RTC Driver Suffers Heat Stroke
వడదెబ్బకు గురైన ఆర్టీసీ డ్రైవర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి బస్ డిపో లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న రావుల సంతోష్ కు వడదెబ్బ తో తీవ్ర అస్వస్థత. భూపాలపల్లి–మంచిర్యాల రూట్ ట్రిప్పు పూర్తి చేసుకొని వచ్చాక విధులలోనే అస్వస్థతకు గురయ్యాడు.
ఈ క్రమంలో వెంటనే స్పందించిన తోటి ఆర్టీసీ ఉద్యోగులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
జిల్లాలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు.
ఈ క్రమంలో ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉంటుంది.
ఓవైపు ఎండ వేడి మరోవైపు బస్సు ఇంజన్ ద్వారా వచ్చే వేడితో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
