రైతు సంఘం నాయకుడిని పరామర్శించిన నాగుర్ల
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని నర్సక్కపల్లి గ్రామ రైతు సంఘం ( రైతు రక్షణ సమితి ) నాయకులు సురావు బాపూరావు కొడుకు సురావు ప్రవీణ్ ఇటీవల అనారోగ్యంతో పరమపదించగా వారి నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమం లో వారితో పాటు తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్, సుకినే సుధాకర్,నాగుర్ల ధర్మారావు,సురావు కిషన్ రావు,ప్రభాకర్,రామారావు, రాజీరు తదితరులు పాల్గొన్నారు.
