వధువు వివాహానికి పుస్తె మట్టెలు అందజేత

రామాయంపేట(మెదక్)నేటిధాత్రి

రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామానికి చెందిన కోమ్మగళ్ళ సత్తమ్మ – ప్రభాకర్ దంపతుల కూతురు వసంత వివాహం శుక్రవారం గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు వేంకు గారి రాజిరెడ్డి పుస్తె మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద వధువు వివాహాలకు పుస్తేమట్టేలు అందజేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పెళ్లికూతురు తల్లిదండ్రులు వెంకు గారి రాజిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్జల రామచంద్ర రెడ్డి , సిద్ధ రాములు, మాజీ ఎంపిటిసి స్వామి తదితరులు పాల్గొన్నారు.

యువత ఆలోచనల్లో మార్పు రావాలి

బిజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ..

షాద్ నగర్ అరవింద్ యాదవ్ మృతి పట్ల “డీకే అరుణ” దిగ్భ్రాంతి..

ఆస్ట్రేలియా నుండి అరవింద్ భౌతిక కాయాన్ని రప్పించేందుకు చర్యలు..

మృతుడి కుటుంబ సభ్యులకు డీకే అరుణ ఫోన్ ద్వారా పరామర్శ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

కుటుంబ సమస్యలు.. చదువులో ఒత్తిడి.. ప్రేమ వ్యవహారాలు.. కారణాలేవైనా నిత్యం యువతీ యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని యువత ఆలోచనలు సమూలమైన మార్పులు రావాల్సి ఉందని మారుతున్న జీవన విధానాల్లో
యువతకు ఓర్పు సహనం ఆలోచన గుణం మెండుగా ఉండాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన బిజెపి మాజీ నేత కీర్తిశేషులు అరటి కృష్ణ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీలో అనుమానాస్పద నీతిలో సముద్రంలో మృతి చెందిన వ్యవహారంపై ఆమె స్పందించారు. ఈ సందర్భంగా మృతుడు అరటి అరవింద్ కుటుంబ సభ్యుడూ వరసకు బాబాయ్ అయిన అరటి యాదయ్యతో ఆమె ఫోన్లో మాట్లాడారు. మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా బిజెపి పార్టీ అండగా ఉంటుందని ఆమె తెలియజేశారు.భౌతిక కాయాన్ని రప్పించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులకు భరోసాను ఇచ్చారు.
ఈ సందర్భంగా డీకే అరుణ స్ధానిక మీడియా ప్రతినిధితో ఫోన్లో మాట్లాడారు.
అరవింద్ యాదవ్ కుటుంబ నేపథ్యాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న డీకే అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరటి కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఏకైక కుమారుడు కూడా ఇలా మృత్యువాత బాధాకరమని ఆమె పేర్కొన్నారు. సిడ్నీలో అరవింద్ భౌతిక కాయని భారత్ కు రప్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సంప్రదింపులు జరిగినట్లు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం లేఖ రాశారని ఆయన కూడా స్పందించి శవాన్ని రప్పించేందుకు పూర్తి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఆస్ట్రేలియాలో అక్కడ పోలీస్ యంత్రాంగం కేసుకు సంబంధించిన పరిశోధన చేస్తున్నారని అందుకే కొంత ఆలస్యం కావచ్చు అని డీకే అరుణ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అరవింద్ మృతి ఎంతో విషాదమని ఆమె పేర్కొన్నారు. యువతీ యువకులు క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె సూచించారు. జీవితంలో కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా ధైర్యంగా బ్రతకడం నేర్చుకోవాలని ఆమె సూచించారు. చిన్న విషయాలను కూడా పెద్దదిగా చూస్తూ బతకలేము అన్న ఆలోచనకు యువత రావడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. దేశంలో ప్రతి గంటకు ఒకరు లేదా ఇద్దరు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వీరిలో మెజార్టీ చదువుకున్న వారే ఉంటున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.వివిధ రకాల కారణాలతో తీవ్ర ఒత్తిడికి గురై.. డిప్రెషన్‌లోకి వెళ్లిన కొందరు కుంగుబాటు కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డవారు ఎందరో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
అలాంటి వారికీ డిప్రెషన్ నుంచి బయటపడి.. మళ్లీ నిత్య జీవన విధానంపై ధ్యాస పెట్టేందుకు పెద్దలుకుటుంబ సభ్యులు ‘సహాయం కౌన్సిలింగ్’ కృషీ చేస్తోందని ఆమె అన్నారు. యువతీ యువకులు తిరిగి సాధారణ జీవితం కొనసాగిలా కుటుంబ సభ్యుల గుర్తించాలని సూచించారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి.

# ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా కలెక్టర్
ఆకస్మిక సందర్శన..

నర్సంపేట,నేటిధాత్రి :

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి, సుందరికరణ పనులు జూన్ 10వ తేదీలోగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం నర్సంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాణ్యతతో నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కొరకు నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలోని మహేశ్వరి పరమేశ్వరి సహకార పరపతి సంఘంచే తయారు చేస్తున్న ఏకరూప దుస్తుల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి దుస్తులను పరిశీలించారు.ఈ సందర్భంగా టీఎల్ ఎఫ్ లు నిర్వహిస్తున్న రికార్డులను , సైజులవారిగా దుస్తుల ఆర్డర్ తీసుకున్న, ఏకరూప దుస్తులను తయారుచేసి అందించిన వివరాలను పరిశీలించారు.ఇప్పటికే మహిళ సంఘాల ద్వారా 50 శాతం ఏకరూప దుస్తులను కుట్టించి సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందించడం జరిగిందని జూన్ 10వ తేదీలోగా మొత్తం ఏకరుప దుస్తులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ట్రైనీ ఐఎఫ్ఎస్ రేవంత్ చంద్ర, డిఆర్డిఓ కౌసల్య దేవి, మండలం నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

రైతులువిత్తనాలకొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మండల రైతులకు ఏవో సూచన.
మహా ముత్తారం నేటి ధాత్రి.

మండలంలోని రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ఏవో సూచనలు చేశారు లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని గ్రామాల్లో తక్కువ ధరకు లేదా ఎక్కువ ధరకు లైసెన్స్ లేకుండా అమ్మిన లేబుల్ లేని ప్యాకెట్స్ లో సంచుల్లో లేదా లూస్ విత్తనాలు అమ్మిన వారి నుండి ఎట్టి పరిస్థితులను కొనుగోలు చేయకూడదని తెలియజేశారు . అనుమతి లేనివిత్తనాలు అమ్మిన వారి వివరాలు వ్యవసాయ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాలు విత్తన కంపెనీ రకం బ్యాచ్ నెంబర్ లా ట్ నెంబర్ ,ధరతో వివరాలు కలిగి ఉన్న రసీదు తీసుకోవాలని మరియు విత్తనాల ప్యాకెట్ మీద తయారుతేది గడువు తేదీ జి ఈ ఎ సి నెంబర్లనిసరిచూసుకోవాలని సరిచూసుకొని కొనుగోలు చేయాలని తెలియజేశారు మరియు కవరు పంట కాలంపూర్తి అయ్యేవరకు భద్రపరచుకోవాలని తెలియజేశారు బిజీ1 బిజీ టు పత్తి విత్తనాలు మాత్రమే సాగు చేయాలని బీజీ3పత్తి విత్తనాలు సాగుకు అనుమతి లేదని కావున ఎవరు సాగు చేయవద్దని బిజీ 3 పత్తి విత్తనాలు అమ్మిన మరియు కొన్న వారు శిక్షార్హులు అని తెలియజేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి

