Scorching Heatwave Grips Shayampet
భగ్గుమంటున్న భాను డు..
ఉదయం 10 నుంచి మండుతున్న ఎండలు
ఇండ్లకే పరిమితమ వుతున్న ప్రజలు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో ఎండలు మండిపోతున్నాయి జనం తట్టుకోలేక బయటకు రాలేక ఇండ్లకే పరిమితమ వుతున్నారు. మండల కేంద్రం లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమో దవుతుంది. 10 గంటలు దాటితే ప్రజలు ఎండకు తట్టు కోలేక నీడను ఆశ్రయిస్తు న్నారు దప్పిక తట్టుకోవడానికి చలివేంద్రాలకు పరుగులు పెడుతున్నారు ప్రజలు వడ దెబ్బ తగులుతుందేమో అని ప్రజలు ఆందోళన చెందు తున్నారు.
పెరిగిన విద్యుత్ వినియోగం
విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది వేసవి ఎండలు ఉపశమనం పొందేందుకు పేద మధ్యతరగతి ప్రజలు కూలర్లను వినియోగిస్తుండగా ఉన్నత వర్గాలకు చెందిన వారు ఏసీలను వినియోగిస్తున్నారు గతం కంటే కూలర్లు ఎయిర్ కండిషన్లు వినియోగం పెరిగిపోవడంతో విద్యుత్ బిల్లులు తడిసి మోపడు వుతున్నాయి అయినప్పటికీ ప్రజలు జంకకుండా విద్యు త్తును అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు.
మూగజీవాలు విలవిల
మనుషులకే ఇలా ఉంటే మూగజీవాల పరిస్థితి దారుణంగా ఉంది బయట చెట్ల నీడ లేక తాగునీరు దొరకక విలవిలలాడు తున్నాయి. బయట మేతకు వెళ్లిన జీవాలకు నీరు దొరకక చెరువు కుంటలు, నీటి గుంటలలో నిల్వ ఉన్న నీరు తాగే పరిస్థితి నెలకొంది ఎండకు తట్టుకోలేక మేతకు వెళ్లిన జీవాలు అక్కడే మృత్యువాత పడతాయని రైతులు ఆందోళన గురవు తున్నారు.
వడదెబ్బ నివారణకు ముందస్తు చర్యలు
శరీరం అధిక ఉష్ణోగ్రత గురైనప్పుడు శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి సాధారణమని శరీరంలో జరిగే రసాయన చర్ల వల్ల వేడిఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన వేడి వలన శరీరంలో సమతుల్యతను కాపాడే చర్మం ద్వారా చెమట రూపంలో బయటికి వెలువబడుతుంది కానీ మన శరీరం అధిక ఉష్ణోగ్రతను కానీ, డ్రీహైడ్రేషన్ కానీ గురైనప్పుడు రక్షణ మార్గాలైన చర్మం ఊపిరితిత్తులు సరిగా పనిచేయవు దానివల్ల మన శరీర ఉష్ణవతలు ఒక్కసారి అధిక స్థాయికి చేరుకుంటుంది సాధారణంగా చిన్న పిల్లలు అత్యధిక వయసు ఉన్న వృద్ధులు ఆరు బయట పని చేసేవారు వడదెబ్బకు గురవుతుంటారు
జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదమే
డాక్టర్ సాయి కృష్ణ
రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రస్తుత సీజన్ లో వాతావ రణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భానుడి భగభగ వల్ల ఎండలు మండి పోతున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల జబ్బులతో బాధపడేవారు ఇటువంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిస్థితిలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 10 గంటలకి ఉష్ణోగ్రత పెరుగుదల సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది సాయంత్రం వేడిగాలులు వీస్తున్నాయి. ప్రజలు తమ పనులను ఉదయం 10 గంటల లోపే పూర్తి చేసుకోవాలి. మళ్లీ సాయంత్రం వేళ పనులు కొనసాగించాలి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళరాదు. ఒకవేళ బయటికి వెళితే తగు జాగ్రత్తలు పాటించాలి. ఎండలో పనిచేసేవారు మధ్యలో కొద్ది సమయం నీడకి విశ్రాంతి తీసుకుంటూ పని చేయాలి. వడదెబ్బ లక్షణాలు అయినా తలనొప్పి తల తిరగడం వాంతులు అలసట కండరాల నొప్పులు విరోచనాలు అతిగా చెమటలు పట్టడం అధిక వేడి గా అనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రి వైద్యుడు సంప్ర అలాగే ఫీల్డ్ లెవల్లో పనిచేసే సూపర్వైజర్లు ఏఎన్ఎంలు హెల్త్ అసిస్టెంట్లు ఆశావర్కర్లు వడదెబ్బ గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు వ్యవసాయ కూలీలు,ఉపాధి హామీ కూలీ లు బయటప్రదేశంలో పనిచేసే వారికి ఆశలు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందిస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు
