Call for Grand May Day Celebrations
మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి బందు సాయిలు, చెన్నూరి రమేష్,
భూపాలపల్లి నేటిధాత్రి
మేడే వారోత్సవాలనే ఘనంగా నిర్వహించండి.
గ్రామ గ్రామాన పల్లె పల్లెనా మేడే ఎర్రజెండా ఎగరాలి.
మేడే సందర్భంగా సాంస్కృతిక a
సెంటర్ ఆప్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె పల్లెనా ఈ సంవత్సరం మేడే వారోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బందు సాయిలు, చెన్నూరి రమేష్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటితరంగా కార్మికులను పర్మినెంట్ చేయాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని రక్షించాలని, కేంద్ర బిజెపి సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ సంవత్సరం కార్మిక వర్గం గ్రామ గ్రామాన పల్లె పల్లెనా సిఐటియు ఎర్రజెండాను మేడే సందర్భంగా కార్మికులందరినీ కలుపుకొని నిర్వహించాలని పిలుపునిచ్చారు.
