కన్నయ్య ఎత్తు చిత్తు!
`రైతుల ముసుగులో అనుచరులతో కన్నయ్య పథకం!
`రైతులు తన మిల్లుకు అదనంగా వడ్లు ఇచ్చేలా కన్నయ్య ఎత్తుగడ!
`తన అతి తెలివితో కలెక్టర్ షెడ్యూల్ మార్చిన కన్నయ్య!
`మీడియా లేకుండా కలెక్టర్ మిల్లు తనిఖీ చేసేలా షెడ్యూల్ మార్పు.
`మీడియాను దారి మళ్లించి మిల్లు తనిఖీ మమ అనిపించేలా చేసుకున్న కన్నయ్య.
`అనుచరులతో కలెక్టర్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం.
`కలెక్టర్ ససేమిరా అనడంతో అడ్డం తిరిగిన కన్నయ్య వ్యూహం.
`లాజిక్ లేకుండా వ్యవహారించి అదనపు వడ్ల కోసం కన్నయ్య పాకులాట.
`కలెక్టర్ మిల్లు తనిఖీకి గైర్హాజరైన జాయింట్ కలెక్టర్?
`కలెక్టర్ ఎలాంటి రిపోర్ట్ రాసినా నా దగ్గరకే వస్తుందని కన్నయ్యకు జేసి భరోసా?
`అంతా తాను చూసుకుంటాను లే అని కన్నయ్య జేసి మాట?
`మీడియా లేకపోవడంతో బైటకు రాని తనిఖీ వివరాలు.
`మిల్లు లోపల కలెక్టర్ తనిఖీ ఫోటోలు బైటకు రాకుండా కన్నయ్య జాగ్రత్త.
`కేవలం ఆఫీస్‌లో కలెక్టర్ ఫోటోలు మాత్రమే విడుదల.
`కలెక్టర్ ను తప్పు తోవ పట్టించిన సివిల్ సప్లయ్ అధికారులు.
`పరోక్షంగా కన్నయ్య కు బహిరంగంగానే సివిల్ సప్లయ్ అధికారుల సహకారం.
`మిల్లు పూర్తి స్థాయిలో తనిఖీ చేయకుండా తెరమీదకు రైతులు.
`కలెక్టర్ సమయమంతా రైతులకు వివరించడానికే సరిపోయేలా కన్నయ్య ప్లాన్.
హైదరాబాద్,నేటిధాత్రి:
కన్నయ్యకు చెందిన ఓ రైస్ మిల్లును హన్మకొండ జిల్లా కలెక్టర్ సందర్శన సమయంలో ఏం జరిగింది? రైతులు కొందరు అక్కడకు ఎందుకు వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరి ప్రోద్బలంతో వచ్చారు? మిల్లు సందర్శన సమయంలో రైతులకు అక్కడ ఏం పని? మిల్లు సందర్శనకు, రైతులకు సంబంధం లేని అంశం. కలెక్టర్ అధికారిక కార్యక్రమానికి రైతులను ఎలా అనుమతించారు? ఎందుకు అనుమతిచ్చారు. మిల్లు సందర్శనకు ముందే రైతులు ఎందుకు ముందుకొచ్చారు? ముందస్తు సమాచారం లేకుండా ఎలా అనుమతిచ్చారు? కలెక్టర్ ప్రోగ్రామ్‌లో రైతులకు ఏం పని? మిల్లు సందర్శన కంటే ముందే రైతులు కలెక్టర్ వద్దకు చేరుకోవడం వెనుక ప్లాన్ ఏమిటి? సహజంగా అధికారిక కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రజలకు అనుమతిస్తారు? మిల్లు సందర్శనకు ముందే రైతులను ఎందుకనుమతిచ్చారు? కలెక్టర్ తోపాటు జేసి ఎందుకు రాలేదు? మీడియాను తప్పు దోవ పట్టించింది ఎవరు? కలెక్టర్ మిల్లు తనిఖీ పూర్తయిన తర్వాత కన్నయ్య జేసి వద్దకు ఎందుకు వెళ్లారు? నేటిధాత్రి మీద కేసు నమోదు చేయమని ఎందుకు జేసి సూచించారు? కలెక్టర్ పర్యటనను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన జేసి హజరుకాకపోవడంలో ఆంతర్యమేమిటి? మిడ్ డే మీల్స్ కార్యక్రమం రద్దు కావడం వెనుక ఎవరి హస్తం వుంది? రైతులు ఒక మిల్లు యజమానికి మద్దతు పలకలడమే అసందర్భం..