కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ.
చిట్యాల, నేటిధాత్రి :
దుర్గామాత ఆశీస్సులతో మండల ప్రజలు సంతోషంగా ఉండాలని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి మొకిరాల మదువంశీకృష్ణ ఆకాంక్షించారు. గురువారం
చిట్యాల మండలంలోని నైన్ పాక,చిట్యాల (చింతళ్లపల్లి), తిర్మలాపూర్, చల్లగరిగె, జడల్ పేట, గోపాలపురం గ్రామాల్లో దుర్గాదేవి మండపాలను దర్శించుకున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకరణకు 10 చీరల చొప్పున సమర్పించడం జరిగింది. ఈసందర్బంగా శ్రీ రామకృష్ణ పరమహంస ట్రస్ట్
ట్రస్ట్ సభ్యులు శాలువతో సన్మానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నరేందర్ స్వామి,నక్క భాస్కర్, కంచర్ల రమేష్, సుదగాని ప్రభాకర్, నూక వీరయ్య, , నాపాక చైర్మన్ యాదండ్ల రాజయ్య, నక్క రవి,చిన్నాల శ్రీనివాస్,నూక రాజు,మహేష్,శివ,రమేష్, చిన్నాలసాయి, వెంకటేశ్వర్లు,సావటి రవి,గడిపెళ్లి విజేందర్ తదితరులు పాల్గొన్నారు.