Nekkonda Mandal Development Review Meeting
మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశం
#నెక్కొండ, నేటి ధాత్రి:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నెక్కొండ మండల స్థాయిలో సమావేశం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి నోడల్ అధికారి నరసింహమూర్తి ఆధ్వర్యం వహించారు.
మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె. అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, తహసీల్దార్ వేముల రాజ్ కుమార్, ఎంపీడీవో జి. దయాకర్, సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ పాల్గొన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు రజిత, సీడీపీవో మధురిమ, అధికారి తన్వీర్, నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్‌తో పాటు ఇతర శాఖల మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో ప్రజా సేవల అమలు, సంక్షేమ పథకాల చేరవేత, మౌలిక వసతుల మెరుగుదలపై అధికారులు చర్చించారు.
సమావేశానికి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, మహిళా సమాఖ్య సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
