Headlines

వైద్యశాఖలో అవినీతి జలగలు :ఎపిసోడ్‌ – 1 వైద్యానికే ఆమె అవినీతి రోగం!

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/3

సీఎం రేవంత్‌ గారు మీరు చర్యలు తీసుకోవాలంటే… ఈ అవినీతి అధికారిపై ఇంకా ఎన్ని పత్రికలు కథనాలు రాయాలి!?

`ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఆమెకు ఆమే సాటి!

`నిధుల దుర్వినియోగంలో ఆమెకు లేదు పోటీ!

`ఆరోగ్య నిధులు పక్కదారి పట్టించడంలో ఆమే మేటి!

`ఆసుపత్రులకు నాసిరకం రంగుల ఊసరవెళ్లి!

`ఉద్యోగులకు కులం పేరుతో దూషించడం ఆమెకు పరిపాటి.

`ఏడాది పాటు డిప్యూటేషన్‌…ఐదేళ్లుగా అక్కడే తిష్ట వేసి ఉద్యోగం!

`గత ప్రభుత్వంలో ఇద్దరి ఆశీస్సులు.

`ఈ ప్రభుత్వంలో ఇద్దరి అండదండలు.

`వైద్య నిధుల దుర్వినియోగంలో ఆమెదే పైచేయి?

`అటు అవినీతి… ఇటు కుల దురంహంకారం ఆభరణాలు.

`జిల్లా వ్యాప్తంగా అనేక ఆరోపణలు.

`ఆమె డాక్టర్‌…భర్త కాంట్రాక్టర్‌!

`నలుగురు ఉద్యోగులతో కలిసి నిధులు గోల్‌ మాల్‌!

` ఆదివాసుల వైద్య నిధులతో కుర్చీలు, బల్లలు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
వైద్యశాఖలో అవినీతి జలగలు పెరిగిపోతున్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన చేతులతోనే అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. వైద్యం చేయాల్సిన చేతులతోనే కొంత మంది లంచాలు తీసుకుంటున్నారు. నిజాయితీగా పనిచేసేవారిని పెద్ద కుర్చీలలో కూర్చొని వేధిస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన విధుల్లో వుంటూ, ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేస్తున్నారు. వైద్యశాఖకు ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు. నిధులు మాయం చేస్తున్నారు. అవినీతికే మాయని మచ్చలౌతున్నారు. ప్రజల వైద్యం కోసం, వైద్య సదుపాయాల కోసం కేటాయించే నిధులను స్వీయ సంతర్పణలు చేసుకుంటున్నారు. పేదల నిధులు కొల్లగొడుతున్నారు. కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ప్రజలకు ప్రజా వైద్యం దూరం చేస్తున్నారు. ఇదిలా వుంటే కింది స్ధాయి ఉద్యోగులను కాల్చుకుతింటున్నారు. వేదించుకు తింటున్నారు. వారిని ఉద్యోగపరమైన ఇ బ్బందులకు గురి చేస్తున్నారు. వారిని పురుగులకన్నా హీనంగా చూస్తున్నారు. వారిపై బూతుల పంచాంగం వల్లె వేస్తున్నారు. నోరు తెరిచి అనరాని మాటలంటున్నారు. వినకూడని బాషను ప్రయోగిస్తున్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. పైగా కులాల పేరుతో దూషిస్తున్నారు. మమ్మల్నేవరూ ఏమీ చేయలేరంటూ తమ అధికార మదం చూపిస్తున్నారు. పాలకపెద్దల అండదండలతో అవినీతి రాజ్యమేలుతున్నారు. అలాంటి వారిలో ఆమె అవినీతి తిమింగలం…భద్రాద్రి జిల్లా వైద్యశాఖలో అందరూ అంటున్న మాట!
ఆమె భద్రాద్రి జిల్లా వైద్య ఉన్నతాధికారి.
ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక ఏడాది కోసం డిప్యూటేషన్‌పై వచ్చారు. గత కన్నేళ్లుగా భద్రాద్రిలోనే తిష్టవేశారు. అప్పటినుంచి ఆడిరది ఆట, పాడిరది పాటగా మల్చుకున్నారు. పదిహేను లక్షలు పెట్టి వచ్చినట్లు ప్రచారంలో వుంది. ప్రభుత్వ నిధులను భోంచేస్తూ, విధుల నిర్లక్ష్యంతో, నిధుల దుర్వినియోగంతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా సంపాదిస్తున్నారు. జనం సొమ్మును మళ్లించుకుంటున్నారు. ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఆమెకు ఆమే సాటి. గతంలో అర్హత లేని ఓ ముగ్గురు దగ్గర సొమ్ములు తీసుకున్నారు. నిజమైన అర్హులకు అన్యాయం చేశారు. ఒక్కొక్కరి వద్ద మూడు లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో, నియామకాలు జరిగిన వారిచ్చిన సొమ్ము తిరిగి ఇచ్చేశారు. వారిని కొలువుల నుంచి తొలగిస్తూ, నియామకాల నుంచి తామే స్వచ్చందంగా తప్పుకుంటున్నట్లు మరీ రాయించుకొన్నారని సమాచారం. నిధుల దుర్వినియోగంలో ఆమెను మించిన వారు లేదన్నది భద్రాద్రి జిల్లాలో వినిపించే మాట. భద్రాద్రి జిల్లా లో వున్న 29 ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, 5 అప్పర్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటరున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫేస్‌ బ్రాండిరగ్‌ పేరుతో రంగులు వేయించడానికి భద్రాద్రి జిల్లాకు రూ.47.45లక్షలు మంజూరు చేసింది. అయితే ఆమె ఎలాంటి టెండర్‌ ప్రకటన జారీ చేయకుండా, ఓ వ్యక్తికి రంగులు వేసే బాద్యత అప్పగించింది. అతనే ఆమె భర్త. ఆమె డాక్టర్‌. ఆయన కాంట్రాక్టర్‌. దాంతో ఎలాంటి టెండర్‌ ప్రకటన లేకుండానే జిల్లాలో వున్న ప్రైమరీ హెల్త్‌ సెంటర్లకు, అప్పర్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లకు రంగులు వేసే కాంట్రాక్టు ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్‌ నాసిరకం రంగులు వేయించారు. ఇది పెద్దఎత్తున దుమారం రేగింది. నేరుగా తన భర్తకే కాంట్రాక్టు ఇచ్చిన సంగతి అందరికీ తెలియండంతో నిధులన్నీ సంబందిత హెల్త్‌ ఆపీసర్ల అకౌంట్లో వేయించి, వారి ద్వారా తన భర్తకు బిల్లులు చెల్లించినట్లు లెక్కలు చూపారు. మొత్తంగా నిధులు గోల్‌ మాల్‌ చేశారు. కాజేశారు. వేసిన రంగులు వెలిసిపోయాయి. హెల్త్‌ సెంటర్లు వెలవెల బోతున్నాయి. నిధులు దారి మళ్లించడంలో ఆమెకు ఆమే సాటి అందుకే ఉద్యోగులు అంటుంటారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల వైద్యం కోసం సుమారు. 83లక్షల రూపాయలు నుంచి జిల్లాకు మంజూరయ్యాయి. వాటిని ఆదివాసీల వైద్యం కోసం ఉపయోగించాల్సిందిపోయి, ఆ నిధులను పక్కదారి పట్టించి, కొన్ని బల్లలు, కుర్చీలు కొనుగోలు చేసి, నిధుల బోంచేశారు. ఖజానా ఖాళీ చేశారన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట.
ఇక ఉద్యోగులంటే ఆమెకు ఎంత చిన్న చూపంటే మాటల్లో చెప్పలేం.
కింది స్ధాయి ఉద్యోగులను నోటికొచ్చినట్లు తిడుతుందంటున్నారు. కులం పేరుతో దూషిస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుందని, పది మందిలో పరువు పోయేలా మాట్లాడుతుందని కన్నీటి పర్యంతమౌతున్నారు. కుల దురహరంకారంతో ఆది వాసీ ఉద్యోగులను పురుగుల కన్నా హీనంగా చూస్తారని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఓ ఇద్దరు పెద్దలు ఆమెకు ఆశీస్సులు వుండడంతో ఆమె డిప్యూటేషన్‌ మీద భద్రాద్రి జిల్లాకు వచ్చింది. డిప్యూటేషన్‌ అన్నది కేవలం ఒక్క ఏడాది కాలం వరకే వుంటుంది. తర్వాత డిప్యూటేషన్‌ కొనసాగించడానికి నిబంధులు ఒప్పుకోవు. కాని పాలక పెద్దల పుణ్యమా? అని నిబంధనలు కూడా బేకాతరు చేస్తూ ఆమెకు డిప్యూటేషన్‌ పొడిగిస్తూ వస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో కూడా ఓ ఇద్దరు అండదండలతోనే ఇంకా ఆ కుర్చీలో కొనసాగుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఓ నలుగురు ఉద్యోగులను రింగ్‌గా మార్చి వారి చేత నిధుల దుర్వినియోగం పనులు పురమాయిస్తుందని అంటున్నారు. ఆ రింగ్‌లో వున్న ఓ ఉద్యోగి కారుణ్య నియామకంలో ఆమె ఆశీస్సులతో చేరారు. తప్పుడు దృవపత్రాలతో ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. ఆమె కనుసన్నల్లో పనిచేసే ఆ ఉద్యోగులు కూడా లక్షలాది రూపాయల దుర్వియోగంలో పాలు పంచుకుంటున్నారని విమర్శలున్నాయి. వైద్య శాఖ నుంచి అందే నిధులన్నీంటికీ దారి మల్లించడమో, దుర్వినియోగం చేయడమో చేసి పేదలకు వైద్యం కూడా దూరం చేస్తున్నారనేది వారిపై వున్న ప్రధాన ఆరోపణ. ప్రైవేటు ఆసుపత్రులకు మేలు చేసే విధంగా ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు దూరం చేస్తూ, ఆసుపత్రుల అభివృద్ది నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు అనేకం వున్నాయి. డిప్యూటేషన్‌ విషయంలోనూ ఆమె రూ.15 లక్షలు సమర్పించుకొని వచ్చిందనేది అందరూ చెప్పుకుంటున్న మాట. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. వైద్య శాఖక కళంకం తెస్తున్న ఇలాంటి వారి పట్ల కఠినంగా వుండాల్సిన అసవరం వుంది. అదేంటో గాని ఈ మధ్య అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో మహిళలలే ఎక్కువగా వుంటున్నారు. ఇది నిజంగా బాధాకరం. మహిళలు ఉన్నత స్ధానాలలో వుంటే, అవినీతికి ఆస్కారం వుండదన్న నమ్మకం సమాజంలో వుండేది. అందుకు భిన్నంగా వెలుగు చూస్తున్న వాస్తవాలలో మహిళా అధికారులే కనిపించడం గమనార్హం. అన్ని శాఖల్లో ఇలాంటి వారు కొంత మంది వుండడం మూలంగా మొత్తం మహిళా ఉద్యోగ వ్యవస్ధకే మచ్చ తెస్తున్నారు. వైద్య వ్యవస్ధలో మహిళా ఉద్యోగులుంటే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అనుకుంటాం. ఉన్నత స్ధానాల్లో వుంటే అవినీతికి ఆస్కారం వుండదనుకుంటాం. కాని కొంత మంది ఇలాంటి ఉద్యోగుల మూలంగా మహిళా ఉద్యోగులు తలెత్తుకోలేకపోతున్నారు. వైద్య శాఖలో వుండే మహిళా వైద్యులను అమ్మగా కొలుస్తాం. ప్రజల సమస్యలను ఓపికగా వింటారని ఆశిస్తాం. మెరుగైన వైద్యం ఆశిస్తాం. కాని వైద్యం మానేసి, ప్రజలకు సేవ చేయడం వదిలేసి, విధులను పక్కన పెడేసి, నిధుల వ్యవహరం మాత్రమే చూసుకుంటున్నారు. వైద్యశాఖను నిర్వీర్యం చేస్తున్నారు. పేదలకు వైద్యం దూరం, భారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందుకే కొత్త ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెడితే భద్రాద్రి నుంచే మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా వైద్యాధికారి తిన్న సొమ్ముంతా కక్కించాలని కోరుకుంటున్నారు. ఆమె అవినీతిపై దర్యాప్తు చేయించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *