రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని
డిమాండ్
ఎలక్షన్ ముందు ఈశాన్యం అన్నారు కానీ రోడ్డును నాశనం చేశారు
20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేని గ్రామాలు
నిజాంపేట: నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రం నుండి నస్కల్, నంద గోకుల్, చల్మెడ గ్రామాల మీదుగా సిద్దిపేట హైవే వరకు గత ప్రభుత్వ హయాంలో రోడ్డు సాంక్షన్ అయ్యింది కానీ ఇప్పటికి 15 నెలలు గడుస్తున్నప్పటికీ పనులు ప్రారంభించడం లేదని ఆరోపిస్తూ నస్కల్ గ్రామస్తులు నిజాంపేట మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన నస్కల్ రోడ్డు దుస్థితి మాత్రం మారడం లేదన్నారు. ఈ రోడ్డు గుండా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లవలసి వస్తుందన్నారు. ఈ రోడ్డు విషయమై ఎన్నిసార్లు అధికారులకు విన్నవిచ్చినప్పటికీ ఏలాంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించాలన్నారు. రోడ్డు పనులు ప్రారంభించేంత వరకు రిలే దీక్షలు కొనసాగుతయన్నారు. ఈ కార్యక్రమం లో దుబాసి సంజీవ్, దేశెట్టి లింగం, కురుమ బాల్ రాజ్, ఎల్లం యాదవ్, దుర్గయ్య, లింగం,వెంకటేష్ గౌడ్, మహమ్మద్ అభిబ్, రవి, రహీమ్, నరేష్ గౌడ్, అజయ్ గౌడ్,లు ఉన్నారు.