అలాంటి అసందర్భ ప్రయోగాలు గతంలో ఎన్నడూ విన్నది లేదు! ఎవరూ చూసింది లేదు!! కానీ కొత్తగా ఇలా కార్యక్రమం రూపకల్పన చేసిన వారెవరు? మీడియా మొత్తం మిడ్ డే మీల్స్ కవరేజ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కలెక్టర్ మిల్లు సందర్శన ప్లాన్ ఎలా చేశారు? మీడియా లేకుండా అధికారిక కార్యక్రమాలు చేసిన ఆనవాయితీ ఎక్కడైనా వుందా? ఫలానా మిల్లుకే మేం ధాన్యం ఇస్తాం! చెల్లింపులు మాత్రం ప్రభుత్వ చేయాలి అని రైతులు అడిగిన సందర్భాలు వుంటాయా!? కలెక్టర్ షెడ్యూల్ మొత్తం గందరగోళంగా మార్చి కన్నయ్య కు లబ్ధి చేకూర్చేందుకు వేసిన ఎత్తుగడ అని స్పష్టంగా కనిపిస్తోంది! రైతులు ఒక మిల్లుకు వంతపాడడం అంటేనే పరోక్షంగా బెదిరింపులకు దిగడమే అవుతుంది? కలెక్టర్ షెడ్యూల్ తోపాటు కాలయాపన జరిగేలా పక్కా ప్లాన్ కనిపిస్తోంది!
ఒక వ్యక్తి తన వ్యాపారం కోసం ఎంతకైనా దిగజారతాడనేదానికి కన్నయ్య వ్యవహార శైలే నిదర్శనంగా కనిపిస్తోంది. కొంత మంది అవినీతి అధికారుల అండదండలతో అక్రమ సంపాదనకు తెగబడ్డ కన్నయ్య, పై స్థాయి అధికారుల పట్ల అతి తెలివిని ప్రదర్శించే వరకు వెళ్తున్నాడు. డిఫాల్టర్ల కన్నయ్య రైస్ మిల్లును కలెక్టర్ తనిఖీ చేసే సమయంలో ఇది బైటపడిరదనే దానికి అనేక సాక్ష్యాలున్నాయి. కలెక్టర్ పర్యటన షెడ్యూల్ ఆకస్మికంగా మార్చేంత ఎత్తుగడ అధికారుల సహకారం, ప్రోద్బలం లేకుండా జరిగేది కాదు. ముందుగా కన్నయ్య రైస్ మిల్లు తనిఖీ అంశాన్ని పరిశీలిస్తే సెక్యూరిటీ డొల్ల తనం తెలిసిపోతోంది. కన్నయ్య రైస్ మిల్లు తనిఖీ సమయంలో అక్కడికి రైతులు రావడం విచిత్రంగా వుంది. రైస్ మిల్లు తనిఖీకి, రైతులు అక్కడి రావడం వెనుక కన్నయ్య స్కెచ్ అర్థమౌతోంది. నిజానికి రైస్ మిల్లు తనిఖీకి రైతులకు సంబంధం లేని అంశం. కానీ అక్కడకు రైతులు కొంత మంది చేరుకున్నారు. కలెక్టర్ అక్కడికి వస్తున్నారని తెలిసి రైతులు తమ సమస్యలను వ్యక్తం చేసిందేమీ లేదు. కలెక్టర్ కు రైతులు వినతిపత్రం ఏదైనా ఇచ్చారా? అంటే అదీ లేదు. సహజంగా కలెక్టర్ పర్యటన సందర్భంగా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందించడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. కానీ కొంతమంది రైతులు అక్కడకు చేరుకొని కన్నయ్య కే తాము వడ్లు ఇస్తామని చెప్పడం విచిత్రంగా వుంది. రైతులు ప్రత్యేకంగా కన్నయ్య కు వడ్లు అమ్ముకుంటే అది ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ తాము కన్నయ్యకే వడ్లు ఇస్తాం…ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని రైతులు కోరడం అర్థం పర్థం లేని విషయం. ప్రభుత్వం ఏ ఏ మిల్లుకు ఎన్ని వడ్లు అప్పగించాలనే దానికి ఓ లెక్కాపత్రం