వర్షానికి తడిసిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం కమలాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన్ చారి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ
ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితి.
కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు 40 రోజులు అయిందని , ఇంకొక రైతు 30 రోజులైంది వడ్లు ప్రభుత్వం కొనడం లేదు అని చెబుతున్నారు. ఈటీవీల కురిసిన భారీ వర్షానికి వడ్లు తడిసి మొలకలు వచ్చాయి
చాలామంది రైతులు దాదాపు 100, 200 రూపాయలు తక్కువ ధరకు మధ్య దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఆరు గ్యారంటీల్లో భాగంగా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులను మోసం చేసింది.
మేము 100 రోజుల్లో రైతు భరోసా 7,500 పెంచుతామని చెప్పి మోసం చేసిర్రు.
100 రోజుల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామని అందరూ మోసం చేసిండ్రు. 100 రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15000 ఇస్తామని మోసం చేసిండ్రు.రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు.
వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం.. పోయిన యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే, కాంగ్రెస్ 30 మెట్రిక్ టన్నుల కూడా కొనలేదు. రైతులు బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది.
బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు 500 బోనస్ ఇస్తామని ఇయ్యాల సన్నాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సిఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క సంతకాలు పెట్టారు.
మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతులు పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమయిందంటే చేతులు ఎత్తేస్తున్నారు.
రైతులు పండించేది రూపాయికి 90 పైసలు దొడ్డు రకం. సన్నాలకు బోనస్ ఇస్తామ నడం రైతులని దగా చేయడం, రైతుల గుండెల మీద తనడం తప్ప ఇంకోటి కాదు.
బాధగలిగే విషయం ఏమిటంటే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి అని కొంతమంది మొరుగుతున్నారు అని అంటున్నాడు.
ఇచ్చిన హామీ అమలు చేయమంటే రైతులను పట్టుకొని మొరుగుతున్నారు అంటున్నారు అంటే రైతులను కుక్కలు అంటున్నారా.
రైతుబంధు అదిగితే రైతులను చెప్పుతో కొట్టాలని ఒక మంత్రి అంటున్నాడు .వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు అంటే రైతులను కుక్కలు అని ఇంకొక మంత్రి అంటూనాడు.
రైతులను అవమానించేందుకేనా మిమ్మల్ని గెలిపించింది. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అని రైతులు చెపుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో అయిపోగానే సన్నవడ్లకే బోనస్ అని రైతులను మోసం చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ కల్లేపల్లి శోభ రఘుపతిరావు బుర్ర రమేష్ కటకం జనార్ధన్ పూర్ణచందర్ బుర్ర రాజు ప్రవీణ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు