రాకేష్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి

విద్యావంతులైన యువత కు సేవ చేసే అవకాశం కల్పించండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల పట్టణ బిఆర్ఎస్ ఇంచార్జి ఇంగిలి వీరేష్ రావు

పరకాల నేటిధాత్రి
బిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల పట్టణ ఇంచార్జి ఇంగిలి వీరేష్ రావు అన్నారు.శుక్రవారం ఆయన పరకాల పట్టణంలోని పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా విద్యావంతుడు,యువకుడైన ఏనుగుల రాకేష్ రెడ్డికి పట్టభద్రులంత మద్దతు ఇవ్వాలని కోరారు.ప్రజాసేవ లక్ష్యంగా రాకేష్ రెడ్డి గత 13 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారని కాంగ్రెస్,బీజేపీ పార్టీల అభ్యర్థులు చీటర్ లు,మోసగాళ్లని ప్రజల పేరు పార్టీల పేరు చెప్పుకొని అక్రమంగా డబ్బులు సంపాదించడమే వారి లక్ష్యం తప్ప ప్రజలకు ఏనాడూ రూపాయి సహాయం చేసింది లేదన్నారు.రాకేష్ రెడ్డి సొంతగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారని కరోనా లాంటి సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేశారని తెలిపారు.విద్యవంతుడైన రాకేష్ రెడ్డి ని గెలిపించడం ద్వారా నిరుద్యోగుల,పట్టభద్రుల గొంతై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు.పట్టభద్రులంత మూడో క్రమ సంఖ్యలో మొదటి ప్రాధాన్యత వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ క్లస్టర్ ఇంచార్జి లు,బొచ్చు బాబురావు,హమీద్,బండి రమేష్ గౌడ్,తదితర నాయకులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం చేసిన బిజెపి నాయకుడు

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామంలో పెనిమిల్ల నాగమ్మ మరణించారు .ఈవిషయం తెలుసుకున్న గ్రామ బిజెపి సీనియర్ నాయకుడు బి గాందీ డి . నరేందర్ గౌడ్ ఆమె కుటుంబాన్ని పరామర్శించి 5000వెల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు . పరామర్శించిన వారిలో బిజెపి నాయకులు దాది కొండన్న గుజ్జుల రమేష్ రామస్వామి కృష్ణ బాలకృష్ణ తదితరులు ఉన్నారు

క్రాస్‌ ఓటింగ్‌ ట్రిక్కులే!

https://epaper.netidhatri.com/view/274/netidhathri-e-paper-24th-may-2024%09

చేతగాని వారు చెప్పే లెక్కలే!!

`క్రాస్‌ ఓటింగ్‌ మ్యాజిక్‌ కాదు!

`ఓటింగ్‌ లో లాజిక్‌ లేని పద్దు లేదు.

`రాజకీయ పార్టీలు ఎప్పుడు ఏది చెబితే జనం అది వింటారా?

`రాత్రికి రాత్రే ప్రజలు మనసు మార్చుకుంటారా?

`ఇంతకీ అలాంటి ఓటింగ్‌ సాద్యమా!

`అదే నిజమైతే నెలల తరబడి ప్రచారాలెందుకు?

`కోట్లలో ఖర్చులెందుకు?

`ఎన్నికలకు రెండు రోజుల సమయం సరిపోదా?

`ప్రజలు చాలా విజ్ఞులు.

`డెబ్బై ఏళ్ల స్వతంత్రంలో ఎప్పుడు ఎవరిని ఎన్నుకోవాలో ఎన్నుకున్నారు.

`ఏ పార్టీని పక్కన పెట్టాలో పెట్టారు.

`క్రాస్‌ ఓటింగ్‌ అనే పదానికే అర్థం లేదు.

`ఆ మాటకే ప్రజల్లో విలువ లేదు.

`ఎవరు ఎన్ని చెప్పినా ఏది నమ్మాలో అదే నమ్ముతారు.

`ఎవరిని గెలిపించాలో వారినే గెలిపిస్తారు.

`ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు.

`ప్రజలే విజేతలు.

`నాయకులు ఎప్పుడూ సేవకులే…

` ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచినవారే…

`ప్రజల చైతన్యం ముందు ఏ నాయకుడు గొప్ప వాడు కాదు.

`ప్రజలకు దారి చూపుతున్నామనుకుంటే అంతకన్నా మూరు?డు లేడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా ఎలాంటి పొత్తులు లేకుండా ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీకి ఓటేయమని చెబుతుందా? పొత్తుల్లో భాగంగా అదికారికంగా చెప్పడం వేరు. ఎలాంటి అవగాహన లేకుండా, లోపాయి కారి ఒప్పందం లేకుండా ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీకి ఓటు వేయమని చెప్పడం జరుగుతుందా? అది సాధ్యమేనా? రోజుల తరబడి పొత్తుల గురించి ప్రజలకు చెప్పీ, చెప్పీ, ప్రచారం ఎంత చేసినా కొన్నిసార్లు పార్టీల మధ్య పొత్తుల గురించి సామాన్యులకు తెలియకపోవచ్చు. అలాంటిది రాత్రికి రాత్రి ఒక పార్టీ మరో పార్టీకి ఓటు వేయమని చెప్పడం అన్నది సాధ్యమయ్యే పనేనా? ఎక్కడైనా మా పార్టీకి వేయలేకపోతే మరో పార్టీకి వేయమని చెప్పడం అన్నది నిజంగా జరిగే ప్రక్రియేనా? అప్పుడు ఆపార్టీకి ఆత్మహత్యా సదృష్యం కాదా? ఆ పార్టీ తన మనుగడను తానే తుంచుకున్నట్లు కాదా? రాజకీయంగా తన గొయ్యి తాను తీసుకున్నట్లు కాదా? ఎన్ని రోజులు ప్రచారమైనా, ఎంతటి ప్రచారమైనా ఆఖరు ఓటు దాకా మాకే పడాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. కాని క్రాస్‌ ఓటింగ్‌ చేయమంటూ ఎప్పుడూ చెప్పదు. కాకపోతే ఎన్నికల ప్రచారం సాగిన సమయంలోనే అధికారిక అవగాహన వుంటే తప్ప జరగదు. ఇంకా ఫలితాలు వెలువడని పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ, ప్రజలు తమ పార్టీని నమ్మడం లేదని తెలుసుకొని, బిజేపికి ఓట్లు వేయమని చెప్పినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నిజంగా అలాంటిది ఏమైనా జరిగిందా? అందుకు ఆధారాలున్నాయా? లేవు. కాని వున్నాయంటూ దుష్ప్రచారం సాగిస్తుంటారు. ఒక వేళ వుంటే ఎప్పుడో బైట పెట్టేస్తారు. ఇలాంటి వార్తలు ప్రత్యర్ధి పార్టీలకు ఎంతో అవసరం. అలా ప్రచారం చేయడం తప్పు కాకపోవచ్చు. కాని నైతికత కాదు. అందువల్ల అలాంటి ఆడియోలు వున్నా, వీడియాలు వున్నా ఇప్పటికే బైటకు వచ్చేవి. కాని రాజకీయ నాయకులు పనిగట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తుంటారు.
విశ్లేషలుగా చెలామణి అవుతున్న కొంత మంది సోకాల్డ్‌ స్వయం ప్రకటిత మేధావులు ఇలాంటి లేని పోని చర్చలు తెరమీదకు తెస్తారు. వాటిని కొంత మంది నాయకులు కూడా నమ్ముతుంటారు. అలాంటి ట్రాప్‌లో పడ్డ కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి వినోద్‌కుమార్‌ ఏకంగా తాను ఓడిపోతున్నానంటూ ప్రకటన చేయడం ఒక్కసారి దుమారం రేగింది. క్రాస్‌ ఓటింగ్‌ ప్రకటన ఆయన నోటి నుంచి రావడంతో అనుమానం మొదలైంది. ఆయనకు కూడా తెలుసు. రాత్రికి రాత్రి అలాంటి ప్రచారం సాధ్యం కాదని, కాకపోతే జరిగి వుండొచ్చు? అన్న అబద్దాలు ఎవరైనా తొందరగా నమ్ముతారు. నిజానికి వినోద్‌ కుమార్‌ చెప్పినట్లు క్రాస్‌ ఓటింగ్‌ అన్నది నిజంగానే జరిగితే అది ప్రచారం సాగినంత కాలం మెల్లిగా చాప కింద నీరులా సాగాలే గాని, రాత్రికి రాత్రే జరిగేది కాదు. అయినా తన నియోజకవర్గ పరిధితో తన అనుచరులెవరో..తనతో వుంటూనే తన ప్రత్యర్ధులెవరో.. తన పక్కనే వుంటూ గోతులు తీసేదెవరో వినోద్‌ కుమార్‌కు తెలియదా? ముందు జగ్రత్త పడొద్దా? ప్రపంచం మూలల్లో ఏం జరుగుతుందో కూడా చెప్పగలిగే వినోద్‌ కుమార్‌ తన పార్లమెంటు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడా? 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన నుంచి ఐదేళ్లపాటు నియోజకవర్గం అభివృద్ది వదిలేశాడా? నిజంగా పట్టించుకుంటే ప్రజలు వద్దనుకున్నారా? బండి సంజయ్‌ ఐదు పైసలు పని చేయకపోతే, వినోద్‌ కుమార్‌ను ఎన్నుకునే అవకాశంవుంది. అప్పుడు క్రాస్‌ ఓటింగ్‌ అవసరం ఎందకు? ప్రజలు వినోద్‌ కుమార్‌ వ్యతిరేక వర్గం ఏది చెబితే అది వినే పరిస్ధితుల్లో ప్రజలుంటారా? ఎక్కడ అనుమానం వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రచారం ఎలా మొదలైంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నేపధ్యంతో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఇది రాష్ట్రంలో పెద్దఎత్తున సాగుతున్న చర్చ. అసలు క్రాస్‌ ఓటింగ్‌ అంటే ఏమిటి? దీనికి ఎవరి వద్ద సమాదానం లేదు. వుండదు. కేవలం ఎన్నికల కోసం అప్పుడప్పుడు మాత్రమే వాడే పదం. అంతే తప్ప దానికి సరైన నిర్వచనం లేదు. చెప్పిన వారు లేరు. కాకపోతే ఓ పార్టీకి పడాల్సిన ఓట్లు మరో పార్టీకి పడ్డాయి..ఇది కొందరు చెప్పే లాజిక్‌. శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి వచ్చినప్పుడు ఓటర్లు రాష్ట్ర శాసనసభకు ఓ పార్టీని ఓటేస్తే, పార్లమెంటు విషయంలో మరోపార్టీకి ఓటేస్తారు అని చెప్పేది మరో లాజిక్‌. అంతకు మించి ఎలాంటి లెక్కలు చెప్పరు. దానికి సరైన ఆదారాలు లేవు.
ప్రతిసారి ఎన్నికల ముందు ఒక మాట..ఎన్నికల తర్వాత మరో మాట… ఫలితాల నాడు మరో కొత్త ముచ్చట చెప్పడం పార్టీలకు అలవాటు. మీడియాకు అలవాటు. కాని అసలు విషయం ఎవరూ చెప్పరు. అసలు ప్రజలు క్రాస్‌ ఓటింగ్‌ ఎందుకు చేస్తారు? ప్రజలకు ఆ అవసరం ఏముంటుంది? ఇది అసలు మనం చర్చించుకోవాల్సిన అంశం. ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కసారి ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత ఎవరికి ఓటు వేయాలో..వారికే వేస్తారు. అంతే తప్ప హరిహర బ్రహ్మాధులు దిగి వచ్చి చెప్పినా వినరు. ఇక పోతే ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే ఓటు వేస్తారనేది కూడా పచ్చి అబద్దం. కాకపోతే డబ్బులు ఇవ్వడం పార్టీలు, నాయకులు అలవాటు చేశారు. తీసుకోవడం ప్రజలు నేర్చుకున్నారు. నాయకులు పంచే సొమ్ము కూడా మనదే అనే స్దాయికి కూడా చేరుకున్నారు. ఇది కూడా రాజకీయ పార్టీలే ప్రజలకు నేర్పుతున్నాయి. ఎవరెంత ఇచ్చినా తీసుకోండి..ఓటు మాత్రం మాకే వేయండి అని నాయకులు చెప్పడం అలవాటు చేసుకున్నారు. ప్రజలు కూడా అనుసరించడం నేర్చుకున్నారు. ఇదిలా వుంటే క్రాస్‌ ఓటింగ్‌ చేయమంటే చేస్తారా? మాకు కాకుండా మరో పార్టీకి వేయమంటే వేస్తారా? రాత్రికి రాత్రి సినారియో మార్చే అవకాశం వుంటుందా? ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు పడాల్సిన ఓట్లు బిజేపికి పడ్డాయన్నది కొందరు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారం. అంతెందుకు కరీంనగర్‌ పార్లమెంటు స్దానానికి పోటీ చేసిన బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి మాజీ ఎంపి వినోద్‌ కుమార్‌ చెప్పిన లాజిక్‌ ఏమిటో ఆయనకే తెలియాలి. ఎన్నికల్లో అంతటి పండితుడే అయితే ఇన్ని రోజులు ఏంచేసినట్లు? ప్రజల మనసు ఎందకు చూరగొనలేకపోయినట్లు? క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని ఆయనకు ఎలా తెలుసు. ముందు ఎందుకు తెలియలేదు. కనీసం మూడు నెలల కాలంగా ప్రజల్లో వుంటున్నారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ప్రజల చేత మాట తీసుకుంటున్నాడు. ఊరూరు తిరిగి ప్రచారం చేశాడు. ఎన్నికలవేళ కోట్లు ఖర్చు చేశాడు. తీరా ఫలితాలు రాకముందే జోస్యం చెబుతున్నాడు. ఓ వైపు బిఆర్‌ఎస్‌ అధినత కేసిఆర్‌ మాకు పదమూడు సీట్లు వస్తాయంటూ ప్రకటనలు చేస్తున్నాడు. వినోద్‌కుమార్‌తాను ఓడిపోతున్నానని ప్రకటిస్తున్నాడు. ఇందులో ఎవరి మాట ప్రజలు నమ్మాలి. అలాగే ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ఏ పార్టీ అయినా తమకు ఓటు వేయమని చెబుతుందే గాని, వేరే పార్టీకి ఓటు వేయమని చెప్పడ ఏమిటి? స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఇది కొంత వరకు సాధ్యం. ఎందుకంటూ తక్కువ ఓటర్లు వుంటారు. ఊర్లు కావడంతో ఒక్కరోజు ప్రచారం చాలు. కాని పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇలాంటివి సాధ్యమేనా? ఇక్కడ మరో మాట చెప్పుకోవాలి. క్రాస్‌ ఓటింగ్‌ అన్న పదం ఇప్పుడు పుట్టింది కాదు. ఎన్నికలు పుట్టిన నాడే పుట్టిన పదం. ఇప్పుడంటే సమాచార సాధనాలు చేతిలో వున్నాయి. సెల్‌ఫోన్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అయినా ఎంత మందికి చేయగలరు. మరి గతంలో ఏలాంటి సమచార వ్యవస్ధ లేదు. అప్పుడు కూడా ఇదే చెప్పారు. అంటే ఇదంతా ట్రాష్‌. తమ పార్టీకి ఓటు వేయమని చెప్పినా వినని, ప్రజలు మరో పార్టీకి ఓటు వేయమని చెబితే వింటారా? ఇది విచిత్రమైన వాదన. రాజకీయ పార్టీలు అన్నవి చేతులెత్తేయడం అన్నది ఎక్కడా జరగదు. ఒక వేళ అభ్యర్థులు తమకు అనుకూలంగా పరిస్ధితి లేదని గ్రహించినప్పుడు లోపాయి కారి ఒప్పందాలు ముందే చేసుకునే అవకాశం వుంది. అప్పుడు కొన్ని రోజులు మందు మాత్రమే ఇలాంటివి సాధ్యం.

రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే సత్యం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట నుండి గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామాల మధ్య రోడ్డు గుంతల మయంగా మారి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తిర్మలాపూర్ గ్రామం వద్ద రోడ్డును పరిశీలించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం తూతు మంత్రంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయించి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రజల ఇబ్బందులను తీర్చాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గోపాలరావుపేట నుండి బూరుగుపల్లి వరకు రోడ్డు నిర్మాణం కోసం ఆరు కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యం అధికారులను ఆదేశించారు. ఏళ్లకు ఏళ్లుగా గుంతలమయంగా ఉన్న రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడ్డ తమ కష్టాలు త్వరలోనే తీరునున్నాయని రెండు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి హరీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి, ముదిరాజ్, దేశరాజుపల్లి తాజా మాజీ సర్పంచ్ కోల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, మాజీ ఎంపిటిసి తడగొండ హన్మంతు, మండల ఉపాధ్యక్షులు కట్ల శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు తడగొండ లక్ష్మణ్. తిరుమలపూర్ మాజీ సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి మహోత్సవాలు

కథలాపూర్,నేటిధాత్రి :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలో అత్యంత మహిమగల పుణ్యక్షేత్రం స్వయంభు లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం స్వామివారి పల్లకి సేవ, మహా అన్నదానం నిర్వహించారు. ఈ దుంపిటాచల క్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే స్వయంభు లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ముక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలలో అవకతవకలకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన డాక్టర్ రాజా రమేష్ బాబు

జైపూర్, నేటి ధాత్రి:

చెన్నూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూర్ నియోజకవర్గం లోని దుబ్బపల్లి, పొన్నారం, దుగ్నేపల్లి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ దుగ్నేపల్లి దగ్గర కాంటలోపం వల్ల ప్రతి బస్తాకు కేజీ నుండి కేజీన్నర తూకం వేసి రైతులను మోసం చేస్తున్నారు. పోన్నారం దగ్గర రైతుల వడ్లుకొని రసీదు ఇచ్చే సమయంలో వడ్లకు సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు జత చేసి రైతుల వడ్లని వారికి కొంత భాగం కేటాయిస్తూ మోసం చేయడం అలాగే దుబ్బపల్లి లో ప్రతి లారీకి 8 క్వింటాళ్ల వడ్లను తక్కువ వచ్చినవి అనే సాకుతో అక్కడున్నటువంటి రైతులను మోసం చేయడం జరుగుతుంది. ఈ మూడు వడ్ల కొనుగోలు సెంటర్లో జరుగుతున్నటువంటి అవినీతి ఆధారాలను చూపిస్తూ ఇట్టి చర్యలకు పాల్పడిన కాంగ్రెస్ నాయకుల పై అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే చెన్నూరు నియోజకవర్గం లోని ప్రతి ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జేసీ కి వినతి పత్రం అందజేసిన చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు. ఎంపీపీ మంత్రి బాపు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రెడ్డి,మాజీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సమ్మి రెడ్డి, సోమన పల్లి ఎంపీటీసీ తుమ్మల తిరుపతి రెడ్డి, గోగుల రవీందర్ రెడ్డి, కిరణ్, అర్జున్ రెడ్డి, రవీందర్ గౌడ్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుద్ధ జయంతి వేడుకలు

కాటారం, నేటి ధాత్రి

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుద్ధ జయంతి వేడుకలు కాటారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనీయకుడని, ఆయన చూపిన మార్గం ముందుకు సాగాలని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పిన ఒక్క మాటతో 1956 విజయదశమి రోజున 5 లక్షల మంది, పరిస్థితి రోజు మూడు లక్షల మంది బౌద్ధమతంలోకి మారారని తెలిపారు. భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ను డాక్టర్ అంబేద్కర్ బౌద్ధం నుండే సేకరించినట్లు చెప్తాడని ఈ సందర్భంగా తెలిపారు. బౌద్ధం శాంతిని , అహింసను బోధిస్తుందని అందుకే ప్రపంచానికి భారతదేశం శాంతిని చెబుతుందని పీక కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్, పోచయ్య, ఉమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు

జిల్లాలో యథేచ్చగా కల్తీ కల్లు వ్యాపారం.

ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్న కల్తీ కల్లు మాఫీయా.

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖాధికారులు.

