చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఆదివారం రోజు కురిసిన భారీ వర్షాలకి మరియు ఈదురుగాలుల కారణంగా మండలంలోని కొత్తపేట- చల్లగరిగా గ్రామాల మధ్య గల రోడ్డుకు ఇరువైపులా ఉన్న దాదాపు 15 చెట్లు విరిగి రోడ్డుమీద పడిపోవడంతో కొత్తపేట చల్లగరిగ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి,ఈ సమాచారాన్ని తెలుసుకున్న చిట్యాల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ తన పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్ లాల్ సింగ్ నీ పంపించి జెసిబి సహాయంతో రోడ్డు పైన ఉన్న చెట్లను తొలగించారు.
నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించాయని విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కనుక కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో ఉండొద్దని. తడిగా ఉండే ఎలక్ట్రికల్ స్తంభాలను ముట్టుకో రాదని ఎస్ఐ ప్రజల ను కోరారు