వుంటుంది. అంతకు మించి వడ్లు ఇవ్వాలని కన్నయ్య కోరుకోదలుచుకుంటే అధికారులకు అర్జీ పెట్టుకోవాలి. అప్పుడు అధికారులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంతే కాని పది మంది రైతులు పోగేసి కలెక్టర్‌తో వడ్ల వ్యవహారం మాట్లాడిరచడం అంటేనే కన్నయ్య కుట్ర ఏమిటో ఇక్కడే తెలిసిపోతోంది. నిజానికి కన్నయ్య కు సంబంధించిన మిల్లు తనిఖీ మధ్యాహ్నం తర్వాత షెడ్యూల్ లో వుంది. కానీ కలెక్టర్ పర్యటనలో మార్పు జరగడంలోనే డొల్ల తనం దాగి వుంది. ముందుగా కన్నయ్య మీడియా అటెన్షన్ లేకుండా చేయాలనుకున్నాడు. అందుకు అధికారులు కూడా సహకరించారని అనుమానించక తప్పదు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పరిశీలన కార్యక్రమం వుండగా అర్థాంతరంగా కలెక్టర్ షెడ్యూల్ లో మార్పు చేసిందెవరు? అన్నది కూడా తెలియాల్సి వుంది. మీడియా లేకుండా కలెక్టర్ మిల్లు తనిఖీ తూతూ మంత్రంగా ముగించేలా కన్నయ్య పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఒక వేళ రైతులు ఏదైనా అంశం కలెక్టర్ దృష్టికి తీసుకురావాలనుకున్నా మిల్లు తనిఖీ పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారిని అనుమతించాలి. కానీ కలెక్టర్ మిల్లు దగ్గరకు చేరుకోగానే రైతుల పేరుతో చేరుకొని సమయమంతా అక్కడే వృధా అయ్యేలా తెలివిగా కన్నయ్య ప్లాన్ చేశాడు. రైతులు ఎంతో అమాయకంగా కలెక్టర్ దృష్టికి తమ సమస్యను తీసుకొచ్చినట్లు నటించారు. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు ఎవరూ అమాయకులు కాదు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసి, మిల్లర్లకు అందిస్తుందన్న సంగతి తెలియని రైతులు ఎవ్వరూ వుండరు. రైస్ మిల్లర్ల అరాచకాలు తెలియని రైతులు ఎక్కడా వుండరు. కానీ కన్నయ్య ఎంతో అతి తెలివిగా మిల్లు తనిఖీ తంతు ముగించేలా ఎత్తుగడ వేశాడు. రైతులతోనే కలెక్టర్ సమయం మంతా వృదా చేశాడు. ఒకవేళ మీడియా కలెక్టర్ వెంట వుంటే మిల్లు మొత్తం తనిఖీ మొత్తం రికార్డు అయ్యేది. మీడియా కన్నయ్య మీద ప్రశ్నల వర్షం కురిపించేది. కలెక్టర్ సమయాన్ని వృధా చేయడంలో కన్నయ్య సక్సెస్ అయ్యాడు. మిల్లు తనిఖీ ఫోటోలు, వీడియోలు లేకుండా తంతు పూర్తి చేసుకున్నాడు. కలెక్టర్ పర్యటనలో ప్రజా సంబధాల శాఖ అధికారులు ఫోటోలు, వీడియో ఎందుకు తీయలేదు. వాటిని మీడియా కు ఎందుకు విడుదల చేయలేదు? మిల్లు లోపల జరిగిన తనిఖీ ఫోటోలు ఐఅండ్‌పిఆర్ ఎందుకు మీడియాకు అందించలేదు. మిల్లు లోపల కలెక్టర్ తనిఖీలకు సంబంధించిన ఫోటోలు ఐఅండ్‌పిఆర్ తీయలేదా? తీసినా పంపలేదా? నాలుగు ముక్కలు రాసి ప్రెస్ నోట్ ఎందుకు విడుదల చేశారు. తనిఖీ సమయంలో మిల్లు యజమానికి కలెక్టర్ ఎలాంటి ప్రశ్నలు అడగలేదా? వాటి గురించి అధికారులు వివరాలు ఎందుకు గోప్యంగా వుంచారు. ఇలాంటి అనేక విషయాలు వెలుగులోకి రాకుండా అధికారులు చూడటంలో ఆంతర్యమేమిటని మీడియా వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కలెక్టర్ వచ్చీ రాగానే రైతులతో మాట్లడకుండా ముందుకు వెళ్తే తన పథకం అమలు చేయాలనుకున్నాడు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ విషయం బైటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. రైతులను కలెక్టర్ నిర్లక్ష్యం చేయడం వల్లనే వారు ముందుకు దూసుకొచ్చారని కొత్త కథ అల్లడానికి అన్నీ ప్లాన్ చేసుకున్నాడు. తను అనుకున్నది మిల్లు తనిఖీ మమ అనిపించేలా చూసుకున్నాడు. కలెక్టర్ మిల్లు తనిఖీకి సంబంధించి ఒక్క ఫోటో కూడా బైటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కలెక్టర్ కు ఈ విషయం కొంత అర్థమైనట్లు వుంది. రైతులు అమాయకంగా ప్రశ్నిస్తున్నట్లు ఎంత అతితెలివి ప్రదర్శిస్తున్నారో పసిగట్టినట్లున్నారు. చాలా విజ్ఞతతో కలెక్టర్ వ్యవహరించారు. ఒకవేళ జరగరానిది జరిగితే ప్రభుత్వం అబాసుపాలయ్యేది. ఇప్పటికే లగచర్ల ఘటన మన కళ్ల కనిపిస్తూనే వుంది. అక్కడ కూడా ఇలాగే జరిగింది. ముందస్తు ప్రణాళికలతో లగచర్ల ఘటన జరిగిందనేది తేలింది. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఆర్డీవో మీద దాడి జరిగింది. అయినా హన్మకొండ జిల్లా అధికారులు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? డిఫాల్టర్ కన్నయ్యకు ఇవ్వాల్సిన వడ్లకన్నా ఎక్కువ ఇవ్వడం జరిగిందనే ఆరోపణలు వున్నాయి. అదనంగా మరిన్ని వడ్లు ఇవ్వాలని కోరడం లో తప్పు లేకపోయినా, నిబంధనలకు వ్యతిరేకం.. కన్నయ్య కు రెండు మిల్లులున్నాయి. కలెక్టర్ సందర్శిన మిల్లు వద్ద రైతులు కన్నయ్య కే వడ్లు ఇవ్వాలని కొంతమంది కోరడం జరిగింది? కానీ రైతులు కన్నయ్య ను నమ్మి మరో మిల్లుకు వడ్లు ఇచ్చారని తెలుస్తోంది. ఆ రైతులకు డబ్బులు ఇవ్వకుండా కన్నయ్య తిప్పించుకుంటున్నాడని, రైతులను బెదిరిస్తున్నాడనే ఆరోపణలు కూడా వున్నాయి. ప్రభుత్వానికి ఇవ్వకుండా కన్నయ్య మాటలు నమ్మి మోసపోయామని, డబ్బులు ఇవ్వకుండా కన్నయ్య తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కొంత మంది రైతులు చెబుతున్నట్లు సమాచారం. కన్నయ్య కు చెందిన మరో మిల్లుకు వడ్లు ఇచ్చిన రైతులు ఆరోపణలు గుప్పిస్తుంటే, కలెక్టర్ తనిఖీ కోసం వచ్చిన మిల్లు వద్ద మరి కొందరు రైతుల వ్యవహార శైలి మరో రకంగా వుంది. అంటే పక్కా ప్లాన్ తోనే కన్నయ్య అవసరమైతే కలెక్టర్ ను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశాడని స్పష్టంగా అర్థమౌతోంది. అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తే విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి.