Assurance on Indiramma Saree Distribution
చీరల పంపిణీలో సందేహాలు వద్దు
ప్రతి మహిళకూ అందిస్తాం : హరీష్ రెడ్డి
#నెక్కొండ ,నేటి ధాత్రి:
ఇందిరమ్మ చీరల పంపిణీపై మహిళల్లో అనవసర ఆందోళన వద్దని, రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీరలు తప్పకుండా చేరుతాయని నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి స్పష్టం చేశారు.
మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయాన్ని ఆయన బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
“మహిళా సంఘ సభ్యత్వం లేకపోయినా, అర్హత కలిగిన ప్రతి మహిళకు చీరలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పంపిణీలో ఎటువంటి లోపాలు చోటు చేసుకోనివ్వం” అని తెలిపారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్, మండల ఏపీఎంలు బరుగు శ్రీనివాస్, రాపాక కిరణ్, ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, నర్సంపేట కోర్టు ఏజీపీ అడ్వకేట్ బండి శివకుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మాదటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
