నియామక పత్రం అందజేసిన నేషనల్ వైస్ ఛైర్మన్ సయ్యద్ అబ్దుల్ కరీం
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ కి చెందిన సంకే లక్ష్మణ్ ని హుమేన్ రైట్స్&ఉమెన్ సేఫ్టీ ఫోరమ్ జిల్లా అధ్యక్షునిగా జాతీయ వైస్ ఛైర్మన్ సయ్యద్ అబ్దుల్ కరీం చేతుల మీదుగా నియమక పత్రాన్ని అందజేశారు.గతంలో వివిధ సామాజిక ఉద్యమాలలో పాల్గొని,ఎల్లప్పుడూ ప్రజల పక్షం ఉండే వ్యక్తి,ఎన్నో సామాజిక సేవకార్యక్రమాలు నిర్వహించి,రాజకీయంగా ఎంపిటిసి గా పదవి బాధ్యతలను ఎంతో ఉన్నతంగా నిర్వహించినటువంటి వ్యక్తిని హుమేన్ రైట్స్&ఉమెన్ సేఫ్టీ ఫోరమ్ జిల్లా అధ్యక్షునిగా నియమించడం పట్ల పలువురు జిల్లా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నూతనంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సంకే లక్ష్మణ్ మాట్లాడుతూ నా పైన నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించిన రాష్ట్ర,జాతీయ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.ఎల్లప్పుడూ ప్రజల పక్షం ఉంటూ మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.ఎక్కడ మానవ హక్కులను భంగం కలిగిన ముందుండి పోరాడుతామని అన్నారు.హక్కులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్య పరుస్తామని తెలిపారు.