మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఆభరణాల కోసం ఓ ఆగంతకుడు మహిళపై అత్యాయత్నం చేసిన ఘటన నవాబుపేట మండలంలో శనివారం చోటు చేసుకుంది స్థానికుల వివరాల ప్రకారం పల్లెగడ్డ గ్రామానికి చెందిన గొల్ల అక్కమ్మ పై ఉన్న ఆభరణాలు దొంగిలించేందుకు ఓ ఆగంతకుడు ప్రణాళిక ప్రకారం పర్వతాపూర్ మైసమ్మ అడవిలోకి తీసుకెళ్లి మహిళా గొంతుపై కత్తితో దాడి చేసాడు. ఆ మహిళ కేకలను రోడ్డు మార్గంలో వెళ్లే వాహనదారులు గమనించి అప్రమత్తమై ఆమెను కాపాడారు. తీవ్రరక్రస్రావంలో ఉన్నా ఆమెను వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించినట్టు స్థానికులు తెలిపారు.ఈ సంఘటన తెలుసుకున్న నవాబు పేట పోలీసులు అక్కడికి చేరుకుని నిందుతుడిని పోలీసుల ఆదీనంలోకి తీసుకున్నాట్లు స్థానికులు తెలిపారు. నిందితుడు కూచూర్ గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి గా స్థానికులు గుర్తించారు.ఈ విషయం పై నవాబుపేట ఎస్సై విక్రమ్ మాట్లాడుతూ ఈ ఘటన కు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు రలేదని తమకు ఫిర్యాదు అందిన వెంటనే సంఘటనా వివరాలను దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు.కరుణాకర్ రెడ్డి పై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలిపారు.