ఒక్కసారి ఓటు వేస్తే ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.
నర్సంపేటలో నడుస్తున్న కొత్త సంస్కృతి
ఐపి పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.
60 కోట్ల వ్యవసాయ యాంత్రీకరణ నిధులు రాష్ట్రంలో పంపిణీ.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్రంలో త్వరలో జరగబోయే
స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలోపెట్టుకొని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నయా డ్రామాకు తెరలేపిందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.నర్సంపేట పట్టణంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ రాయిడి రవీందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన గ్రామసభల వలన లబ్ధిదారులను ఎంపిక చేయలేదు ప్రజలకు జరగలేదన్నారు.రాష్ట్రంలో
ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతతో
ఎన్నికల నుండి తప్పుకోవడానికే మండలానికి ఒక చిన్న గ్రామాన్ని ఎంపిక చేసి ఎన్నికల నుండి తప్పించుకోవడానికి పథకాలను ప్రారంభించినట్లు అధికారులను గ్రామ సభల్లో వాడుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.బాధ్యతాయుతమైన అధికారుల సంతకాలు లేకుండా గ్రామసభల్లో లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు పైన రేవంత్ రెడ్డి,కింద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రకటనలు చేశారని లబ్ధిదారుల ఎంపిక సీఎం రేవంత్,ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రకటనలు చేశారని ఆరోపించారు.ప్రభుత్వ పథకాల అమలు పట్ల నియోజకవర్గ పరిధిలోని 179 గ్రామ పంచాయితీలకు గాను ఆరు గ్రామాల్లో ప్రారంభం చేశారని మిగతా గ్రామాలు అలాగే నర్సంపేట పట్టణ 24 వార్డుల్లో ప్రజలు మీకు ఓట్లు వేయలేదా ఆప్రజల భాధ్యత వద్దా అని ఎమ్మెల్యే దొంతిని ప్రశ్నించారు.
ఒక్కసారి ఓటు వేస్తే ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుకుంటే తప్పుచేయని అధికారులను తిట్ల దండకాలు
పడుతున్నాయని తెలియజేశారు.నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఊళ్ళల్లో వ్యాపారాలు చేసి అప్పులు ఎగగొట్టినోళ్ల విధంగా మారిందని ఐ.పి పెట్టిన వారీకి అప్పు పుట్టదు.సంక్షేమ పథకాలు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓట్లురావని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.ఇప్పుడు నర్సంపేటలో కొత్త సంస్కృతి నడుస్తున్నదని అంటూ గతంలో రేవూరి ప్రకాష్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను లక్ష్మారెడ్డి,ఆ తర్వాత మాధవరెడ్డి గతంలో ఉన్న ఎమ్మెల్యే పెండింగ్ పనులు పూర్తి స్థాయిలో చేశారు.ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను తెచ్చిన అభివృద్ధి పనులను నిలిపివేసి కక్ష తీర్చుకుంటున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై ఆరోపణలు చేశారు.అలాగే నేడు ఎలా పనులు వచ్చాయని ప్రశ్నించారు.గత రెండు సంవత్సరాల క్రితం పనులు చేసిన వాటికి పురోగతి లేదని క్యాన్సిల్ చేసిన మీరు నెల రోజుల్లోనే పనులు తెచ్చి పురోగతి ఎలా తెచ్చారని,గతంలో చేసిన పనుల పట్ల మీకు భాధ్యత లేదా అని మీరు ఎమ్మెల్యేనా లేక కాంట్రాక్టరా అని మాధవరెడ్డిని నిలదీశారు.ఎస్డీఫ్ ఫండ్స్ నుండి 2023 ఎన్నికలకు ముందు ఆగస్టు,సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో మూడు జీఓ ద్వార
జీఓ నంబర్ 369 ,187 పనులు,
7.22 నిధులు, 384 జీఓ నంబర్ ప్రకారం 17 కోట్ల నిధులతో 102 పనులు,జీఓ నంబర్ 452 ప్రకారం,18.95 కోట్ల నిధులు 385 పనులు మొత్తం 650 పనులు తెచ్చి పనులు మొదలు చేస్తే 650 పనులకు పురోగతి లేదని క్యాన్సిల్ చేశారు.
అదే ఎస్డిఎఫ్ నిధుల నుండి జీఓ నంబర్ ప్రకారం 22 ప్రకారం ఎమ్మెల్యే దొంతి 10 కోట్లు 2024 మార్చి నెలలో తెచ్చి 12 రోజుల్లో పనులు పురోగతిలో ఉన్నాయని వర్కులు చేస్తున్నారు.ఇది ధర్మమా అని ఎమ్మెల్యే దొంతిని అడిగారు.గతంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనులు చేశారు. ఈ విషయాలు బయటపెట్టాల్లా అని పేర్కొన్నారు.నర్సంపేటలో రైతుల అభివృద్ధి కోసం పైలెట్ ప్రాజెక్ట్ గా 60 కోట్ల నిధులు వ్యవసాయ యాంత్రీకరణపై తెస్తే రైతులు సంబరాలు చేసుకున్నారు.కానీ ఆ నిధులు ఆపేశారు.నిల్వ ఉన్న నిధులను ఉపయోగించుకులేనా చేయాలి అని కలెక్టర్ ను కోరినా.కానీ అవి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నర్సంపేట పరిధిలోని రైతుల 60 కోట్ల నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేయడానికి ప్రకటన చేసి టెండర్లు పూర్తి చేశారు.ఇది నర్సంపేట పరిస్థితి అని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.ఈకార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి,జిల్లా నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి,బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు,పట్టణ ప్రధాన కార్యదర్శి వేనుముద్దల శ్రీధర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ మండల శ్రీనివాస్,బండి రమేష్, పెండెం వెంకటేశ్వర్లు,గంప రాజేశ్వర్,పట్టణ ఉపాధ్యక్షులు పెండ్యాల యాదగిరి,పట్టణ యూత్ ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్,మద్దెల సాంబయ్య గౌడ్, పట్టణ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.