Medical Shops Bandh in Jharasangam
ఝరాసంగం మెడికల్ షాపుల బంద్
జహీరాబాద్ నేటి దాత్రి:
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల యజమానులు చేపట్టిన బంద్కు మద్దతుగా ఝరాసంగం మండలంలోని మెడికల్ దుకాణాలు బుధవారం స్వచ్ఛందంగా మూతపడ్డాయి.ఆన్లైన్ మందుల విక్రయాలు,ఫార్మసీ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో మెడికల్ షాపులు మూతపడటంతో సాధారణ రద్దీ తగ్గింది.అత్యవసర అవసరాల కోసం వచ్చిన ప్రజలు మందులు లభించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిచోట్ల మాత్రమే అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.ఫార్మసీ రంగానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.