నియంత్రించడంలో నిమ్మకు నిరేత్తినట్లుగా వావ్యహారం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్, జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట,కోయిల్ కొండా, హన్వాడ,దేవర కదిర, మండలాలలో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్చగా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖాధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా కల్లు తయారుచేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. జిల్లాలో కల్తీకల్లు వ్యాపారం జోరందుకుంది మండలాలలోని ప్రతి గ్రామాలలో గల్లి గల్లి కి వేసవి షర్బత్ సెంటర్ల మాదిరి దుకాణాలు వెలుస్తున్నాయి.సహజ సిద్ధంగా ఈత,తాటి చెట్టు నుంచి వచ్చే కల్లును మాత్రమే అందించవలసి ఉంది కానీ? కొంతమంది వ్యక్తులు అక్రమంగా డబ్బుకు అలవాటు పడి ప్రమాదకరమైన మారకద్రవ్యాలు ఇతర రసాయనాలతో కాల కాలకూట విషం లాంటి కల్తీకల్లు తయారు చేసి సామాన్య కూలీలకు అంటగడుతున్నారు. ఇంత జరిగినా లోపాయికారీ ఒప్పందాలతో చూసి చూడనట్లు ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప జిల్లా అధికారుల్లో కదలిక రావడం లేదు. రోజంతా కష్టపడి అలసటను తీర్చుకునేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు తాగే మద్యం అలవాటు కొందరు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోందని చెప్పవచ్చు. ఈ కల్తీ కల్లులో అసలు కల్లుకు బదులు నీటిలో అల్పాజోలం, సిట్రిక్ యాసిడ్, డైజోపాం, క్లోరల్ హైడ్రేట్ వంటి విషపదార్థాలను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోజంతా కష్టపడ్డ వారికి రూ.15 లతో కల్తీ కల్లు సేవించి మత్తులో జోగుతున్నారు. దీంతో కల్తీ కల్లు తాగుతున్న ప్రజలు వ్యాదుల భారిన పడుతున్న విషయం తెలిసిందే. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి తనిఖీలు చేస్తే తప్ప జిల్లా అధికారులు తనిఖీలు చేయలేకపోతున్నారు. జిల్లాలో గౌడ సోసైటిలు ఉండగా, గ్రామాల్లో వేయి లల్లో కల్లు దుకాణలు ఉన్నాయి. నగరంలో ఎన్ని కల్లు డిపోలు ఉన్నాయి. ఆడిపో పరిధిలో లైసెన్స్ వున్నవి ఎన్ని దుకాణలు ఉన్నాయో లైసన్స్ లేనివి ఎన్ని ఉన్నాయో కనీసం వాటికి కూడా పొంతనలేదు, మండలాలలోని కల్లు దుకాణాల నుంచి రోజుకు లక్షల లీటర్ల కల్తీ కల్లును యజమానులు విక్రయిస్తున్నారు. గీత కార్మికుల కోసం చెట్ల నుంచి కల్లు తీసేందుకు అనుమతి ఇచ్చారు. విటి పరిధిలో గీత కార్మికులు చెట్లను పెంచుతూ కల్లు అమ్మకాలు చేస్తున్నారు. తాటి చెట్లతో పాటు ఈత చెట్ల నుంచి కల్లును సోసైటిల ద్వారా తీస్తున్నారు. చెట్ల నుంచి తీసిన కల్లును కొన్ని డిపోల పరిధిలో అమ్మకాలు చెస్తున్నారు. కల్లు దుకాణాల ద్వారా ప్రతిరోజు ఈ కల్లును తీసి అమ్ముతున్నారు. జిల్లాలో కొన్ని సోసైటిల పరిధిలో చెట్ల నుంచి తీసిందే కాకుండా కల్తీ కల్లు అమ్మకాలను జోరుగా సాగిస్తున్నారు. రసాయనాల ద్వారా కృత్రిమంగా కల్లు తయారుచేస్తూ ఈ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. చెట్ల నుంచి పారే కల్లును సోసైటిలకు తరలించి అమ్మకాలు చేయాల్సి ఉన్నా కొన్ని చోట్ల రసాయనలతో కల్తీ కల్లును అమ్ముతున్నారు. ఈ కల్తీ కల్లులో అల్పాజోలం, సిట్రిక్ యాసిడ్, డైజోపాం, క్లోరల్ హైడ్రేట్ వంటి నిషేదిత రసాయనాలను కర్ణాటక మహరాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి లక్షల రూపాయలు విచ్చేంచి కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఉపయోగించి కృత్రిమంగా కల్లును తయారుచేస్తున్నారు. ఈ కల్తీ కల్లు తగిన వారికి ఆరోగ్యపరమైన పలు ఇబ్బందులు ఎదరువుతున్న పట్టించుకోనే నాదుడే కరువయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ దుకాణాలను మూసివేసినప్పుడు కల్తీ కల్లు తగేవారు రకరకల జబ్బులు వచ్చి ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఈ కల్లు తాగిన వారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిగా, ఆసుపత్రుల్లో చేరిన సంఘటనలు ఉన్నాయి. ఈ కల్తీ కల్లు తాగిన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించిన ఎక్సైజ్ శాఖాధికారులు మాత్రం నియంత్రించడంలో నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అధికారుల సహకారంతో యథేచ్చగా కల్తీ కల్లు అమ్మకాలను కల్లు తయారీదారులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్లు దుకాణాదారుల నుంచి అధికారులకు పరిచయాలు ఉండడం, వారి అవసరాలు నేరవేరుతుండడంతో పట్టించుకోనే వారు లేకపోవడం గమనార్హం. ఏ దుకాణాల పరిధిలో చెట్ల కల్లు అమ్మకాలు జరుగుతున్నాయో లేదో వివరాలు ఎక్సైజ్ అధికారులకు తెలిసిన కనీస తనిఖీలు చేయడంలేదని విమర్శలు ఉన్నాయి. చివరకు కల్లు నాణ్యత పరిక్షలు కూడా నిర్వహించడం లేదనే తెలుస్తుంది. నగర పరిధిలో ఎక్కువ మొత్తంలో కల్తీ కల్లు అమ్మకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కల్లీ కల్లు విక్రయాలు జరుగుతున్న జిల్లా స్థాయి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర స్థాయిలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వచ్చి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు కల్లు దుకాణాలను తనిఖీ చేసిన సందర్భాలు ఇటివల లేకుండా పోయింది. దాంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన జిల్లా ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లుపై చర్యలు తీసుకుంటారో లేదో విచే చూడల్సిందే.

గ్రామీణ వైద్యుల పై టిఎస్ఎంసి, ఎన్ఎంసి దాడులు ఆపాలి

ఆర్.ఎం.పి & పి.ఎం.పి జిల్లా ప్రధాన కార్యదర్శి బొద్దుల శ్రీనివాస్

జైపూర్, నేటి ధాత్రి :

ఎన్నో ఏళ్ల తరబడి ప్రథమ చికిత్స సేవలు అందిస్తూ
ఇదే మా జీవనోపాధిగా కొనసాగిస్తూ
గ్రామీణ వైద్యులు లేకపోతే ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటారని ప్రతి పల్లెటూరిలో గడప గడపకి వారి ఇంట్లో ఎంత మంది ఉన్నారో గ్రామీణ వైద్యులకు తెలుసు కోడి కూత కూసిన తరువాత బ్యాగు పట్టుకొని ఎలా ఉందమ్మా మీ ఆరోగ్యం అనేది గ్రామీణ వైద్యులే. రాత్రనక పగలనక ఎండ ఆనక వాన ఆనక నిత్యం అందుబాటులో ఉండేది గ్రామీణ వైద్యులే.
కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మూసి వేయడం గ్రామీణ వైద్యులు మాత్రం ధైర్యంగా తగు జాగ్రత్తలు ప్రజలకు చెప్తూ గ్రామీణ వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టీ వైద్యసేవలు అందించారని పేర్కొన్నారు.
క్వాలిపై డాక్టర్లు సెల్ఫ్ ఇంజక్షన్ లు సెలైన్ బాటిల్స్ వ్రాస్తే ఇంజెక్షన్లు ఇచ్చేది గ్రామీణ వైద్యులే దయచేసి గ్రామీణ వైద్యుల పై దాడులు ఆపాలని కోరుతున్నాము.
అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి వై ఏ స్.రాజశేఖర్ రెడ్డి గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ఇచ్చారు.
మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే శిక్షణ తరగతుల మొదలు పెట్టాలని అర్హులైన గ్రామీణ వైద్యులకు 108 లో కానీ పల్లె దావాఖనలో తీసుకోవాలని మంచిర్యాల ఆర్.ఎం.పి, పి.ఎం.పి జిల్లా ప్రధాన కార్యదర్శి బోద్ధుల శ్రీనివాస్ అన్నారు.

పల్లె పకృతి వనాలు, అమ్మఆదర్శ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంతో పాటు చిప్పకుర్తి గ్రామాలలోని పల్లె పకృతి వనాలను, మోతే గ్రామంలోని అమ్మఆదర్శ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సందర్శించడం జరిగినది. ఈసందర్భంగా ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న డ్రింకింగ్ వాటర్, మేజర్ అండ్ మైనర్ వర్క్స్, టాయిలెట్ వర్క్స్ మొదలగు పనులు పరిశీలించిన అనంతరం పాఠశాలకు ఈజీఎస్ లో ప్రహరి గోడ ప్రపోజల్ పెట్టమని పిఆర్ఎఈకి తెలియజేయడం జరిగినది. ఈపనులన్నీ త్వరగా పూర్తి చేయాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో పిఆర్ఏఈ సచిన్, ఎంపిడిఓ రాజేశ్వరి, ఎంఈఓ అంబటి వేణు కుమార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ప్రధానోపాధ్యాయులు సునీత, వీవో, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా చైతన్య సాధనలో పీసా మొబిలైజర్,

జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత”” వజ్జరాజు””

ములుగు మండలం : నేటి ధాత్రి

ఎవరు ఎక్కడ పోతే నాకేంటి? నేను నా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నామా? లేదా? ఒకరికి సేవ చేస్తే నాకేం వస్తది అంటూ వారు ప్రజలకు సేవ చేయకపోగా చేసే వారిని అవహేళన చేస్తూ చూసే ప్రబుద్ధులు ఉన్న నేటి సమాజంలో ములుగు మండల రాయిని గూడెం గ్రామానికి చెందిన ఒక ఆదివాసి గిరిజన యువకుడు పీసా మొబైలైజర్ , దళిత సాహిత్య అకాడమీ వారిచే దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ అంబేద్కర్ అవార్డు పొందిన వజ్జరాజు ప్రజా చైతన్య సమాజ నిస్వార్థ సేవలో ముందుకు దూసుకు వెళ్తున్నాడు . చిన్నతనం నుండి చురుకుగా ఉంటూ ఉన్నత విద్య నభ్యసించి ప్రజలను చైతన్యపరిచి సమాజసేవే పరమావధిగా తనతోపాటు తమ చుట్టుప్రక్కలగల లోతట్టు గ్రామాల గిరిజన, గిరిజనేతర, ఆదివాసి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నాడనుటలో ఎలాంటి సందేహం లేదు మచ్చుకు కొన్ని ఉదా: ములుగు జిల్లాగా ప్రకటించక ముందు ములుగు మండల ఉమ్మడి కొత్తూరు గ్రామపంచాయతీకి చెందిన సుమారు 7 గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించి గ్రామాలా భివృద్ధి లక్ష్యంగా అప్పటి పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయటంలో సైతం కృషిచేసిన విషయం అందరికీ తెలిసినదే లోతట్టు గ్రామాలైన పంచోతుకులపల్లి, కన్నాయి గూడెం, యాపలగడ్డ, కొత్తూరు, రాయినిగూడెం, దుబ్బగూడం ,పెగడపల్లి, సర్వాపూర్, లాలాయ్ గూడెం, జగ్గన్న గూడెం, అంకన్నగూడెం ప్రాంతాల అభివృద్ధికి కృషిలో భాగంగా అన్ని గ్రామాల ప్రజల ను ఏకం చేసి ప్రస్తుత ఆదివాసి ములుగు జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పంచాయతీరాజ్ మినిస్టర్ ( సీతక్క )దనసరి అనసూయను రాయిని గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు ఆహ్వానించి సన్మానించిన అనంతరం పైన పేర్కొనబడిన గ్రామాల పరిధిలోగల సమస్యల సాధనకు సీతక్కకు వినతి పత్రాలు అందింపజేసి సానుకూల స్పందన వచ్చేలా కృషి చేశాడు.
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 29 ప్రభుత్వ శాఖలలో గల ఖాళీలను ఆదివాసి గిరిజన నిరుద్యోగ విద్యావేత్తలతో పూరించాలని ఐటీడీఏ ఎదుట సామరస ధోరణితో పరిష్కార మార్గాలను వెతుకుటకు నిరసన దీక్ష తలపెట్టిన సందర్భం కూడా కలదు . ముఖ్యంగా ఆదివాసి ఏజెన్సీ గ్రామాల్లో యువతను చేరదీసి సమ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషిలో భాగంగా తమతో పాటు తమ గ్రామాల అభివృద్ధికి ఎలా కృషి చేయాలో నేర్పుటలో సైతం ముందున్నారు. ప్రజల సంక్షేమం కొరకు ఇటీవల రాయిని గూడెం గ్రామంలో గల భూలక్ష్మి ( బొడ్రాయి ) గ్రామ దేవతను , పోచమ్మ తల్లి ని, ఆంజనేయస్వామి ల విగ్రహాలను వాస్తు ప్రకారం గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో సుమారు వారం రోజులుగా ఆ దేవతలకు పూజ చేస్తూ వేద బ్రాహ్మణుల మధ్య, శాస్త్రోపేతంగా పునర్వ్యవస్థీకరించుటలో తనదైన పాత్ర అమోఘం, సమాజo లోని అస్పృశ్య , ఆకృత్యాలను తొలగించి న్యాయం, ధర్మం కాపాడుటలో కృషి చేస్తున్నందుకు గాను దళిత సాహిత్య అకాడమీ వారు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ అంబేడ్కర్ బిరుదునిచ్చి గౌరవంగా సత్కరించారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆయన సేవలను మరింత విస్తృత పరిచి రానున్న రోజులలో మరింత చేయాలని కోరుకుంటూ మామూలు పౌరుడు గానే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి” వజ్జ రాజు ” వచ్చి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పాపన్న జగదీశ్వర్ ఆధ్వర్యంలో ముక్తేశ్వర లాడ్జిలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడవడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దొందు దొందే ఈ రెండు పార్టీలను ప్రజలు ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యావంతులు విద్యార్థులు సమస్యల పట్టవు ఎన్నికల వచ్చినప్పుడు ఓట్లు వేయించుకునేందుకు ఆది చేస్తారు హామీలు ఇవ్వడం ప్రజలను మోసం చేయడం ఈ రెండు పార్టీల నైజం కావున వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు కన్నం జగదీశ్వర్ పాపన్న చల్ల నారాయణరెడ్డి శంకర్ నాయకులు పాల్గొన్నారు

