MEPA ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

మొగుళ్ళపల్లి మండల MEPA అధ్యక్షుడు నీరటి మహేందర్ ముదిరాజ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 31

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని “న్యూ సైన్స్ కాలేజీలో మెపా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా” ఫిబ్రవరి 4 తేదీన జరిగే జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్లపల్లి మండల. అధ్యక్షుడు నీరటి మహేందర్ ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెపా రాష్ట్ర అధ్యక్షులు డా.కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని,ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానని,ఈ జాబ్ మేళాలో పాల్గొని,పలు కంపెనీల ఇంటర్వ్యూ లో పాల్గొని జాబ్ సాధించాలని, నిరుద్యోగ యువత కష్టనష్టాలను చలించిపోయి, నిరుద్యోగులకు మెపా ఆధ్వర్యంలో పలు జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ,నిరుద్యోగులకు అండగా మెపా ఉంటూ,మెపా ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని మొబైల్ నెంబర్ 9705214964 9701011801 ను సంప్రదించాలని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!