జిల్లాలో యథేచ్చగా కల్తీ కల్లు వ్యాపారం.

ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్న కల్తీ కల్లు మాఫీయా.

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖాధికారులు.

నియంత్రించడంలో నిమ్మకు నిరేత్తినట్లుగా వావ్యహారం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్, జడ్చర్ల, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, నవాబుపేట,కోయిల్ కొండా, హన్వాడ,దేవర కదిర, మండలాలలో కల్తీ కల్లు విక్రయాలు యథేచ్చగా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖాధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా కల్లు తయారుచేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. జిల్లాలో కల్తీకల్లు వ్యాపారం జోరందుకుంది మండలాలలోని ప్రతి గ్రామాలలో గల్లి గల్లి కి వేసవి షర్బత్ సెంటర్ల మాదిరి దుకాణాలు వెలుస్తున్నాయి.సహజ సిద్ధంగా ఈత,తాటి చెట్టు నుంచి వచ్చే కల్లును మాత్రమే అందించవలసి ఉంది కానీ? కొంతమంది వ్యక్తులు అక్రమంగా డబ్బుకు అలవాటు పడి ప్రమాదకరమైన మారకద్రవ్యాలు ఇతర రసాయనాలతో కాల కాలకూట విషం లాంటి కల్తీకల్లు తయారు చేసి సామాన్య కూలీలకు అంటగడుతున్నారు. ఇంత జరిగినా లోపాయికారీ ఒప్పందాలతో చూసి చూడనట్లు ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే తప్ప జిల్లా అధికారుల్లో కదలిక రావడం లేదు. రోజంతా కష్టపడి అలసటను తీర్చుకునేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు తాగే మద్యం అలవాటు కొందరు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోందని చెప్పవచ్చు. ఈ కల్తీ కల్లులో అసలు కల్లుకు బదులు నీటిలో అల్పాజోలం, సిట్రిక్ యాసిడ్, డైజోపాం, క్లోరల్ హైడ్రేట్ వంటి విషపదార్థాలను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రోజంతా కష్టపడ్డ వారికి రూ.15 లతో కల్తీ కల్లు సేవించి మత్తులో జోగుతున్నారు. దీంతో కల్తీ కల్లు తాగుతున్న ప్రజలు వ్యాదుల భారిన పడుతున్న విషయం తెలిసిందే. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి తనిఖీలు చేస్తే తప్ప జిల్లా అధికారులు తనిఖీలు చేయలేకపోతున్నారు. జిల్లాలో గౌడ సోసైటిలు ఉండగా, గ్రామాల్లో వేయి లల్లో కల్లు దుకాణలు ఉన్నాయి. నగరంలో ఎన్ని కల్లు డిపోలు ఉన్నాయి. ఆడిపో పరిధిలో లైసెన్స్ వున్నవి ఎన్ని దుకాణలు ఉన్నాయో లైసన్స్ లేనివి ఎన్ని ఉన్నాయో కనీసం వాటికి కూడా పొంతనలేదు, మండలాలలోని కల్లు దుకాణాల నుంచి రోజుకు లక్షల లీటర్ల కల్తీ కల్లును యజమానులు విక్రయిస్తున్నారు. గీత కార్మికుల కోసం చెట్ల నుంచి కల్లు తీసేందుకు అనుమతి ఇచ్చారు. విటి పరిధిలో గీత కార్మికులు చెట్లను పెంచుతూ కల్లు అమ్మకాలు చేస్తున్నారు. తాటి చెట్లతో పాటు ఈత చెట్ల నుంచి కల్లును సోసైటిల ద్వారా తీస్తున్నారు. చెట్ల నుంచి తీసిన కల్లును కొన్ని డిపోల పరిధిలో అమ్మకాలు చెస్తున్నారు. కల్లు దుకాణాల ద్వారా ప్రతిరోజు ఈ కల్లును తీసి అమ్ముతున్నారు. జిల్లాలో కొన్ని సోసైటిల పరిధిలో చెట్ల నుంచి తీసిందే కాకుండా కల్తీ కల్లు అమ్మకాలను జోరుగా సాగిస్తున్నారు. రసాయనాల ద్వారా కృత్రిమంగా కల్లు తయారుచేస్తూ ఈ అమ్మకాలను కొనసాగిస్తున్నారు. చెట్ల నుంచి పారే కల్లును సోసైటిలకు తరలించి అమ్మకాలు చేయాల్సి ఉన్నా కొన్ని చోట్ల రసాయనలతో కల్తీ కల్లును అమ్ముతున్నారు. ఈ కల్తీ కల్లులో అల్పాజోలం, సిట్రిక్ యాసిడ్, డైజోపాం, క్లోరల్ హైడ్రేట్ వంటి నిషేదిత రసాయనాలను కర్ణాటక మహరాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి లక్షల రూపాయలు విచ్చేంచి కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఉపయోగించి కృత్రిమంగా కల్లును తయారుచేస్తున్నారు. ఈ కల్తీ కల్లు తగిన వారికి ఆరోగ్యపరమైన పలు ఇబ్బందులు ఎదరువుతున్న పట్టించుకోనే నాదుడే కరువయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ దుకాణాలను మూసివేసినప్పుడు కల్తీ కల్లు తగేవారు రకరకల జబ్బులు వచ్చి ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఈ కల్లు తాగిన వారు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిగా, ఆసుపత్రుల్లో చేరిన సంఘటనలు ఉన్నాయి. ఈ కల్తీ కల్లు తాగిన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచించిన ఎక్సైజ్ శాఖాధికారులు మాత్రం నియంత్రించడంలో నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అధికారుల సహకారంతో యథేచ్చగా కల్తీ కల్లు అమ్మకాలను కల్లు తయారీదారులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్లు దుకాణాదారుల నుంచి అధికారులకు పరిచయాలు ఉండడం, వారి అవసరాలు నేరవేరుతుండడంతో పట్టించుకోనే వారు లేకపోవడం గమనార్హం. ఏ దుకాణాల పరిధిలో చెట్ల కల్లు అమ్మకాలు జరుగుతున్నాయో లేదో వివరాలు ఎక్సైజ్ అధికారులకు తెలిసిన కనీస తనిఖీలు చేయడంలేదని విమర్శలు ఉన్నాయి. చివరకు కల్లు నాణ్యత పరిక్షలు కూడా నిర్వహించడం లేదనే తెలుస్తుంది. నగర పరిధిలో ఎక్కువ మొత్తంలో కల్తీ కల్లు అమ్మకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కల్లీ కల్లు విక్రయాలు జరుగుతున్న జిల్లా స్థాయి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర స్థాయిలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వచ్చి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు కల్లు దుకాణాలను తనిఖీ చేసిన సందర్భాలు ఇటివల లేకుండా పోయింది. దాంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన జిల్లా ఎక్సైజ్ అధికారులు కల్తీ కల్లుపై చర్యలు తీసుకుంటారో లేదో విచే చూడల్సిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version