రెజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డివైఎస్డిఓ

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

దుగ్గొండి మండల కేంద్రంలోని
శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ జరుగుచున్న వేసవి రెజ్లింగ్ శిక్షణ శిబిరాన్ని వరంగల్ (డివైఎస్డిఓ) జిల్లా యూత్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అధికారి టీవీఎల్ సత్యవాణి శిక్షణ శిబిరాన్ని గురువారం సందర్శించారు.
తెలంగాణ స్పోర్ట్స్ ఆఫ్ అథారిటీ డైరెక్టర్ అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ అండ్ చైర్పర్సన్, డివైఎస్డిఓ అనుమతులతో శ్రీ అదర్శవాణి పాఠశాలలో జరుగుతున్న వేసవి శిక్షణ శిబిరంలో ఉన్న క్రీడాకారులతో అధికారిని ముచ్చటించారు. క్రీడాకారులు సమయాన్ని వృధా చేయకూడదని వేసవిలో తన శిక్షణను కొనసాగించాలని తెలిపారు.ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకుసాగాలని క్రీడాకారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, ప్రిన్సిపల్స్ సుధాకర్ రవి, ఏవో రమేష్, కోచ్ ఇటికాల దేవేందర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

రామాంజపురం ఎరుకల నాంచారమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

వెంకటాపూర్ మండలం లోని రామాంజపురం గ్రామ శివారులో కొలువుదీరిన శ్రీ ఎరుకల నాంచారమ్మ తల్లిని గురువారం సాయంత్రం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకున్నారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎరుకల కులస్తులు ఎమ్మెల్యేకు నాంచరమ్మ తల్లి బుట్టను అందించి ఘన స్వాగతం పలికారు అనంతరం పూజారులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ నాంచరమ్మ ఎరుకల కులస్తుల ఆరాధ్యదైవమని ప్రతీ సంవత్సరం మే నెలలో వైశాఖ పౌర్ణమి రోజున జాతర జరుపుకోవడం జరుగుతుందన్నారు నూతన ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు వచ్చే రోడ్డు ను తారు రోడ్డును చేయాలని ఎమ్మెల్యే గారిని ఎరుకల కుల పెద్దలు కోరగా మంత్రి సీతక్క గారితో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుని ఆలయ అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య డైరెక్టర్ కేతిరి సుభాష్ డైరెక్టర్లు కోనేటి రాజు మనుపాటి రమేష్, అంగిడి ప్రశాంత్ కేతిరి రాజేందర్ కుర్ర రవి తదితరులు ఉన్నారు

నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్ నమోదు .జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

నకిలీ విత్తనాలు విక్రయ దారులపై కఠినంగా వ్యవహరించాలి

టాస్క్ ఫోర్స్ టీములు నిరంతరం తనిఖీలు చేపట్టాలి

భూపాలపల్లి నేటిధాత్రి

నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. గురువారం సమీకృత కలెక్టర్ కార్యాలయపు సమావేశపు హాలులో వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో ఫెర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో నకిలీ విత్తనాలు నియంత్రణ చర్యలపయో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ రైతులకు డీలర్లు, ఫెర్టి లైజర్ షాపు యజమానులు నకిలి, కాలం చెల్లిన విత్తనాలు, ఎరువులు, నిషేధిత పురుగు మందులు విక్రయించొద్దని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మినట్లైతే అలాంటి వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిభంధనల ప్రకారం నడుచుకోవాలని రైతులకు నష్టం కలిగిస్తే సహించబోమని తెలిపారు. మార్కెట్ లోకి నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయాలు జరుగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రోజు జిల్లాలో ఏదో ఒక చోట ఫెర్టి లైజర్ షాపులలో వ్యవసాయ శాక అధికారులు తనిఖీలు చేపట్టి నివేదిక అందజేయాలని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టాస్క్ పోర్స్ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నకిలి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని కృత్రిమంగా విత్తనాల కొరత సృస్టించే అవకాశం ఉందని అక్రమంగా విత్తనాలు, ఎరువులు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులను రద్ధు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు రైతులకు రశీదు తప్పకుండ ఇవ్వాలని రశీదులో రైతు పేరు, ఏ కంపనీ విత్తనాలు అనే విషయాలు తప్పకుండ రాయాలని, రైతు నుండి సంతకం తీసుకోవాలని, పత్తి విత్తనాలు స్టాక్ షాపులోకి రాగానే ఇన్వాయిస్ బిల్లులను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు పంపించాలని రిజిస్టర్ నిర్వహించాలని అన్నారు. ఓ.ఎల్.ఏం.ఎస్ పోర్టల్ లో విత్తనాల వివరాలు ప్రతి నెల 5వ తేదీన స్టాక్ అమ్మకం వివరాలను నమోదు చేయాలని తెలిపారు. గత సంవత్సరం విత్తనాలు, పురుగు మందులు ఏవైన నిల్వలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
జిల్లాఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. మన జిల్లా మహా రాష్ట్ర, ఛత్తీష్ ఘడ్ సరిహద్దు జిల్లా కావడంతో కొంత మంది దళారులు ముఠాలుగా ఏర్పడి రైతులకు తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని, అలాంటి వ్యక్తుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అలాంటి వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని తెలిపారు. సరియైన ప్యాకింగ్ లేకుండా రకరకాల పేర్ల తో ఉన్న విత్తనాలు రైతులు కొనొద్దని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, వ్యవసాయ అధికారులు, ఫెర్టి లైజర్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య తీవ్రమైన గాయాలతో అపస్మార్క స్థితిలో చికిత్స పొందుతుంది.
కారుణ్య మొదటి సంవత్సరం బిఎస్సి నర్సింగ్ విద్యను ఈ కళాశాలలో అభ్యసిస్తుంది.
ఈరోజు తెల్లవారుజామున తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.
కళాశాల వసతి గృహంలో ఈ సంఘటన జరగటం వలన అనుమానాలు కలుగుతున్నాయి.
కళాశాలకు కళాశాల వసతి గృహానికి సరైన రక్షణ చర్యలు లేవు.
ప్రహరి గోడలు కూడా లేవు.
మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య పై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారా?
లేకపోతే బయట వ్యక్తులు హత్య ప్రయత్నం చేశారా?
ర్యాగింగ్ విషయంలో సీనియర్ విద్యార్థులు హత్యా ప్రయత్నం చేశారా?
కారుణ్య 1 నుండి ఇంటర్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలలో చదువుకున్నది.
పదవ తరగతిలో 10/10 మార్కులతో ఉత్తీర్ణత.
ఇంటర్లో 901 మార్కులతో ఉత్తీర్ణత.
బాగా చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటుందా?
ఈ మిస్టరీని పోలీసులే చేదించాలి.

గంజాయి పట్టుకున్న భూపాలపల్లి పోలీసులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాల్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైన్ ఇంక్లైన్ ఆర్చి వద్ద నమ్మదగిన సమాచారం మేరకు సీఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేయుచుండగా నిగ్గుల రాజు శనిగరం గ్రామం కమలాపురం మండల అను వ్యక్తి టీఎస్ 24C 2236 గ్లామర్ బండి పై వస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అతని పట్టుకొని విచారించగా అతడి వద్ద 1 కేజీ 100 గ్రాముల ఎండు గంజాయి లభించగా అతడు విచారణలో భాగంగా కుమ్మరి నాగరాజు అలియాస్ రాజు నడికుడా గ్రామం అతని వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పగా ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన పోలీస్ సిబ్బంది ఈ కేసు లో పూర్తి విచారణ చేస్తున్నామని సీఐ. డీ.నరేష్ కుమార్ తెలియజేశారు

వర్ష బీభత్సానికి విరిగిపడ్డ చెట్టు…. రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలు

ఈ రోడ్డును కాపాడేదెవరు

శాయపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని కుమ్మరి వాడనుండి కొత్తగట్టు సింగారం నుండి వెళ్లే దారి చెట్ల పొదలతో మూసుకుపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు ప్రక్కల ఉండే చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి దీంతో రోడ్డు దారి కనిపించకుండా పోయింది. రోడ్డుకి ఇరువైపులా పొదలు పెరిగి దారి కనిపించని స్థితికి చేరింది. అటువైపు వెళుతున్న వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలను తీసివేయాలని. రైతులు వాహనదారులు కోరుతున్నారు.

సుడిగాలి పర్యటన చేసిన BRS ఎమ్మెల్యే

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి

గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం
మండలం లో సుడిగాలి పర్యటన చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి గంగారం మండలంలొని మడగూడెం గ్రామంలో నూతన వధూవరులు యాపా ప్రభాకర్ వెడ్స్ అనూష లను ఆశీర్వదించిన
ఆసిమాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
అనంతరం దశదిన కర్మలకు హాజరై గంగారం మండలంలోని మర్రిగూడెం గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన సువర్ణపాక సమ్మక్క కుటుంబాన్ని పరామర్శించి బిఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో గంగారం మండల అధ్యక్షుడు ఇర్ప సూరయ్య జిల్లా నాయకులు జగ్గారావు గంగారం మండల ప్రధాన కార్యదర్శి. జంగాలపల్లి సర్పంచ్ ఇస్లావత్ బాలకృష్ణ ఉమ్మడి కొత్తగూడెం మండలం సీనియర్ నాయకులు ఈసం సమ్మయ్య, ఉప సర్పంచ్ మాధారపు సతీష్ జనగం వెంకన్న దుర్గం నారాయణ దుర్గం కృష్ణ గంగారం మండల సోషల్ మీడియా జనగం రవి బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఉచిత కంటి వైద్యశిబిరం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని సాదన్ పల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కాలేశ్వరం మహాదేవపూర్ వారి సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంలో సాధన్ పల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సుమారుగా 121 మంది కంటి పరీక్షలు చేపించుకున్నారు కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 40 మంది పేషెంట్లను కంటిలో పొరలు శుక్లములు వచ్చిన వారిగా లయన్స్ క్లబ్ వెంకన్న ఆప్తాలమిక్ గుర్తించి వారికి ఉచితముగా కంటి ఆపరేషన్లు చేపిస్తామని సాధనపల్లి గ్రామ ప్రజలకు తెలియజేసినారు ఇట్టి కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించినందుకు ప్రజ్వల ఎఫ్ పి సి ఎల్ మరియు లయన్స్ క్లబ్ వారికి సాధనపల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి వైద్యశిబిరాలు ముందు ముందు కూడా నిర్వ హించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కంటి పరీక్ష శిబిరంలో ప్రజ్వల డైరెక్టర్ జంగసమ్మయ్య , ఎఫ్ ఎఫ్ దొడ్డిపాక రవిచందర్ తరాల తిరుపతి ఎఫ్ ఎఫ్ మరియు గ్రామ కారోబార్ కత్తుల రవి పాల్గొన్నారు.

నాసిరకం విత్తనాలు విక్రయిస్తే పిడి యాక్ట్ నమోదు చేస్తాం..

# విత్తన,ఎరువుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు.
# విత్తన డీలర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలి


# వ్యవసాయ అధికారి దయాకర్..

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :

రైతులకు కృత్రిమ కొరత సృష్టిస్టించిన,నాసికరం విత్తనాలు విక్రయించిన షాపుల లైసెన్సులు రద్దు చేసి పిడి యాక్ట్ నమోదు చేస్తామని మండల వ్యవసాయ శాఖ అధికారి చిలువేరు దయాకర్ అన్నారు.
దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, దుగ్గొండి మండల కేంద్రంలో గల విత్తనాల, ఎరువుల షాపులను మండల వ్యవసాయ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.మండల వ్యవసాయ అధికారి దయాకర్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ సమీపిస్తున్నందున మండలంలోని అందరు లైసెన్సు కలిగిన విత్తన డీలర్లు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు.రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండి ఎరువులు, విత్తనాల సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.ఏదైనా డిమాండ్ ఉన్నటువంటి విత్తనాల రకాలు షాపులో ఉన్నప్పటికీ కృత్తిమ కొరత సృష్టించిన, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించిన,నాసిరకమైన విత్తనాలు అమ్మిన, విడిగా విత్తనాలను రైతులకు అమ్మకాలు చేస్తూ,రైతులకు రసీదు ఇవ్వకున్న చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకొని వారిపై పి.డి చట్టం ,విత్తన చట్టం, నిత్యావసరల సరుకుల చట్టం, క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి లైసెన్సులు రద్దు చేస్తామని ఈసందర్భంగా హెచ్చరించారు.అదేవిధంగా ప్రతి ఒక్క విత్తన డీలర్ రైతులకు అమ్మినటువంటి విత్తనాలకు సంబంధించి ఒక రిజిస్టర్ రైతు వారిగా వివరాలను నమోదు చేసి తనిఖీ అధికారులు వచ్చినప్పుడు తప్పనిసరిగా అందజేయాలన్నారు. ధరల పట్టిక, స్టాక్ వివరాలు, స్టాక్ రిజిస్టర్, బిల్ పుస్తకాలు అన్ని సమకూర్చుకొని ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా రైతులకు తోడ్పాటు అందించాలని ఏఓ దయాకర్ తెలియజేశారు.

ఘనంగా హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం

సామూహిక సత్యనారాయణ వ్రతాలు మహా అన్నదానం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలోని ఘనప సముద్రం కట్ట పైన ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి దక్షిణముఖ ఆంజనేయస్వామి 52వ వార్షికోత్సవం సందర్భంగా 150 హనుమాన్ మాల ధారణ గురువారం ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం పౌర్ణమి పర్వదినం సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని దుగ్యాల అమృత ఆగమ రావు, దుగ్యాల స్వరూప వెంకటనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలతో పాటు హనుమాన్ మాల ధారణ భక్తులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వేద పండితులు ఆలయ అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు

జాతీయ మానవ హక్కుల మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా కైరి శ్రీనివాస్ గౌడ్ నియామకం

మంచిర్యాల నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ మానవ హక్కుల సంగం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్ అధ్యక్షనలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు ఎల్లవేళలా ముందుంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా కైరి శ్రీనివాస్ గౌడ్ ను నియమించి నియామక పత్రాన్ని అందజేశారు ఇట్టి కార్యక్రమంలో లీగల్ సెల్ అధ్యక్షుడు పెసర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

జైపూర్ మండల కేంద్రంలో పర్యటించిన స్పెషల్ కమిషనర్ సైఫ్ ఉల్లా ఖాన్

జైపూర్,నేటి ధ్రాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గురువారం రోజున స్పెషల్ కమిషనర్ సైఫ్ ఉల్లాఖాన్ ఆర్ డి (ఐఎఫ్ఎస్) ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జైపూర్ మండల కేంద్రంలోని సేనిగ్రేషన్ షెడ్లను పరిశీలించి పాటించవలసిన తగు సూచనలను తెలియజేసి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సేంద్రియ ఎరువు పద్ధతిని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తడి చెత్త పొడి చెత్త మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలను వేరువేరుగా శుద్ధి చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అధికారులు ఎల్లవేళలా ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తూ పనులు జరిగేలా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ, డిపిఓ, ఎంపీడీవో, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రెటరీ పలువురు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లనను గెలిపించుకుందాం

దళిత నాయకుడు గుగ్గిళ్ల సురేష్ మాదిగ

మంగపేట నేటిధాత్రి

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్ట భద్రుల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజల, యువత కోసం ప్రతి నిత్యం శ్రమిస్తున్న తీన్మార్ మల్లన్న కు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలి తెలంగాణ రాష్టం లోనీపేదల నిరుద్యోగల కోసం నిలబడి పోరాడి మాట్లాడిన తీన్మార్ మల్లన్న, సీరియల్ నంబర్ రెండోవ నంబర్ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను అని మంగపేట మండల దళిత నాయకులు గుగ్గిళ్ల సురేష్ మాదిగ పట్టభద్రులతో మాట్లాడడం జరిగిందిఈ సమావేశంలో పున్నేం భాస్కర్, డర్ర సతీష్, తరుణ్, లవయ్య, వినోద్, కోలుకుల సతీష్, బోడ సతీష్, బోడ పుల్లయ్య, బేత నర్సింహారావు, రోహిత్, బోడ రామకృష్ణ, తదితరులు పాలుగోన్నారు

పంపిణీకి సిద్ధంగా పచ్చిరొట్ట (జీలుగా) విత్తనాలు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ద్వారా రైతులకు అందుబాటులోకి జీలుగ విత్తనాలు తీసుకువచ్చామని జైపూర్ ఏఈఓ కొమురయ్య తెలిపారు.ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా 60 శాతం సబ్సిడీతో జీలుగా విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, 30 కిలోల జీలుగుగా విత్తనాల బస్తాకు రూ.1116 సబ్సిడీ పోను రైతులు మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.జీలుగా విత్తనాలు అవసరమైన రైతులు
పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు
ఆధార్ కార్డు జిరాక్స్
తీసుకొని రైతు సేవ కేంద్రం జైపూర్ నందు సంప్రదించి జీలుగ విత్తనాలు తీసుకోగలరని జైపూర్ ఏఈఓ ఎస్. కొమురయ్య రైతులకు సూచించారు.

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించండి

మొగుళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ
ఎన్ ఎస్ యు ఐమండల అధ్యక్షుడు
పొలం పెళ్లి శంకర్
నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ల పెళ్లి మండలం ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల అధ్యక్షుడు పొలంపల్లి శంకర్ ఒక ప్రకటనలో కోరారు తీన్మార్ మల్లన్న అంటేనే పేదవాడు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం పేద ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని అన్నారు ఎన్నో అవంతరాలు అడ్డంకులు ఎదురైన ప్రజల పక్షాన నిలబడి పోరాడగల నాయకుడు అన్నారు తీన్మార్ మల్లన్న చట్టసభల్లో అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో పట్టబద్రులకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తాడని జరగబోయే ఉప ఎన్నికల్లో పట్టభద్రుల మొదటి ఓటును వేసి మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తీన్మార్ మల్లన్న హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు

తీన్మార్ మల్లన్నను ఎమ్మె ల్సీగా గెలిపించు కుందాం ఎమ్మెల్యే గండ్ర సత్యన్న

ప్రజల కోసం పోరాడేవ్యక్తి సభలో ఉండాలి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ అని వారిని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోభూపాలపల్లి నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రతీ ఒక్కరూ కష్టపడాలని సూచించారు. జీవో నంబర్ 46, 317 ఇతర ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ కేబినెట్ సబ్ కమిటీ వేసి పరిష్కరిస్తుందని అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై తీన్మార్ మల్లన్న పోరాటం చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టో లో పెట్టిన ప్రతీ హామిని నెరవేరుస్తుందని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని గ్రామాలనుండి పట్టభద్రులు ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

మత్స్యగిరి స్వామి దేవా లయంలో ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానం

శాయంపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ మత్స్యగిరి స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జీఎస్సార్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. మండల కేంద్రానికి చెందిన జెన్న కృపాకర్ రెడ్డి ఆలయానికి గోవిందరాజస్వామి వారి ఏనుగు రథాన్ని బహు కరించగా, ఆ రథాన్ని ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఏ వై ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా గౌతమ బుద్ధుని 2568వ జయంతి వేడుకలు.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ గౌతమా బుద్ధుడు బోధిసత్వుడిగా జన్మించి సమాజానికి ధర్మమార్గాన్ని చూపి గొప్ప గురువు అయ్యారని, దేశంలోని ప్రజలు మహిళలు సమానత్వం తో కలిసి ఉండాలని గౌరవం తో జీవించుటకు వారిని చైతన్య వంతులను చేయాలని ఎంతో క్రృషి చేశారని,జీవకోటికి ప్రేమ తత్వాన్ని బోధనలు చేసి, సంపాదన, జీవితం శాశ్వతం కాదు మంచితనం ఒక్కటే శాశ్వతంగా నిలుస్తుందన్నారు. బాల్యం లోనే బాణం దెబ్బ కు విలవిల లాడిన పావురం ను కాపాడినాడని తెలిపారు, రెండు రాజ్యాల మధ్య నదీజలాల వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాడన్నారు. తాను జ్ణానం పొందిన బోది వ్రృక్షం పేరు వచ్చేలా స్థిర పడినాడని తెలిపారు. తనను ధిక్కరించి వెళ్లిన వారినే తన బోధనల ద్వారా శిష్యులుగా చేసుకున్నారని చెప్పారు. ఆనాటి విశ్వ సుందరి, రాజు నర్తకి గణిక వ్రృత్తిలో వున్న“అమ్రపాలి’నిని బౌద్ద బిక్షుణిగా మార్చి నాడని తెలిపారు. త్రిరత్నాలను, పంచశీల ను , అష్టాంగ మార్గంను బోధీంచినాడని , కులాన్ని వర్ణాశ్రమ ధర్మాలను నిరశించటమే కాక84 వేల ప్రవచనాలు చేసిన మహనీయుడు గౌతమ బుద్ధుడు* అని తెలిపారు. ఈ మహానీయుడు దేశానికి ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని ,ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్, శ్రీనివాస్, గుర్రపు రాజమౌళి నాయకులు మైదం మహేశ్, కట్కూరి మొగిలి, గడ్డం సదానందం, కింసారపు సంద్య, ప్రతాప్, చందర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులను నిరుద్యోగులనుమోసం చేసిన కాంగ్రెస్

# గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బుద్ధి చెప్పాలి
# ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నర్సంపేట/ఖానాపురం,నేటిధాత్రి :
అనవసరపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను మోసం చేసిందని ఇప్పుడు జరుగబోయే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకు మద్దతుగా గురువారం ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి డాక్టర్ రవీందర్ రావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మేధావి,ఉన్నత విద్యావంతుడు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ఓటువేసి గెలిపించాలని కోరారు. రైతులను, ఉద్యోగులను గ్రాడ్యుయేట్లను, సమస్త ప్రజానీకాన్ని హామీలతో మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిoదని ఆరోపించారు.పదేళ్ల కాలంలో అధికంగా గవర్నమెంట్ ఉద్యోగులను తీసుకు వచ్చింది దేశంలో కేవలం తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటులో ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తుందన్నారు.క్వింటాల్ కు 500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 24 గంటల్లోనే మాట మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రైతు వ్యతిరేకి..పచ్చి మోసగాడు అని ఆరోపించారు.కేవలం సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామనడం, దొడ్డు రకం, ఇతర పంటలకు ఇవ్వను అని మాట మార్చడం సీఎం రైతులను మోసం చేసినట్లే అని రైతులకు కరెంటు, ఎరువులు విత్తనాలను సకాలంలో అందించలేని అసమర్ధులు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు అని చెప్పారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంటర్వ్యూ పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొని తిరుగుతుండడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.శాసనమండలిలో ఉద్యోగుల సమస్యలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే దమ్మున్న రాకేష్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశంలో ఒడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఎంపిపి వేములపల్లి ప్రకాష్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, ఎంపిటిసి, క్లస్టర్ భాద్యులు, మండల కోఆప్షన్ సభ్యులు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్, తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి

సర్పంచుల ఫోరం మొగుళ్ళపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికీ బిల్లులు అందక..నానా ఇబ్బందులు పడుతున్న సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సర్పంచుల ఫోరం మొగుళ్ళపల్లి మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి అనే ఆకాంక్షతో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు, వీధిలైట్ల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, క్రీడా ప్రాంగణాలు మొదలగు అనేక కార్యక్రమాలు విడతలవారీగా చేపట్టి ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించారన్నారు. ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన సర్పంచుల బిల్లుల చెల్లింపులో నూతన కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం వహిస్తూ..సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. పెండింగ్ బిల్లుల విషయమై ప్రజా ప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దగ్గర పడుతున్న నేపథ్యంలో సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

నాగబందిని సన్మానం చేసిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ కమిటీ నిర్వాహకులు

వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి పట్టణంలో శంకర్ గంజిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ నిర్వాహకులు న్యాయవాది ధార వెంకటేష్ దాచ లక్ష్మీనారాయణ ఈపూరి వెంకటేష్ ఘనంగా సన్మానించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు

error: Content is protected !!
Exit mobile version