Ramajaneyulu Turns Birthday into Service Day for Disabled Welfare
దివ్యాంగులకు అండగా నిలిచిన కొత్తపల్లి రామాంజనేయులు
జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నేటిదాత్రి చర్ల
చర్ల రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై రామాంజనేయులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు జన్మదినాన్ని సేవా దినోత్సవంగా మార్చుకున్న రామాంజనేయులు ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులను శాలువాలతో ఘనంగా సత్కరించారు అనంతరం ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం తో పాటు నిత్యావసర సరుకులను అందజేసి తన సేవా మనసును చాటిచెప్పారు

ఈ కార్యక్రమం ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవడం తన ధ్యేయమని రామాంజనేయులు తెలిపారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ సమాజంలో సేవా భావంతో ముందుకు వస్తున్న వ్యక్తులు ఆదర్శంగా నిలుస్తారని రామాంజనేయులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం అని కొనియాడారు ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు మిత్రులు చీమలమర్రి మురళి పోలిన లంకరాజు ముమ్మినేని అరవింద్ బ్రహ్మానంద రెడ్డి కాకి అనిల్ పంజా రాజు తోటమల్ల రవి సుధాకర్ తదితరులు పాల్గొని రామాంజనేయులు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు స్థానికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
