జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత”” వజ్జరాజు””
ములుగు మండలం : నేటి ధాత్రి
ఎవరు ఎక్కడ పోతే నాకేంటి? నేను నా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నామా? లేదా? ఒకరికి సేవ చేస్తే నాకేం వస్తది అంటూ వారు ప్రజలకు సేవ చేయకపోగా చేసే వారిని అవహేళన చేస్తూ చూసే ప్రబుద్ధులు ఉన్న నేటి సమాజంలో ములుగు మండల రాయిని గూడెం గ్రామానికి చెందిన ఒక ఆదివాసి గిరిజన యువకుడు పీసా మొబైలైజర్ , దళిత సాహిత్య అకాడమీ వారిచే దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ అంబేద్కర్ అవార్డు పొందిన వజ్జరాజు ప్రజా చైతన్య సమాజ నిస్వార్థ సేవలో ముందుకు దూసుకు వెళ్తున్నాడు . చిన్నతనం నుండి చురుకుగా ఉంటూ ఉన్నత విద్య నభ్యసించి ప్రజలను చైతన్యపరిచి సమాజసేవే పరమావధిగా తనతోపాటు తమ చుట్టుప్రక్కలగల లోతట్టు గ్రామాల గిరిజన, గిరిజనేతర, ఆదివాసి ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నాడనుటలో ఎలాంటి సందేహం లేదు మచ్చుకు కొన్ని ఉదా: ములుగు జిల్లాగా ప్రకటించక ముందు ములుగు మండల ఉమ్మడి కొత్తూరు గ్రామపంచాయతీకి చెందిన సుమారు 7 గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించి గ్రామాలా భివృద్ధి లక్ష్యంగా అప్పటి పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయటంలో సైతం కృషిచేసిన విషయం అందరికీ తెలిసినదే లోతట్టు గ్రామాలైన పంచోతుకులపల్లి, కన్నాయి గూడెం, యాపలగడ్డ, కొత్తూరు, రాయినిగూడెం, దుబ్బగూడం ,పెగడపల్లి, సర్వాపూర్, లాలాయ్ గూడెం, జగ్గన్న గూడెం, అంకన్నగూడెం ప్రాంతాల అభివృద్ధికి కృషిలో భాగంగా అన్ని గ్రామాల ప్రజల ను ఏకం చేసి ప్రస్తుత ఆదివాసి ములుగు జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ పంచాయతీరాజ్ మినిస్టర్ ( సీతక్క )దనసరి అనసూయను రాయిని గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభకు ఆహ్వానించి సన్మానించిన అనంతరం పైన పేర్కొనబడిన గ్రామాల పరిధిలోగల సమస్యల సాధనకు సీతక్కకు వినతి పత్రాలు అందింపజేసి సానుకూల స్పందన వచ్చేలా కృషి చేశాడు.
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 29 ప్రభుత్వ శాఖలలో గల ఖాళీలను ఆదివాసి గిరిజన నిరుద్యోగ విద్యావేత్తలతో పూరించాలని ఐటీడీఏ ఎదుట సామరస ధోరణితో పరిష్కార మార్గాలను వెతుకుటకు నిరసన దీక్ష తలపెట్టిన సందర్భం కూడా కలదు . ముఖ్యంగా ఆదివాసి ఏజెన్సీ గ్రామాల్లో యువతను చేరదీసి సమ సమాజ నిర్మాణంలో తమ వంతు కృషిలో భాగంగా తమతో పాటు తమ గ్రామాల అభివృద్ధికి ఎలా కృషి చేయాలో నేర్పుటలో సైతం ముందున్నారు. ప్రజల సంక్షేమం కొరకు ఇటీవల రాయిని గూడెం గ్రామంలో గల భూలక్ష్మి ( బొడ్రాయి ) గ్రామ దేవతను , పోచమ్మ తల్లి ని, ఆంజనేయస్వామి ల విగ్రహాలను వాస్తు ప్రకారం గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశంతో సుమారు వారం రోజులుగా ఆ దేవతలకు పూజ చేస్తూ వేద బ్రాహ్మణుల మధ్య, శాస్త్రోపేతంగా పునర్వ్యవస్థీకరించుటలో తనదైన పాత్ర అమోఘం, సమాజo లోని అస్పృశ్య , ఆకృత్యాలను తొలగించి న్యాయం, ధర్మం కాపాడుటలో కృషి చేస్తున్నందుకు గాను దళిత సాహిత్య అకాడమీ వారు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ అంబేడ్కర్ బిరుదునిచ్చి గౌరవంగా సత్కరించారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆయన సేవలను మరింత విస్తృత పరిచి రానున్న రోజులలో మరింత చేయాలని కోరుకుంటూ మామూలు పౌరుడు గానే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి” వజ్జ రాజు ” వచ్చి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నారు.