Collector Reviews Agricultural Preparations in Nekkonda Mandal
నెక్కొండ మండలంలో అధికారుల సమీక్ష సమావేశం
#నెక్కొండ, నేటి ధాత్రి:
జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి గురువారం నెక్కొండ మండలాన్ని సందర్శించారు. పంటల నిలువ కోసం పోదాములను పరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ వేముల రాజ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, ఎంపీఓ దయాకర్ ఏఎంసీ కార్యదర్శి కృష్ణ మీనన్ ,ఏఈఓలు, జీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మండలంలో మక్కజొన్న, రాబోయే వరి పంటల సాగు, కొనుగోలు ఏర్పాట్లు, రైతులకు అందించాల్సిన సదుపాయాలపై అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
