వనపర్తి నేటిదాత్రి :
మోదీ గ్యారెంటీలు వేల కోట్ల ప్రజాధనాన్ని అదానీ,అంబానీలకు కట్టబెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప, కార్మికులు,కర్షకులకు ఒరిగేది ఏమీ లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మే డే సందర్భంగా కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ పాలనలో పేదల బతుకులు ఛిద్రం అయ్యాయని అన్నారు.కార్మిక కర్షక లోకానికి మోడీ చేసింది ఏమీ లేదన్న ఆయన, బిజెపిని గెలిపిస్తే కార్మిక లోకం తీరని అన్యాయానికి గురవుతుందన్నారు.
కేసీఆర్ హయంలో కార్మికుల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం ఉందన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కార్మికులకు న్యాయం చేసిన పార్టీ భారాసను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. హామీ నెరవేరలేదన్నారు. పెన్షన్ల కార్యక్రమంలో నాగర్ కర్నూలు బీ ఆర్ ఎస్ ఎంపీ అబ్యర్ధి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ బైకని శ్రీనివాస్ యాదవ్,వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీడియా ఇంచార్జి అభిలాష్ రావు, నాయకులు వాకిటి శ్రీధర్,లక్ష్మయ్య, విజయ్ కుమార్,నందిమల్ల అశోక్, ఉంగ్ల మ్మ్.తిరుమల్,గంధం. బాలపేరు,గంధం.పరంజ్యోతి,మాణిక్యం, ధర్మా ,మహేశ్వర రెడ్డి కౌన్సిలర్ కంచె.రవి,నాగన్న యాదవ్,బండారు.కృష్ణ,గడ్డం మహేస్,సూర్యావంశం.గిరి, జో హే బ్ హస్సెన్,చిట్యాల.రాముతదితర నాయకులు పాల్గొన్నారు.
మోదీ గ్యారంటీలతో పేదలకు ఒరిగేది ఏమీ లేదు:మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
