తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ దేవాలయం ముందర.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత మర మగ్గాల కార్మికుల మరియు అనుబంధ కార్మికుల సంక్షేమం కొరకు నిన్నటి రోజు.10.01.2025…G.O.3.. నంబర్. ద్వారా చేనేత అభయ హస్తంలోభాగంగా నేతన్న పొదుపు నేతన్న భద్రత. నేతన్న భరోసా..3. పథకాలను అమలుచేసి ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్రంలో నేతన్నలను కార్మికులను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పద్మశాలిలకు అండగా నిలుస్తున్న మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తంగళ్ళపల్లిమండల కేంద్రంలో ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు పాలాభిక్షేపం చేయడం జరిగిందని పద్మశాలిలకు నేతఅన్నలకు కార్మికులకు మంచి మంచి పథకాలు తీసుకొచ్చి వారి సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి పద్మశాలి కుల బాంధవులతరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూపాలాభిషేకం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతన్న భరోసాచేనేత పొదుపు పథకాలు తీసుకొచ్చి పద్మశాలిల అభివృద్ధి కొరకు ఎంతో తోడ్పడుతున్నారని అలాగే నేతన్న పొదుపు పథకం యొక్క కాల పరిమితి 36 నెలలు నుండి 24 నెలలకు తగ్గించడం జరిగినది ఇట్టి పథకంలో భాగంగా చేనేత కార్మికుల తమ యొక్క వేతనంలో 8 శాతం జమ చేస్తే ప్రభుత్వ వాటా 16% జమ చేయడం జరుగుతుందని అదేవిధంగా మరమగ్గాల కార్మికులు తమ వేతనంలో 8 శాతం జమ చేస్తే ప్రభుత్వ వాటా ఎనిమిది శాతం జమ చేయడం జరుగుతుందని కార్మికుని వాటా గరిష్టంగా 1200 కు జమ చేసుకోవడానికి అర్హులు అవుతారని నేతన్నల భద్రత పథకంకింద కార్మికుడు ఏదైనా కారణం చేత మరణించిన వారి నామిని కి ఐదు లక్షల రూపాయలు విడుదల చేయడం జరుగుతుందని వృత్తిలో ఉండి వయసుతో సంబంధం లేకుండా ఉన్న కార్మికులకు ఇట్టి పథకం అమలు చేయడం జరుగుతుందని నేతన్న భరోసా పథకం ద్వారా చేనేత కార్మికులకు సంవత్సరానికి 18,000 చేనేత అనుబంధ కార్మికులకు 6000 చొప్పున ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుందని ఇట్టి మంచి పథకాన్ని తీసుకువచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పద్మశాలీలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి చేనేత అభయ హస్తంలో భాగంగా మూడు పథకాలు అమలు చేసిన ఘనత ఒక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి కిమంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని పనులు మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా పాలనలో చేస్తున్నారని పద్మశాలిలకు ఇటువంటి మంచి పథకాలు తీసుకురావడానికి కృషిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి తుమ్మల నాగేశ్వరరావు కి శ్రీధర్ బాబు కి పొన్నం ప్రభాకర్ కి ఆది శ్రీనివాస్ కి నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారి సంక్షేమానికి మరిన్ని మంచి పథకాలు తీసుకురావాలని ఆశిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన పద్మశాలి కార్మికులకు నేతన్నలకుకుల బాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు ఇట్టి పాలాభిషేక కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవా దళ్ అధ్యక్షుడు మోర రాజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపల్లి ఆనందం తెలంగాణ పద్మశాలి ఐక్యవేదిక రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు అoకారపు మహేష్ పద్మశాలి సంఘ ఉపాధ్యక్షులు భీమని అశోక్ పద్మశాలి కార్యవర్గ సభ్యులు మ్యానశంకర్ గంగాధర్ కాంగ్రెస్ నాయకులు సుద్దాల శ్రీనివాస్ ఎడమల ప్రతాపరెడ్డి లక్ష్మీనరసు. నారాయణ గంగాధర్ కోడం శ్రీధర్ చేనేత మర మగ్గాల కార్మికులు మరియు అనుబంధ కార్మిక లు పద్మశాలీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు