బార్ అధ్యక్షులు వలుసా సుదీర్ ను కలిసిన
వరంగల్ పోపా :-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
ఇటీవల వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సుధీర్ వలుస ను వరంగల్ బార్ అంబేద్కర్ హాల్ లో పోపా కార్యవర్గం మంగళవారం శాలువా, పూల మాల తో ఘనంగా సన్మానంచించారు.
ఈ సందర్బంగా పోపా రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ, 20సంవత్సరాల తర్వాత వరంగల్ బార్ అధ్యక్షులు గా పద్మశాలి ఉండటం పద్మశాలి కులానికి గౌరవం దక్కిందని, భవిష్యత్తులో మన సామజిక వర్గానికి వన్నె తేవాలని కోరారు.న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వరంగల్ పోపా అధ్యక్షులు గుండు కామేశ్వర్ మాట్లాడుతూ,యువ న్యాయవాది సుధీర్ బార్ అధ్యక్షులుగా విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రతినిధులు గోషికొండ సుధాకర్, ధర్మపురి రాజగోవింద్, పాము శ్రీనివాస్, మాటేటి అశోకకుమార్, న్యాయవాదులు నల్ల మహాత్మ, అనుమాండ్ల రాజకుమార్, మెరుగు సుభాష్, చెన్నూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు