Kalyana Lakshmi Cheques Distributed in Bhupalpally
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాలపై భారం తగ్గించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందిస్తాం అని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ప్రజలకు ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, బుర్ర కొమురయ్య వైస్ ఛైర్మన్, అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్ శారద ఉడుత మహేందర్ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
