`ఢల్లీిలో ప్రమాదఘంటికలు మోగిస్తున్న కాలుష్యం
`కాలుష్యం బూచిని చూపి రాజధాని మార్పు సాధ్యంకాదు
`హైదరాబాద్ అన్నివిధాలా యోగ్యమే…కానీ శతాబ్దాల రాజధాని ఢల్లీి
`రాజధాని మారిస్తే ఢల్లీి ప్రజల సమస్య తీరుతుందా?
`రెండో రాజధానిగా హైదరాబాద్‌కు ఎప్పుడూ స్థానం వుంటుంది
`సాక్షాత్తూ అంబేద్కర్ ప్రతిపాదించిందే ఇది
`చర్చను లేవనెత్తిన శథిథరూర్ ఎక్స్ పోస్ట్
హైదరాబాద్,నేటిధాత్రి:
ఢల్లీిలో కాలుష్యం స్థాయిలు 500 ఎక్యుఐ మార్కును దాటిన నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ నా యకుడు, తిరువనంతపురం ఎం.పి. శశిథరూర్ ‘‘జాతీయ రాజధానిగా కొనగసాగడానికి ఢల్లీికి అర్హత వున్నదా?’’ అంటూ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. నవంబర్ నుంచి జనవరి నెల మధ్యకాలంలో ఢల్లీి నివాసయోగ్యంగా వుండటంలేదని ఈ నేపథ్యంలో రాజధానిగా కొనసాగే అర్హత ఎంతవరకు వుంటుందని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కా నున్న తరుణంలో ఆయన చేసిన ట్వీట్‌కు ప్రాధాన్యత ఏర్పడిరది. వెంటనే దీనిపై చర్చలు ఊ పందుకున్నాయి. దక్షిణాదిన చెన్నై లేదా హైదరాబాద్ నగరాలకు రాజధానిని బదిలీ చేయాలన్న అభిప్రాయాలు ఊపందుకోవడం మొదలైంది. ఇండొనేషియా రాజధాని జకార్తాలో కూడా కాలు ష్య స్థాయిలు విపరీతంగా పెరగడంతో ఈ నగరానికి వెయ్యికిలోమీటర్ల దూరంలోని ‘న్యుసాం తారా’ నగరాన్ని దేశ రాజధానిగా ప్రకటిస్తూ ఆ దేశ పార్లమెంట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.ప్రస్తుతం ఈ నగర నిర్మాణం జరుగుతోంది. 2045 నాటికి నూతన రాజధాని నిర్మాణ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. అయితే ఇండొనేషియా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు కాలుష్యం మాత్రమే కారణం కాదు, జకార్తానగరం రానున్న కాలంలో క్రమంగా సముద్రంలో మునిగిపోయే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యం వుంది.
నానుతున్న రెండోరాజధాని అంశం
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే దేశానికి రెండో రాజధాని కానుందా? నిజానికి ఎప్పటినుం చో నానుతున్న అంశమిది. తాజాగా ఈ అంశం తెరమీదికి రావడం వెనుక బలమైన కారణమే వుంది. ప్రస్తుత రాజధాని ఢల్లీిలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. ఏకంగా కాలుష్య సూచి 500 దాటి పోవడంతో అక్కడి ప్రజలు రకరకాల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఏర్పడిరది. ముఖ్యంగా ఈ కాలుష్యం నగర జీవనాన్నే తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దేశ పాలనా కేంద్రమైన ఢల్లీి నగరం ఎదుర్కొంటున్న ఈ కాలుష్య సమస్యకు పరిష్కారం లభించేలా కని పించడంలేదు. నిజానికి దేశానికి రెండో రాజధాని అంశం ఇప్పటిది కాదు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కరే ఈ ప్రస్తావనను ముందుకు తెచ్చారు. ఆయన 1955లో ప్రచురితమైన తన పుస్తకం ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అందుకు ఆయనచెప్పిన ముఖ్య కారణం, మనకు అత్యంత శత్రుదేశాలైన పాక్, చైనాలు ఢల్లీికి దగ్గరగా ఉన్నాయి. ఇదే హైదరాబాద్ చాలా దూరంలో ఉండటం, అన్ని రకాల సదుపాయాలు వుండటంవల్ల రెండో రాజధానికి అనువైన ప్రదేశంగా ఆయన తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. చరిత్రను పరిశీలిస్తే మహమ్మద్‌బీన్ తుగ్లక్ కూడా రాజధానిని ధిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు. విదేశీయుల తేలిగ్గా దాడులు చేయడానికి అనువుగా ఉన్న నేపథ్యం లో, మరో సురక్షిత ప్రాంతాన్ని రాజధానిగా చేయాలన్న సుల్తాన్ ఆలోచన ఎంతో తెలివైనది.ఇందుకోసం ఆయన ఒక సమావేశం ఏర్పాటుచేసి, ఈ ప్రస్తావన తీసుకురాగానే దురదృష్టవశాత్తు సభలోని వారు ఆయన్ను హేళన చేస్తూ చేతిలో ఉన్న కాగితాలను, ఇతర వస్తువులను విసిరేయడంతో ఆగ్రహించిన తుగ్లక్ ఢల్లీి నగరాన్ని ప్రతి ఒక్కరూ తమ వస్తువులు, పెంపుడు జంతువులు ఇతర సామగ్రితో సహా దౌలతాబాద్‌కు తరలివెళ్లాలని ఆదేశించాడు. రాజధానిని మార్పు చేయడం తప్పులేదు కానీ, ఢల్లీి ప్రజ లందరూ తరలివెళ్లాలంటూ ఆవేశంతో ఇచ్చిన ఆదేశమే తప్పిదం!
నరకం చూస్తున్న ఢల్లీి ప్రజలు
కాలుష్యపరంగా ఢల్లీి పరిస్థితి బాగా దిగజారిన పరిస్థితిలో ఇప్పుడు ఏకంగా హైదరాబాద్‌నే దేశరాజధానిగా చేయాలన్న వాదనలు మొదలయ్యాయి. ముఖ్యంగా నవంబర్`జనవరి నెలల మధ్యకాలంలో డిల్లీ నివాసయోగ్యంగా లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కాలంలో ఢల్లీి ప్రజలు గాలి పీలుస్తున్నామో లేక పొగతాగుతున్నామో తెలియని దుస్థితిలో జీవనం గడుపుతున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు, స్వచ్ఛందంగా సొంతవాహనాలను వాడకుండా వుండటం, నగరంలో వాయుకాలుష్య నియంత్రణ వంటి చర్యలన్నీ తాత్కాలికం గా మాత్రమే పనిచేస్తున్నా యే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపడంలేదు. ఈ తాత్కాలిక ఉపశమనాలు ఇంకెంతకాలమన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఢల్లీిలో వాయుకాలుష్యం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతూనే వుంది. ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో క్రమంగా పెరుగుతూ వచ్చి ప్రస్తుత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఇదే హైదరాబాద్ సమశీతోష్ణ ప్రదేశం.అన్ని సీజన్లకు అనువుగా వుండే నగరం. దక్షిణాదిలో వున్న చెన్నై, బెంగళూరు నగరాలున్నప్పటికీచెన్నైకి వరదభయం, బెంగళూరుకు ట్రాఫిక్ సమస్యలు వుండనే వున్నాయి. ప్రస్తుతానికైతే ఏ స మస్యలు లేని నగరం హైదరాబాద్ మాత్రమే.
వ్యతిరేకిస్తున్న రాజకీయపార్టీలు
హైదరాబాద్‌ను ఒకవేళ దేశానికి రెండో రాజధానిగా ప్రకటిస్తే, అన్నివర్గాల ప్రజలు సంతోషిస్తా రు. ఎందుకంటే వారి జీవన నాణ్యత పెరుగుతుంది. జీవనశైలిలో మార్పులు వస్తాయి. ధరలు తగ్గుతాయి. భద్రత పెరుగుతుంది. ఇప్పుడున్న సదుపాయాలు, సౌకర్యాలు మరింతగా పెరుగుతాయి. ఇవన్నీ ప్రజలకు ఆనందం కలిగించేవే. కానీ బీఆర్‌ఎస్, టీకాంగ్రెస్, మజ్లిస్ వంటి పార్టీలు ఇందుకు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం, ఒకవేళ హైదరాబాద్ దేశరాజధాని లేదా రెండో రాజధానిగా ప్రకటిస్తే కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని ఇది తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనేది వాటి భయం. రాజకీయ పార్టీ అభిప్రాయం ఎట్లా ఉన్నప్పటికీ నెటిజన్లలో కొందరు హైదరాబాద్‌ను మరికొందరు భోపాల్ వంటి ఉత్తరభారతదేశ నగరాలను సూచిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌కే ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత అంటే, స్వాతం త్య్రం వచ్చిన తొలినాళ్లలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ భద్రత రీత్యా హైదరాబాద్‌ను రెండో రాజ ధానిని చేయడం శ్రేయస్కరమని ప్రతిపాదించడం. ఇదిలావుండగా లండన్‌లో స్వతంత్రంగా పనిచేసే ఒక ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాక్ ప్రకారం దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆరు నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో వరుసగా బెంగళూరు, ముంబయి, ఢల్లీి, అహమ్మదాబాద్, చెన్నై వున్నాయి. టాలెంట్ పూల్, డైనమిక్ వాణిజ్య వాతావరణ వ్యవస్థ కారణంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహిస్తున్న బెంగళూరు నగరం వేగంగా అభి వృద్ధి చెందుతున్న నగరాల్లో రెండోస్థానాన్ని ఆక్రమిస్తోంది. అయితే ఈనగరానికి ట్రాఫిక్ సమస్య,ముంబయికి విపరీతమైన జనాభా, చెన్నైకి వరదల సమస్య ఉన్నాయి. హైదరాబాద్‌కు ఈ సమ స్యలు ఏవీలేవు.
కాలుష్యం రాజధాని మార్పుకు కారణం కారాదు
శశిథరూర్ ట్వీట్ పుణ్యమాని జరుగుతున్న చర్చల్లో ఎవరు ఏ అభిప్రాయం వ్యక్తం చేసినా, కేవలం కాలుష్యం కారణంగా రాజధానిని మార్చాలనేది ఉత్తమ నిర్ణయం కాజాలదు. భద్రతా కార ణాలు, పాలనా సౌలభ్యం, ప్రకృతి విపత్తులు వంటి కారణాల నేపథ్యంలో రాజధాని మార్పును గురించి ఆలోచించవచ్చు. అదీకాకుండా రాజధాని మార్పు అంటే…పాలనాపరమైన భవనాలు, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యాలయాలను మార్పు చేయడం అంతవరకే. ఇక్కడ అసలు ప్రశ్నేమంటే, రాజధాని మార్పు వల్ల ఢల్లీిలో కాలుష్యం తగ్గుతుందా? అనేది ప్రధాన ప్రశ్న. కొన్ని లక్షలమంది నివసిస్తున్న నగరంలో కాలుష్యాన్ని నివారిస్తే, ప్రజలు మరింత ఆరోగ్యంగా నగరం హరితవనంగా మారగలదు. రాజధాని మార్పువల్ల ఇది సాధ్యమా? అందువల్ల కేవలం కాలుష్యం బూచిని చూపి రాజధాని మార్పు సమంజసం కాదు. ఢల్లీి నగరం కాలుష్యమయం కావ డానికి ప్రధానకారణం, హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంటల కోతల తర్వాత, వ్యర్థాలను తగులబెట్టడం వల్ల ఆ పొగ సమీపంలో ఉన్న ఢల్లీినగరాన్ని చుట్టుముట్టి కాలుష్యానికి కారణమవుతోంది. ఇందుకు ఆయా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. ఇదే దానికి పరిష్కారం. ఢల్లీి ప్రజల ప్రధాన సమస్య అయిన కాలుష్యాన్ని నివారించకుండా రాజధాని మార్పు అనేది కేవలం పలాయనంగానే పరిగణించాల్సి వస్తుంది. కొత్తగా మార్పు చేసిన రాజ ధానిలో కొన్నేళ్ల తర్వాత ఇటువంటి సమస్యలే ఉత్పన్నమయితే మళ్లీ వేరే నగరాన్ని వెతుక్కోవాలా? ఇదికాదు పరిష్కారం. శత్రుదేశాలనుంచి దేశభద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని భావిస్తే రాజధాని మార్పు చేయవచ్చు కానీ కేవలం కాలుష్యం ఆధారంగా ఇటువంటి నిర్ణయం తగదు. శశిథరూర్ అభిప్రాయంపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారే తప్ప, కేంద్రం ప్రభు త్వం దీన్ని పట్టించుకోలేదు. దేశ రెండో రాజధాని అనేది ప్రభుత్వం తీసుకునే సంస్థాగత నిర్ణయంగా వుంటుంది తప్ప, చిన్న సమస్యల ఆధారం చేసుకొని ఇటువంటి కీలక నిర్ణయం ఏ బాధ్య తాయుత ప్రభుత్వం తీసుకోవడం సాధ్యంకాదు.