జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో జెండా ఎగరవేయడం జరిగింది. జెండా కార్యక్రమం అనంతరం జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజ్ ఉద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు అనేక త్యాగాలు చేయడం వలన సోనియా గాంధీ చలించి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఉద్యమకారులు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలని సోనియా గాంధీ చేసిన సహాయాన్ని మరిచిపోవద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజ్ ఉద్దీన్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆసంపల్లి శ్రీకాంత్, జిల్లా డిసిసి నెంబర్ రెక్కుల శ్రీనివాస్ రెడ్డి, గంగాధర రాజన్న అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.