Modi Sabha Success Call
సికింద్రాబాద్ లో జరిగే మోదీ సభను విజయవంతం చేయాలి
మే 10న పరేడ్ గ్రౌండ్ సభకు భారీగా తరలిరావాలి
భాజపా జిల్లా కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
నర్సంపేట, నేటిధాత్రి:
హైదరాబాద్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న నిర్వహించే బీజేపీ నిర్వహించే మోడీ భారీ బహిరంగ సభకు నర్సంపేట నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున తరలిరావాలని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నర్సంపేటలోని బీజేపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆరోపించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని, బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. మహిళలు, యువత, రైతులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్, వనపర్తి మల్లయ్య, కోమల్ రెడ్డి, పాలడుగుల జీవన్, పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
