్ చేసిమా కుటుంబాలలో గొడవలు సృష్టిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను ఆత్మహత్య చేసుకునేలా మా బావ అయిన
ఎలగొండ రాజేంద్రప్రసాద్ (వార్త రిపోర్టర్, పోస్ట్మ్యాన్) ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అని క్యాతం రమేష్ క్యాతం సతీష్ లు తన బాధను చెప్పుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.

 

క్యాతం రమేష్, సెల్ 9966391033
క్యాతం సతీష్ కుమార్, సెల్, 9676185018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *