Accident Risk Near STPP Due to Parked Lorries
ఎస్టిపిపి ముందు ఆగిన లారీలతో పొంచి ఉన్న రోడ్డు ప్రమాదాలు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టిపిపి పవర్ ప్లాంట్ వద్ద ఆగిన లారీలతో ప్రజలు రోడ్డు ప్రమాదల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు వాపోయారు.రోడ్డుపై గుంతలు ఏర్పడి,అక్కడే నిలిచిన మట్టి,దుమ్ము,ధూళి వాహనదారుల కళ్ళల్లో పడి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నమన్నారు.ఓవైపు పోలీస్ శాఖ వారు రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా లారీ డ్రైవర్లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు.