కన్నుల పండువగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతే గ్రామంలో భోగ లక్ష్మణ్ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించగా మాజీ మార్కెట్ చైర్మన్ ఉప్పుల అంజని ప్రసాద్ కళ్యాణదాతగా వ్యవహరించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు తరలిరాగా పండితుల వేద మంత్రోత్సవాల మధ్య శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా,కన్నుల పండువగా జరిగినది. ఈకళ్యాణానికి ముఖ్యఅతిథిగా చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జవ్వాజి హరీష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, కోలా రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు

వర్షానికి తడిసిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ
ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితి.
కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు 40 రోజులు అయిందని , ఇంకొక రైతు 30 రోజులైంది వడ్లు ప్రభుత్వం కొనడం లేదు అని చెబుతున్నారు. ఈటీవీల కురిసిన భారీ వర్షానికి వడ్లు తడిసి మొలకలు వచ్చాయి
చాలామంది రైతులు దాదాపు 100, 200 రూపాయలు తక్కువ ధరకు మధ్య దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఆరు గ్యారంటీల్లో భాగంగా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులను మోసం చేసింది.
మేము 100 రోజుల్లో రైతు భరోసా 7,500 పెంచుతామని చెప్పి మోసం చేసిర్రు.
100 రోజుల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామని అందరూ మోసం చేసిండ్రు. 100 రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15000 ఇస్తామని మోసం చేసిండ్రు.రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు.
వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం.. పోయిన యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే, కాంగ్రెస్ 30 మెట్రిక్ టన్నుల కూడా కొనలేదు. రైతులు బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది.
బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు 500 బోనస్ ఇస్తామని ఇయ్యాల సన్నాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సిఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క సంతకాలు పెట్టారు.
మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతులు పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమయిందంటే చేతులు ఎత్తేస్తున్నారు.
రైతులు పండించేది రూపాయికి 90 పైసలు దొడ్డు రకం. సన్నాలకు బోనస్ ఇస్తామ నడం రైతులని దగా చేయడం, రైతుల గుండెల మీద తనడం తప్ప ఇంకోటి కాదు.
బాధగలిగే విషయం ఏమిటంటే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి అని కొంతమంది మొరుగుతున్నారు అని అంటున్నాడు.
ఇచ్చిన హామీ అమలు చేయమంటే రైతులను పట్టుకొని మొరుగుతున్నారు అంటున్నారు అంటే రైతులను కుక్కలు అంటున్నారా.
రైతుబంధు అదిగితే రైతులను చెప్పుతో కొట్టాలని ఒక మంత్రి అంటున్నాడు .వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు అంటే రైతులను కుక్కలు అని ఇంకొక మంత్రి అంటూనాడు.
రైతులను అవమానించేందుకేనా మిమ్మల్ని గెలిపించింది. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అని రైతులు చెపుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో అయిపోగానే సన్నవడ్లకే బోనస్ అని రైతులను మోసం చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ కల్లేపల్లి శోభ రఘుపతిరావు బుర్ర రమేష్ కటకం జనార్ధన్ పూర్ణచందర్ బుర్ర రాజు ప్రవీణ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు

రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డివైఎస్డిఓ

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

దుగ్గొండి మండల కేంద్రంలోని
శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ జరుగుచున్న వేసవి రెజ్లింగ్ శిక్షణ శిబిరాన్ని వరంగల్ (డివైఎస్డిఓ) జిల్లా యూత్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అధికారి టీవీఎల్ సత్యవాణి శిక్షణ శిబిరాన్ని గురువారం సందర్శించారు.
తెలంగాణ స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ డైరెక్టర్ అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ అండ్ చైర్పర్సన్, డివైఎస్డిఓ అనుమతులతో శ్రీ అదర్శవాణి పాఠశాలలో జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరంలో ఉన్న క్రీడాకారులతో అధికారిని ముచ్చటించారు. క్రీడాకారులు సమయాన్ని వృధా చేయకూడదని వేసవిలో తన శిక్షణను కొనసాగించాలని తెలిపారు.ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకుసాగాలని క్రీడాకారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, ప్రిన్సిపల్స్ సుధాకర్ రవి, ఏవో రమేష్, కోచ్ ఇటికాల దేవేందర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

రామాంజపురం ఎరుకల నాంచారమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

వెంకటాపూర్ మండలం లోని రామాంజపురం గ్రామ శివారులో కొలువుదీరిన శ్రీ ఎరుకల నాంచారమ్మ తల్లిని గురువారం సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకున్నారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎరుకల కులస్తులు ఎమ్మెల్యేకు నాంచరమ్మ తల్లి బుట్టను అందించి ఘన స్వాగతం పలికారు అనంతరం పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ నాంచరమ్మ ఎరుకల కులస్తుల ఆరాధ్యదైవమని ప్రతీ సంవత్సరం మే నెలలో వైశాఖ పౌర్ణమి రోజున జాతర జరుపుకోవడం జరుగుతుందన్నారు నూతన ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు వచ్చే రోడ్డు ను తారు రోడ్డును చేయాలని ఎమ్మెల్యే గారిని ఎరుకల కుల పెద్దలు కోరగా మంత్రి సీతక్క గారితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుని ఆలయ అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య డైరెక్టర్ కేతిరి సుభాష్ డైరెక్టర్లు కోనేటి రాజు మనుపాటి రమేష్, అంగిడి ప్రశాంత్ కేతిరి రాజేందర్ కుర్ర రవి తదితరులు ఉన్నారు

నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్ నమోదు .జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

నకిలీ విత్తనాలు విక్రయ దారులపై కఠినంగా వ్యవహరించాలి

టాస్క్ ఫోర్స్ టీములు నిరంతరం తనిఖీలు చేపట్టాలి

భూపాలపల్లి నేటిధాత్రి

నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశపు హాలులో వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఫెర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో నకిలీ విత్తనాలు నియంత్రణ చర్యలపయో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ రైతులకు డీలర్లు, ఫెర్టి లైజర్ షాపు యజమానులు నకిలి, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయించొద్దని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లైతే అలాంటి వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిభంధనల ప్రకారం నడుచుకోవాలని రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని తెలిపారు. మార్కెట్ లోకి నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయాలు జరుగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రోజు జిల్లాలో ఏదో ఒక చోట ఫెర్టి లైజర్ షాపులలో వ్యవసాయ శాక అధికారులు తనిఖీలు చేపట్టి నివేదిక అందజేయాలని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టాస్క్ పోర్స్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నకిలి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని కృత్రిమంగా విత్తనాల కొరత సృస్టించే అవకాశం ఉందని అక్రమంగా విత్తనాలు, ఎరువులు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులను రద్ధు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు రైతులకు రశీదు తప్పకుండ ఇవ్వాలని రశీదులో రైతు పేరు, ఏ కంపనీ విత్తనాలు అనే విషయాలు తప్పకుండ రాయాలని, రైతు నుండి సంతకం తీసుకోవాలని, పత్తి విత్తనాలు స్టాక్ షాపులోకి రాగానే ఇన్వాయిస్ బిల్లులను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు పంపించాలని రిజిస్టర్ నిర్వహించాలని అన్నారు. ఓ.ఎల్.ఏం.ఎస్ పోర్టల్ లో విత్తనాల వివరాలు ప్రతి నెల 5వ తేదీన స్టాక్ అమ్మకం వివరాలను నమోదు చేయాలని తెలిపారు. గత సంవత్సరం విత్తనాలు, పురుగు మందులు ఏవైన నిల్వలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జిల్లాఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. మన జిల్లా మహా రాష్ట్ర, ఛత్తీష్ ఘడ్ సరిహద్దు జిల్లా కావడంతో కొంత మంది దళారులు ముఠాలుగా ఏర్పడి రైతులకు తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని, అలాంటి వ్యక్తుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అలాంటి వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని తెలిపారు. సరియైన ప్యాకింగ్ లేకుండా రకరకాల పేర్ల తో ఉన్న విత్తనాలు రైతులు కొనొద్దని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, వ్యవసాయ అధికారులు, ఫెర్టి లైజర్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య తీవ్రమైన గాయాలతో అపస్మార్క స్థితిలో చికిత్స పొందుతుంది.
కారుణ్య మొదటి సంవత్సరం బిఎస్సి నర్సింగ్ విద్యను ఈ కళాశాలలో అభ్యసిస్తుంది.
ఈరోజు తెల్లవారుజామున తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.
కళాశాల వసతి గృహంలో ఈ సంఘటన జరగటం వలన అనుమానాలు కలుగుతున్నాయి.
కళాశాలకు కళాశాల వసతి గృహానికి సరైన రక్షణ చర్యలు లేవు.
ప్రహరి గోడలు కూడా లేవు.
మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య పై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారా?
లేకపోతే బయట వ్యక్తులు హత్య ప్రయత్నం చేశారా?
ర్యాగింగ్ విషయంలో సీనియర్ విద్యార్థులు హత్యా ప్రయత్నం చేశారా?
కారుణ్య 1 నుండి ఇంటర్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలలో చదువుకున్నది.
పదవ తరగతిలో 10/10 మార్కులతో ఉత్తీర్ణత.
ఇంటర్లో 901 మార్కులతో ఉత్తీర్ణత.
బాగా చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటుందా?
ఈ మిస్టరీని పోలీసులే చేదించాలి.

గంజాయి పట్టుకున్న భూపాలపల్లి పోలీసులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాల్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైన్ ఇంక్లైన్ ఆర్చి వద్ద నమ్మదగిన సమాచారం మేరకు సీఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేయుచుండగా నిగ్గుల రాజు శనిగరం గ్రామం కమలాపురం మండల అను వ్యక్తి టీఎస్ 24C 2236 గ్లామర్ బండి పై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అతని పట్టుకొని విచారించగా అతడి వద్ద 1 కేజీ 100 గ్రాముల ఎండు గంజాయి లభించగా అతడు విచారణలో భాగంగా కుమ్మరి నాగరాజు అలియాస్ రాజు నడికుడా గ్రామం అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పగా ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన పోలీస్ సిబ్బంది ఈ కేసు లో పూర్తి విచారణ చేస్తున్నామని సీఐ. డీ.నరేష్ కుమార్ తెలియజేశారు

వర్ష బీభత్సానికి విరిగిపడ్డ చెట్టు…. రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలు

ఈ రోడ్డును కాపాడేదెవరు

శాయపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని కుమ్మరి వాడనుండి కొత్తగట్టు సింగారం నుండి వెళ్లే దారి చెట్ల పొదలతో మూసుకుపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు ప్రక్కల ఉండే చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి దీంతో రోడ్డు దారి కనిపించకుండా పోయింది. రోడ్డుకి ఇరువైపులా పొదలు పెరిగి దారి కనిపించని స్థితికి చేరింది. అటువైపు వెళుతున్న వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలను తీసివేయాలని. రైతులు వాహనదారులు కోరుతున్నారు.

error: Content is protected !!
Exit mobile version