మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
సోమవారం రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, చేతుల మీదుగా జాతీయ జెండా, పార్టీ జెండా ను ఎగరవేశారు , ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించరు.
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..
అనంతరం దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పిలుపుమేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..
60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ 14 ఏళ్లు కోట్లాడి తొలి మలిదశ ఉద్యమంతో నిజం చేసి
10 ఏళ్ల పాలనతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడుతూ
ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతున్న నేపథ్యంలో
ముఖ్యమంత్రి కేసీఆర్
ఆధ్వర్యంలో బంగారు తెలంగాణకు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ప్రపంచంలోని తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలవడం జరిగినది.
దశాబ్ది ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజాప్రతినిధులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సాధించిన సంక్షేమ పథకాల గురించి బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేసిన గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు.
కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతులకు కోసం రైతులకు రైతు బీమా రైతు బంధు, 24 గంటల కరెంటు సబ్సిడీ ఫర్టిలైజర్ రైతు వేదిక, వరి కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసి కొత్త వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినది ప్రజలకు మాయ మాటలు చెప్పి మోస పూర్వకమైన మాటలు చెప్పి అధికారం చేపట్టింది ఆరు నెలలు కాబట్టి కావడం జరుగుతుంది. ఇలాంటి హామీలను అమలు చేయలేకపోతున్నది. మరొకసారి తెలంగాణలో పాలమూరు జిల్లాలలో 60 ఏళ్ల కిందట పాలన మళ్లీ వచ్చే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. కరెంట్ కష్టాలు తాగునీటి కష్టాలు మళ్లీ వలసలుగా మహారాష్ట్ర ముంబై వెళ్లే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే జరగబోయే ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని సూచించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నవీన్ రెడ్డి ని గెలిపించినందుకు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు..
ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.