పడి లేవడం కాంగ్రెస్‌ కు పరిపాటే!

`ఓడిన చోటే గెలవడం అలవాటే!

`రెండు సీట్లుతో మొదలైన బిజేపి.

`ఐదు దశాబ్దాలు ఎదురులేకుండా ఏలిక కాంగ్రెస్‌.

`కాంగ్రెస్‌ కు ఇప్పటికీ సంప్రదాయ ఓటింగ్‌ బలంగా వుంది.

`బిజేపి పాలపొంగును చూసుకొని మురుస్తోంది.

`కాంగ్రెస్‌ ను ఖతం చేయడం అంత సులువు కాదు.

`ప్రజల తిరస్కారం ముందు ఏ పార్టీకైనా అరణ్య వాసం తప్పదు.

`ప్రాంతీయ పార్టీలు పుట్టిందే కాంగ్రెస్‌ హయాంలో..

`ఏనాడు కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీలను కమ్మేయాలని చూడలేదు.

`మింగేయాలని పెద్దగా దృష్టి పెట్టలేదు.

`ఏకపార్టీ విధానంతో ఎప్పుడూ ముందుకు వెళ్లలేదు.

`అలా అనుకుంటే బిజేపి ఎదిగేదే కాదు.

`అధికారంలోకి వచ్చేంత దూరం అందేదే కాదు.

`ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఏకచ్చత్రాధిపత్యం సాగదు.

`ఎల్లకాలం ప్రజలు ఒకే పార్టీని ఆదరించరు.

`రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా వున్నప్పుడే అభివృద్ధి సమతూకమౌతుంది.

`ఏకపార్టీ పెత్తనం ఎల్లకాలం సాగితే అసమానతలు పెరుగుతాయి.

`మేమే ఎల్లకాలం వుంటామనుకోవడం ఆత్మవిశ్వాసం.

`ఎప్పుడూ మేమే అధికారంలో వుండాలనుకోవడం నియంతృత్వం.

`ఎల్లకాలం మాదే రాజ్యమని ఏ పార్టీ అనుకోవద్దు.

`ప్రజల తిరస్కారం మొదలైతే పతనానికి పెద్దగా కాలం అవసరం లేదు.

`కాంగ్రెస్‌ మళ్లీ గెలవదన్న దానికి సూత్రమేమీ లేదు.

`భవిష్యత్తు అంతా బిజేపి అనుకుంటే సాధ్యం కాదు.

`కాంగ్రెస్‌ లోనే చీలికలు తప్పలేదు.

`బిజేపి అందుకు అతీతమేమీ కాదు.

`కాలం గడిచే కొద్దీ ఎదురీత ఏ పార్టీకైనా తప్పదు.

`ఒక్కసారి పతనం మొదలైతే ఆగేది వుండదు.

`ఏక వ్యక్తి స్వామ్యం ఏ పార్టీకి మంచిది కాదు.

`రాజకీయాలలో గెలుపోటములు పార్టీలు నిర్ణయించేవి కాదు.

`ప్రజాస్వామ్యంలో అంతిమ విజేతలు ప్రజలే.

`నాయకుల జీవితాలు ఎప్పుడూ ప్రజల చేతుల్లోనే.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయ పార్టీలు ఎల్ల కాలం ఏకచ్చత్రాధిపత్యం సాగించలేవు. కాలానికి అనుగుణంగా మార్పులు చెందక తప్పదు. ఇటీవల బిజేపి పార్టీ దూకుడుకు కాంగ్రెస్‌ పార్టీ కళ్లెం వేయలేకపోవచ్చు. కాలం తిరగబడిన రోజు ఏ పార్టీ అయినా మనసబారక తప్పదు. తన ఉనికి కోసం ఆరాటపడే రోజు రాక మానదు. దేశ స్వాతంత్య్రానికి ముందు పుట్టిన కాంగ్రెస్‌ పార్టీ బ్రిటిష్‌ వాళ్లు పాలించిన సమయంలోనే ప్రావిన్స్‌లలో అధికారం పొందిన పార్టీ. 1934 లో జరిగిన ఎన్నికలలోనూ గెలిచిన పార్టీ. రాజకీయాలు వేరు. చరిత్ర వేరు. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు ఎన్నిలెప్పుడు జరిగాయని ప్రశ్నించే వాళ్లు కూడా వుంటారు. రాజ్యాంగ కమిటీకి జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ పార్టీయే గెలిచింది. ఇదంతా చరిత్ర. అప్పటి కాలానికి అనుగుణంగా అప్పటి నాయకులు తీసున్న నిర్ణయాలను ఇప్పుడు తప్పుపడితే వచ్చే ప్రయోజనం ఏమీ వుండదు. కానీ రాజకీయంగా బిజేపి లబ్ధి పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు తెలంగాణ సాధించమే ఎంతో గొప్ప విషయం. అరవై ఏళ్ల పాటు రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగ, ఉపాధి పరంగా, ఆర్థికంగా, అభివృద్ధి పరంగా తెలంగాణ ఎంతో వివక్షను ఎదుర్కొన్నది. భవిష్యత్తులో తెలంగాణ విభజన కేవలం బిఆర్‌ఎస్‌ సూచనల మేరకే జరిగింది. తెలంగాణను కేసిఆర్‌ మూలంగా తీరని అన్యాయం జరిగిందని అనే వారు కూడా రావొచ్చు. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు ముందు వున్న హైదరాబాదు రాష్ట్రం మొత్తం సాధించుకునే అవకాశం వున్నా కేసిఆర్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టేలా చేశాడని అనొచ్చు. తెలంగాణ ఉద్యమం కోసం కేసిఆర్‌, తెలంగాణ సమాజం మొత్తం పడిన పోరాటాన్ని ప్రశ్నించేవారు రావొచ్చు. అలాగే దేశ విభజన కేవలం కాంగ్రెస్‌ నాయకుల మూలంగానే జరిగిందనే భావోద్వేగం రగిలించి బిజేపి రాజకీయ ప్రయోజనం పొందుతోంది. అఖండ అఖంఢ భారతమనే మాటలతో బిజేపి ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెడుతూ వస్తోంది. ఎప్పుడో రాజుల కాలంలో వున్న అఖంఢ భారతం సాధ్యమయ్యే పనేనా? కాదని తెలుసు. అయినా రాజకీయ అవసరాల కోసం పార్టీలు ఎంచుకునే అంశాలను ప్రజలు నమ్మినంత కాలమే అధికారాలు. ఇప్పుడు దేశమంతా బిజేపి చెప్పే మాటలను జనం నమ్ముతున్నారు. యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది నమ్మారు. మళ్ళీ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నమ్మే రోజులు రావొచ్చు. జనసంఫ్‌ు నుంచి బిజేపి పార్టీ ఉద్భవిస్తుందని ఎవరైనా ఊహించారా? బిజేపి ఏర్పడేదాకా ప్రజలు జనసంఫ్‌ు మాటలు పూర్తిగా విశ్వసించారా? అలాగే కాంగ్రెస్‌ పార్టీ చెప్పినవన్నీ నిజాలు కాకపోవచ్చు. కాంగ్రెస్‌ రాజకీయమంతా వాస్తవం కాకపోవచ్చు. అందుకే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్‌ ను కాదని బిజేపిని నమ్ముతున్నారు. ఇది కూడా ఎల్ల కాలం సాగుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ నూటా యాభై సంవత్సరాలలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నది. పడిన ప్రతిసారి నిలబడిరది. పడి లేవడం కాంగ్రెస్‌ కు పరిపాటే! ఓడిన చోటే గెలవడం అలవాటే! స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ అనేక సార్లు చీలిపోయింది. ఇందిరా కాంగ్రెస్‌ మాత్రమే ఇంత కాలం నిలబడిరది. దేశం కోసం ధర్మం కోసమని చెప్పిన జనసంఫ్‌ు నుంచి బిజేపి పురుడుపోసుకున్నది. కమ్యూనిస్టులు కూడా చీలికలు పీలికలై, అంతర్థాన, అవసాన దశలో వున్నారు. వారి భావ జాలం నుంచి బైటపడుతున్నారు. ఎవరికైనా మార్పు సహజం. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వున్నంత కాలం కాలర్‌ ఎగరేసుకొని తిరిగిన కమ్యూనిస్టు లు జెండా మోయడానికి కూడా వెనుకాడుతున్నారు. ప్రశ్నించడానికి ముందూ వెనుక ఆలోచిస్తున్నారు. ప్రశ్నను స్వీకరించే వరకే ఎవరి ఉనికైనా అన్నది తెలుసుకున్నారు. నోరుమెదిపడానికి కూడా వీలు లేని పరిస్థితి తెచ్చుకున్నారు. బిజేపి బలపడడానికి పరోక్ష కారణం కమ్యూనిస్టులు కూడా…కాంగ్రెస్‌ నీడన కాలం వెళ్లదీస్తూనే తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు. ఇప్పుడు గూడు లేకుండా చేసుకున్నారు. ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించడం అంటే ఇదే! తమను ఎదురులేదని, రాజకీయంగా తిరుగులేదని కాంగ్రెస్‌ ను కాదనుకుంటే ప్రజలకు భవిష్యత్తు లేదని అని కూడా అనుకున్నారు. అదే ఆ పార్టీ కొంప ముంచింది. బిజేపిని అందలమెక్కించింది. యాభై ఏళ్ళ పాటు కాంగ్రెస్‌ కు అధికారమిచ్చిన ప్రజలు మధ్యలో బిజేపికి అవకాశం కల్పించారు. ప్రజలు అనుకున్న విధంగా బిజేపి పాలించలేదు. మళ్ళీ కాంగ్రెస్‌ ను రెండు సార్లు నమ్మారు. తర్వాత కాంగ్రెస్‌ కంటే బిజేపియే మేలని మూడు దఫాలుగా పక్కనపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మాత్రమే ప్రజలు నమ్ముతున్నారు. పూర్తిగా బిజేపినే నమ్మడం కాదు. అలా అనుకుంటే అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఓడిపోయేది కాదు. బిజేపి ఓడిపోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఏ నాయకుడికైనా, ఏ పార్టీ నైనా ప్రజలు బలంగా నమ్మినంత కాలం అధికారమిస్తారు. తర్వాత ప్రత్యామ్నాయం ప్రజలే చూపిస్తారు. దేశంలో రెండు సీట్లుతో మొదలైన బిజేపి. రెండు దశాబ్దాల తర్వాత అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంగా బిజేపి పోరాట పటిమను చూసి అధికారం అందించారు. ప్రధాని మోడీని మూడు సార్లు ఆశీర్వదించారు. మోడీ మూలంగా రాష్ట్రాలన్నింటిలో అప్రతిహతంగా బిజేపి గెలుస్తూ వస్తోంది. గతంలో కూడా ఇలాగే గెలుస్తూ వచ్చింది. ఐదు దశాబ్దాలు ఎదురులేకుండా కాంగ్రెస్‌ పార్టీ ఏలగలిగింది. కాంగ్రెస్‌ కు ఇప్పటికీ సంప్రదాయ ఓటింగ్‌ బలంగా వుంది. బిజేపి పాలపొంగును చూసుకొని మురుస్తోంది. కాంగ్రెస్‌ ను ఖతం చేయడం అంత సులువు కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కూడా కాంగ్రెస్‌ ఓటమి పాలైన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఒక దశలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ ను పాతాళానికి తొక్కేస్తామంటూ చెప్పిన సందర్భాలున్నాయి. అదే చంద్రబాబు ను రాజశేఖరరెడ్డి ఓడిరచి పదేళ్లు తెలుగు దేశం పార్టీని అధికారానికి దూరం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోయారు. ప్రజల తిరస్కారం ముందు ఏ పార్టీకైనా అరణ్య వాసం తప్పదు. నిజం మాట్లాడుకోవాలంటే ప్రాంతీయ పార్టీలు పుట్టిందే కాంగ్రెస్‌ హయాంలో..ప్రాంతీయ పార్టీలను ఏనాడు కాంగ్రెస్‌ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాకపోతే రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్‌ కూడా తప్పుడు విధానాలను అవలంబించింది. ఇప్పుడు బిజేపి కూడా అదే దారిలో నడుస్తోంది. నీవు నేర్పిన విద్యనే కదా! నీరజాక్ష అని ఎదురు సమాధానం చెబుతోంది. కాకపోతే ఏనాడు కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీలను కమ్మేయాలని చూడలేదు. ఆ పార్టీలను ఓడిరచాలని చూసిందే గాని, అధికారం కోసం ఇష్టానుసారం వ్యవహరించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో నాదెండ్ల భాస్కరరావు నిర్ణయాన్ని మాత్రమే కాంగ్రెస్‌ స్వాగతించింది. నాదెండ్ల భాస్కరరావు ను కాంగ్రెస్‌ పార్టీ పురికొల్పిలేదు. తనకు వున్న అసంతృప్తి మేరకు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని పూర్తి స్థాయి ఎమ్మెల్యేలలో అధికారం చేపట్టాడు. అంతే కానీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలుపుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజా వ్యతిరేకతను గమనించి వెంటనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తేరుకున్నారు. ఎన్టీఆర్‌ ను తిరిగి ముఖ్యమంత్రిని చేశారు. బిజేపి లాగా మద్దతిచ్చి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ను కర్నాటక లో గతంలో ప్రభుత్వాన్ని కూల్చినట్లు కాంగ్రెస్‌ చేయలేదు. నిజానికి అప్పుడు దేశంలో కాంగ్రెస్‌ కు పెద్దగా ఎదురులేదు. కేంద్రంలో ఓడిపోతామన్న భయం అంతకన్నా లేదు. కానీ ఏ మాత్రం ఏమరపాటుగా వున్నా బిజేపికి ఇబ్బందే అని ముందు జాగ్రత్తగా ఇలాంటి రాజకీయాలు చేస్తోంది. అప్పట్లో ప్రాంతీయ పార్టీలను మింగేయాలని కాంగ్రెస్‌ అనుకోలేదు. ఏక పార్టీ విధానం ప్రజాస్వామ్యంలో పనికి రాదు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఏకపార్టీ విధానంతో ఎప్పుడూ ముందుకు వెళ్లలేదు. అలా అనుకుంటే బిజేపి ఎదిగేదే కాదు. ఉత్తర ప్రదేశ్‌ లో ఎస్పీ, బిఎస్పీలు పుట్టేవే కాదు. మధ్యప్రదేశ్‌ లో బిజేపి ఎదురులేకుండా గెలిచేదే కాదు. పశ్చిమ బెంగాల్‌ లో కమ్యూనిస్టు పార్టీ నలభై సంవత్సరాల పాటు అధికారం చెలాయించేదే కాదు. తర్వాత మమత బెనర్జీ మూడు సార్లు గెలిచే అవకాశమే లేదు. పంజాబ్‌లో అకాలీదళ్‌ పురుడుపోసుకునేదే కాదు. ఈశాన్య రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఉద్భవించేవే కాదు. ప్రాంతీయ పార్టీలలు అధికారంలోకి వచ్చేంత దూరం అందేదే కాదు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఏకచ్చత్రాధిపత్యం సాగదు. ఎల్లకాలం ప్రజలు ఒకే పార్టీని ఆదరించరు. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా వున్నప్పుడే అభివృద్ధి సమతూకమౌతుంది. ఏకపార్టీ పెత్తనం ఎల్లకాలం సాగితే అసమానతలు పెరుగుతాయి. మేమే ఎల్లకాలం వుంటామనుకోవడం ఆత్మవిశ్వాసం. ఎప్పుడూ మేమే అధికారంలో వుండాలనుకోవడం నియంతృత్వం. ఎల్లకాలం మాదే రాజ్యమని ఏ పార్టీ అనుకోవద్దు. ప్రజల తిరస్కారం మొదలైతే పతనానికి పెద్దగా కాలం అవసరం లేదు. కాంగ్రెస్‌ మళ్లీ గెలవదన్న దానికి సూత్రమేమీ లేదు. భవిష్యత్తు అంతా బిజేపి అనుకుంటే అంతకంటే అత్యాశ, అతిశయోక్తి మరొకటి వుండదు. కాంగ్రెస్‌ లోనే చీలికలు తప్పలేదు. బిజేపి అందుకు అతీతమేమీ కాదు. కాలం గడిచే కొద్దీ ఎదురీత ఏ పార్టీకైనా తప్పదు. ఒక్కసారి పతనం మొదలైతే ఆగేది వుండదు. ఏక వ్యక్తి స్వామ్యం ఏ పార్టీకి మంచిది కాదు. ఇందిరాగాంధీని కూడా ఎదురించి పార్టీలు పెట్టిన వారు కూడా వున్నారు. తివారీ లాంటి వారు పార్టీ విడిచి సొంత కుంపటి పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేశారు. రాజకీయాలలో గెలుపోటములు పార్టీలు నిర్ణయించేవి కాదు. ప్రజాస్వామ్యంలో అంతిమ విజేతలు ప్రజలే. నాయకుల జీవితాలు ఎప్పుడూ ప్రజల చేతుల్లోనే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!