మచ్చ సుమన్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు

పరకాల నేటిధాత్రి
వరంగల్- ఖమ్మం నల్గొండ- పట్టభద్రుల తీన్మార్ మల్లన్నకు ఓటు వేసిగెలిపించాలని పరకాల పట్టణ యూత్ కాంగ్రెస్ మచ్చ సుమన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పరకాల పట్టణంలోని కోర్టు ఆవరణంలోని న్యాయవాదులను లక్కం శంకర్,అకినపల్లి రవికుమార్, దేవులపల్లి సాయికుమార్ లను తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్బంగా మచ్చ సుమన్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కేసీఆర్ ప్రభుత్వాన్ని తీన్మార్ మల్లన్నకు జవాబు తీసుకువచ్చే అవకాశం ఇవ్వండి ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోకుండా ప్రశ్నకు జవాబు తీసుకువచ్చే అత్త ఉన్న వ్యక్తి కాబట్టి పట్టభద్రులు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్క కిరణ్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి 10 సంవత్సరాలు కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు దానికి టిఆర్ఎస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న మీద 64 కేసులు రెండుసార్లు 120 రోజుల జైలు జీవితం గడిపేలా చేశాడు కెసిఆర్ మల్లన్న కూతురు వికలాంగురాలు ఆ పాప మల్లన్న లేకుండా ఒక్కరోజు కూడా నిద్రపోదు అలాంటి సందర్భంలో కూడా మల్లన్న వెనుకడుగు వేయకుండా కేసులకు భయపడకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేశాడు అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ చందుపట్ల రాజిరెడ్డి,యూత్ కాంగ్రెస్ పరకాల పట్టణప్రధాన కార్యదర్శి బాసాని సుమన్, కొడపాక సాయి,కత్తి తిరుపతి, వినయ్,నరేష్,కృష్ణ కాంత్,శ్రీరామ్,రాజు,రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేయాలి.

# వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య.
# నర్సంపేట డివిజన్ లో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన.

నర్సంపేట,నేటిధాత్రి :
యాసంగి వరి పంటల ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నర్సంపేట డివిజన్ లోని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ , ఖానాపూర్ ఐనయ్యపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లలో పిఏసీఎస్, ఎఫ్పిఓ, ఐకెపిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, కాంటా లో ఆలస్యం జరగొద్దని, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక రైతులతో, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో మాట్లాడి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు మార్కెట్ యార్డ్ కు 50 శాతం ధాన్యం వచ్చిందని,వాటిని సేకరించి మిల్లులకు పంపించడం జరిగిందని కలెక్టర్ అన్నారు.వర్షం కురిసినను రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాయిల్డ్ మెష్ కు ట్యాగ్ చేస్తూ 100 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఎఫ్ఎస్ రేవంత్ చంద్ర, డిఆర్డిఓ కౌసల్యాదేవి,జిల్లా పౌర సరఫరాల అధికారి శివప్రసాద్ రెడ్డి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ సంధ్యారాణి,జిల్లా కోఆపరేటివ్ అధికారి సంజీవరెడ్డి,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్నను భారీమెజారిటీ తో గెలిపించాలి

పరకాల నేటిధాత్రి
కాంగ్రెస్ పార్టీ బలపరచిన వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో పరకాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి వొడితల ప్రణవ్ నేత్రుత్వంలో, పరకాల పట్టణంలోని 46,47,53 మరియు 59 పోలింగ్ బూతుల పరిధిలోని పట్టభద్రులను కలిసి,బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండవ వరుసలోని తీన్మార్ మల్లన్న ఎదురుగా ఉన్న బాక్స్ లో మొదటి(1)ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రం చూపిస్తూ ప్రచారం నిర్వహించిన పట్టణ ఇంచార్జి మాదన్నపేట సర్పంచ్ గుండపు చరణ్ పటేల్,డాక్టర్ మడికొండ శ్రీను,ఒకటో వార్డ్ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు పావుశెట్టి వెంకన్న,రంజాన్ అలీ,కొక్కిరాల స్వాతి తిరుపతి రావు, ఎండీ అలీ,మచ్చ సుమన్,గోవిందు సురేష్, రవీందర్,పసుల శ్రీను, చందుపట్ల రాజి రెడ్డి,దిలీప్, కందుకూరి విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ కమిటీ భాద్యులు, మహిళలు,పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగుల పక్షాన ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించుకుందాం

డోర్నకల్ నియోజకవర్గo నుండి భారీ మెజారిటీ ఇద్దం.

మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్.

కొట్లాడు తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు

కాంగ్రెస్ మాయ హామీలతో రైతుల హరిగోశ

మండలి లో మన తరుపు ప్రశ్నించే గొంతు మన రాకేష్ రెడ్డి

మాజీ మంత్రి,సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్ రావు.

మరిపెడ నేటి దాత్రి.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా పట్టా భద్రుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ఆరు నెలల కాంగ్రెస్ పార్టీని చూసి..వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటున్న తెలంగాణ ప్రజలు అంటున్నారు అని అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒడ్లు కొనే చెతకావడం లేదు, కళ్యాణ లక్ష్మి దిక్కు లేదు,కాంగ్రెస్ వచ్చింది, దొంగ రాత్రి కరెంట్ వస్తుంది.కే సి ఆర్ ఉన్నన్ని రోజులు నీళ్ళు బండు పెట్టు అనే రోజులు నుండి అయిదు నెలల్లో కాంగ్రెస్ పాలనలో ప్రజలు నీళ్ళు కావాలి అనే రోజులు వచ్చాయి అన్నారు,
కాంగ్రెస్ పుణ్యమా అని బండ్ పేపర్ ఇజ్జాతీ పోతుంది అన్నారు, 2500 మహిళలకు రాకపాయే..బోనస్ అంతా బోగస్ అయ్యింది అన్నారు,రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య,ఉద్యోగులను మోసం చేస్తుంది నిరుద్యోగ భృతి జాడే లేదు అన్నారు, రేవంత్ ప్రభుత్వం లో ఆయితే తిట్లు..లేక పోతే ఓట్లు అన్నారు, ప్రజల కు ఇచ్చిన హామీలు నెరవృష్టే రాజీనామా చేస్తా..అని సవాల్ విసిరితే తొకముడిచిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అన్నారు,
నిరుద్యోగ భృతి ఎగ్గోడితే ప్రశ్నించే గొంతు ఎక్కడ పోయింది అన్నారు,జిల్లాల ,మండలాలు తీస్తా అని రేవంత్ మాట్లాడుతుండూ..మహబూబాబాద్ జిల్లా వచ్చింది కాబట్టే అన్ని సౌకర్యాలు వచ్చాయి అన్నారు, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించి మన కోర్కెలు నెరవేరేలా చేస్తాం అన్నారు, గిరిజన మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఎస్ టీ లకు రిజర్వేషన్ ను పోగొట్టే కుట్ర చేస్తున్నారు,మనం మేల్కొనక పోతే 10శాతం రిజర్వేషన్ పోగొట్టే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది అన్నారు, తెలంగాణ సమాజం తరుపున కొట్లాడే భాధ్యత మాది.. ప్రశ్నించే గొంతు ను గెలిపించండి,రేవంత్ ప్రభుత్వం ఒక్క నోటిఫికషన్ ఇవ్వలేదు..30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబ్ద్దలు చెప్తున్నారు అన్నారు,పదేండ్ల బిజెపి పాలనలో ప్రజలకు అన్ని కష్టాలే..ఆడాని అంబానీ లు మాత్రం ప్రపంచ కుబేరులు అయ్యింద్రు అన్నారు, దేవుడు అందరి వాడు..ఆయన మీద కూడా బిజెపి వాళ్ళు రాజకీయం చేస్తుంద్రు, తెలంగాణ సమాజం తో బీ ఆర్ ఎస్ కి పేగు బంధం అన్నారు,మానుకోటలో ఆంధ్ర పాలకుల అరాచకాలకు ఎదురుగా నిలబడ్డది మనం మన బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, హుజూరబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ కుమారి బిందు, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మరిపెడ మున్సిపల్ చైర్మన్ సిందూర, మరిపెడ ఎంపిపి అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారద రవీందర్, మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న,ఒడిసిన్ ఎస్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, డోర్నకల్ నియోజకవర్గo లో ని ఏడు మండల ల పట్టా భద్రులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రేగొండలో కరెంటు సబ్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

కొత్తపల్లిగోరి రేగొండ మండలాలు
విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పనిచేస్తే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం విద్యుత్ అందిస్తుందని, విద్యుత్ అధికారులు కారణాలు లేకుండా గంటల కొద్ది కరెంట్ కట్ చేయడంపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు కొత్తపల్లిగోరి, రేగొండ మండల కేంద్రాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్లను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి విజిట్ చేశారు. అనంతరం సబ్ స్టేషన్లో ఉన్న లాగ్ బుక్స్ ను తనిఖీ చేయగా, రేగొండ సబ్ స్టేషన్ లో లాక్ బుక్ లో మే 22వ తేదీ రోజున వైట్నర్ పెట్టి దిద్దినట్లు ఉండగా, ఎందుకిలా చేశారని ఏఈ, ఆపరేటర్లను అడగ్గా వారు సరైన సమాధానం చెప్పలేదు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ… విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా పనిచేస్తే ఊరుకునేది లేదన్నారు. ఒకవైపు ప్రభుత్వం నిరంతర విద్యుత్ ను అందిస్తుంటే గ్రామాలకు సమాచారంలేకుండా గంటల తరబడి విద్యుత్ నిలుపుదల ఏంటని ఏఈ కనకయ్య ను ఎమ్మెల్యే ప్రశ్నించగా, తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీంతో, ఏ ఈ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనరావుపేట ఫీడర్లో సుమారు 11 గంటల పాటు కరెంట్ సరఫరా నిలుపుదల చేయడంతో లైన్ మెన్, ఆపరేటర్ పై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. విద్యుత్ అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అన్నారు. సరిగా పని చేయని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు

తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం

భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 30 వ వార్డులలో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మారు మల్లన్న గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితే ప్రకాష్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవ్ క్యాతరాజ్ సాంబమూర్తి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టబద్రులను కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది అవునా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవ్ క్యాతరాజు సాంబమూర్తి జిల్లా కోశాధికారి వెన్నపురెడ్డి మహేష్ రెడ్డి డివిజన్ కమిటీ అధ్యక్షుడు చీర్ల రాజేష్ రెడ్డి ఐ ఎన్ టి యు నాయకులు బొడ్డు అశోక్ తదితరులు పాల్గొన్నారు

దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించడం జరిగినది

భద్రాచలం నేటి ధాత్రి

ఈ యొక్క కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు వారిని ఉద్దేశించి లంక అబ్బులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పట్టభద్రులను గుర్తించి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్న గారికి యొక్క ఓటు వేసే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరినారు ఈ యొక్క కార్యక్రమానికి నాయకులు కుంజ శ్రీనివాసరావు తెల్ల0 హరికృష్ణ దర్శి సాంబశివరావు కిసాన్ కేతు ఉపాధ్యక్షులు జిల్లా మట్ట శివాజీ సర్యం వీర్రాజు అన్నం నారాయణమూర్తి బజ్జీల శ్రీను జిల్లా శేఖర్ తోట మల్ల సంగీతరావు ఎలక వెంకటరమణారెడ్డి సేవాదళ్ డివిజన్ రాఘవ రాజు లంక శివ ఎన్ ఎస్ యు ఐ కనితి సమ్మయ్య మున్నా జిలకరి వెంకటేశ్వరరావు వెంకయ్య చౌదరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

ప్రేమేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

సుభాష్ కాలనీలో పట్టభద్రులను కలిసి ఎమ్మెల్సి ఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని దొంగల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మొర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ మహాశయులు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అధికారం ఇస్తే పార్టీలు మారి ఓటర్ మహాశయుల నిర్ణయాన్ని గౌరవించలేదని ఆగ్రహంతో ఉన్నారని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని అందుకే ఆ పార్టీలను ప్రజల అసహ్యించుకుంటున్నారని అన్నారు ఆ పార్టీలకు అధికారమే ముఖ్యం కానీ ప్రజల మనోభావాలు అవసరం లేదని అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేయడం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కనుమరుగు కాక తప్పదని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల సంతోష్ తాండ్ర హరీష్ సి హెచ్ అర్జున్ జగజంపుల రమేష్ సిల్వర్ కార్తిక్ రాచకట్ల సందీప యాంశని సతీష్ రవి శివ ఫ్రేమ్ తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలిపించండి.

సీపీఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నీ గెలిపించాలని కోరారు. సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తీన్మార్ మల్లన్న కు వుంటుందని అన్నారు. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, మీడియా రంగంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని అన్నారు. నిరంతరం ప్రజల సమస్యల పైన మాట్లాడే కొట్లాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని అన్నారు. పట్టభద్రులందరూ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలియజేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి బిఆర్ఎస్ పార్టీలు రెండు నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. నిరుద్యోగం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామ్ చందర్, కోరిమీ సుగుణ, నేరెళ్ల జోసెఫ్,పీక రవికాంత్, దొంగల సురేష్, బౌత్ కమలాకర్, సుమలత, సుజాత, వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మహేశ్వర్ రెడ్డి చేసిన తప్పుడు వ్యాఖ్యల పై ఫైర్ అయిన సూర్యాపేట జిల్లా ఓబిసి చైర్మన్ శెట్టి రామచంద్రరావు

నేటిధాత్రి. హుజూర్ నగర్

యుద్ధ వీరుడు, అభివృద్ధి ప్రధాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన తప్పుడు వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని సూర్యాపేట జిల్లా ఓబిసి డిపార్ట్మెంట్ చైర్మన్ శెట్టి రామచంద్రరావు డిమాండ్ చేసారు. శుక్రవారం అయన మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీ పరుడు, మరియు దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడిన అయనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే క్షమించబోము అని అన్నారు, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిపై చేసిన ఇలాంటి వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని అయన అభిప్రాయపడ్డారు.

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చోక్కంపేట్ గ్రామపంచాయతీకి చెందిన మంచాల లక్ష్మయ్య(74) అనే వృద్ధుడు అనారోగ్యంతో మరణించారు.
మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్స్ మంచాల నర్సింహులు, బత్తుల యాదయ్య గౌడ్, బోయ రాజు, అభిమన్యు యువసేన నాయకులు మంచాల మల్లేష్, శాంతయ్య, మంచాల రాజు, నత్తి శంకర్, శేఖర్, సురేష్, శ్రీకాంత్, నర్సింహ, రాంచంద్రయ్య, శంకరయ్య, లక్ష్మయ్య మరియు గ్రామస్తులు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తునికాకు సేకరణకు వెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి గాయాలైన తునికాకు కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి

సిపిఐ (ఎం-ఎల్ )న్యూ డెమోక్రసీ నాయకులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
తునికాకు సేకరణలో భాగంగా గురువారం చీమల గూడెం గ్రామస్తులు తునికాకు సేకరించి వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి పదిమంది కి గాయాలయ్యాయని వారికి ప్రభుత్వం, గుత్తేదారులు మెరుగైన వైద్యం అందించాలని సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ మండల నాయకులు పాయం ఎల్లన్న, ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) మోకాళ్ళ ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తునికాకు సేకరణ సందర్భంగా ట్రాక్టర్ బోల్తా పడి గాయాలు పాలై న తునికాకు కార్మికులకు గుత్తేదారులు, ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని కోరారు.
మునుపటి రోజుల్లో కూడా చీమల గూడెం గ్రామంలో తునికాకు సేకరణ సందర్భంలో అడవి జంతువులైన ఎలుగుబంట్లు, తదితర జంతువుల దాడికి అనేక మంది గురయ్యారని వారికి ప్రాథమిక వైద్యం తప్ప ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదని తునికి ఆకు సేకరణకు వెళ్లి గాయాలు పాలైన తునికకు కార్మికులకు ఒక్కొక్కరికిప్రభుత్వం లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదు

రాగుల రాములుకు సంబంధించిన బాధితులు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలి.

– సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.
సిరిసిల్ల, మే – 24(నేటి ధాత్రి):
అవసరానికి డబ్బులు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకొని, అదే ఇంటిని బ్యాంకులో పెట్టి 20 లక్షల రూపాయల రుణం తీసుకొని,ఇచ్చిన డబ్బులు కట్టిన తర్వాత ఇంటిని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిన రాగుల రాములు పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు డిఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…
సిరిసిల్ల పట్టణ పరిధిలోని సంజీవయ్య నగర్ కి చెందిన రాకం పెద్ద బాబు అనే వ్యక్తి తన అవసరం నిమిత్తం సిరిసిల్ల పట్టణానికి చెందిన రాగుల రాములు అనే వ్యక్తిని 3,00,000/- లక్షల రూపాయలు అడుగగా, రాగుల రాములు తన పేరు మీద రాకం పెద్ద బాబు ఇంటిని రిజిస్ట్రేషన్ చేపిస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పగా అందుకు ఒప్పుకొని రాగుల రాములు పేరు మీద పెద్ద బాబు ఇంటిని 2017 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేపించి 3,00,000 లక్షల రూపాయలు తీసుకొన్న తర్వాత అట్టి ఇంటిని రాగుల రాములు యాక్సిస్ బ్యాంకు నందు అట్టి ఇంటి పేపర్స్ పెట్టి 20 లక్షల రూపాయలు తీసుకున్నాడని రాకం పెద్ద బాబు తెలిసి రాగుల రాములును అడుగగా ఏమి చేసుకుంటావో చేసుకోమని, ఇచ్చిన డబ్బులకి మిత్తీ కట్టమనగా పెద్ద బాబు మిత్తి కట్టిన తర్వాత 47 రోజులకు ఇంటిని పెద్ద బాబు పేరు మిద రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పి కాలం గడుపుతూ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసినాడని రాకం పెద్ద బాబు పిర్యాదు మేరకు రాగుల రాములు పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో చిటింగ్ కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు.

రాగులు రాములు కి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయవలసిందిగా డిఎస్పీ తెలిపారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ జన్మదిన వేడుకలు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ జన్మ దిన వేడుకలు శుక్రవారం జడ్చర్ల కేంద్రంలోని అనిల్ కుమార్ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అభిమానులతో కలిసి కట్ చేశారు. ఉదయం వేద పండితులు ఆయుష్య హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి అనిల్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ కోళ్ల కృష్ణయ్య, కిష్టారం సింగిదాసు శ్రీనివాసులు, ఎస్ మహేష్, పి సుధాకర్,కార్యకర్తలు, నాయకులు నివాసానికి భారీగా తరలివచి, వివిధ పార్టీల నేతలు పార్టీలకు అతీతంగామాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించిన ఎండి.ఇర్ఫాన్

గోవా ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన ఎండి ఇర్ఫాన్

నేటిధాత్రి, వరంగల్ తూర్పు

యూనివర్సల్ 369 షోటో కాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా గోవా ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ కరాటే పోటీలు రెండు రోజులపాటు ఘనంగా అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా సినీ హీరో సుమన్ తల్వార్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ పోటీలలో నేపాల్, కువైట్, సౌత్ ఆఫ్రికా, జపాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ,కెనడా, ఇరాక్, ఫ్రాన్స్, ఇండోనేషియా, యుగాండా, యూఏఈ తదితర సుమారు 16దేశాల నుండి 3,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో వరంగల్ బిఎంఆర్ అకాడమీ విద్యార్థి “ఎండి ఇర్ఫాన్” కుమిటి విభాగంలో బంగారు పతకం, వ్యక్తిగత కరటా పోటీలో సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు. గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించిన ఇర్ఫాన్ కు అకాడమీ ప్రెసిడెంట్ బండారి సంతోష్, కార్యదర్శి కర్ర వెంకటేష్, కుంగ్ ఫు మార్షల్ ఆర్ట్స్ ఫౌండర్ గ్రాండ్ మాస్టర్ సదానందం, గోల్డెన్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్ సుజాత ప్రిన్సిపాల్ మాధవి, మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.

మృతుడి కుటుంబానికి గ్రామస్తుల చేయూత

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. మృతుడిది నిరుపేద కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలు ఉండడంతో చలించిపోయిన గ్రామస్తులు 18500 రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం ఆ కుటుంబానికి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి అనునిత్యం అండగా నిలిచే వివేకానంద సేవా సమితి సభ్యులు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఎన్నారైల చేయూత

ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లిన పొలాస అంజయ్య,పొలాస శంకర్ లు బంటు ఆనందం మృతి గురించి తెలుసుకొని 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వారికి దాతలు సహకారం అందజేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మందాల అబ్రహం, గొర్రె నందు, మాదం బాబు, పాటి సుధాకర్, లోకోజు సతీష్, కొడగంటి గంగాధర్ , పొలాస సంతోష్, మాదాడి కరుణాకర్ రావు, గొంటి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version